అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నవంబర్‌ 14 నుంచి ఇసుక వారోత్సవాలు: సెలవులు రద్దు...అక్రమ రవాణపై కఠిన చర్యలు: సీఎం జగన్..!

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో ఇసుక కొరత పైన రాజకీయంగా వేడి పెరుగుతున్న వేళ..ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14 నుండి నవంబర్ 21 వరకూ ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. గతంలో సరాసరి ఇసుక డిమాండ్ 80 వేల టన్నులు ఉండేదని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. గత వారం రోజులుగా పరిస్థితి మెరుగుపడిందన్నారు. వరదల కారణంగా రీచ్ లు మునిపోవటంతో సమస్య వచ్చిందని.. ప్రస్తుతం అది 1.20 లక్షల టన్నులకు రోజు వారి పెరిగిందని వివరించారు. రీచ్ ల సంఖ్య సుమారు 60 నుంది 90కి పైగా పెరిగిందని పేర్కొన్నారు. 1.2లక్షల టన్నులను 2 లక్షల టన్నుల వరకూ వచ్చే వారంరోజుల్లో పెంచాలిని సీఎం ఆదేశించారు.

ఇసుక మింగేస్తున్న రోజా, నాని అనుచరులు.. వెంకయ్యను విమర్శించే స్థాయి వైఎస్ జగన్‌కు లేదు?టీడీపీ !ఇసుక మింగేస్తున్న రోజా, నాని అనుచరులు.. వెంకయ్యను విమర్శించే స్థాయి వైఎస్ జగన్‌కు లేదు?టీడీపీ !

స్టాక్ పాయింట్లు పెంచాలి..
ఏపీలో ప్రస్తుతం ఉన్న 137 నుంచి 180 వరకూ స్టాక్‌ పాయిట్లు పెంచాలని సూచించారు. ఇసుక వారోత్సవాల్లో భాగంగా ఇవన్నీ చేయాలన్నారు. జేసీలను ఇన్‌ఛార్జీలు పెట్టాం కాబట్టి.. వారు స్టాక్‌పాయింట్లను పూర్తిగా పెంచాలని సీఎం నిర్దేశించారు. వారోత్సవం అయ్యేలోపు 180కిపైగా స్టాక్‌ పాయింట్లు ఉండాలని స్పష్టం చేసారు. అదే సమయంలో నియోజకవర్గాల వారీగా రేటు కార్డును ప్రకటించాలని స్పష్టం చేసారు. రేపు, ఎల్లుండిలోగా రేటు కార్డు డిసైడ్‌ చేయాలని సూచించారు. అదే విధంగా.. ఎవరైనా ఎక్కువ అమ్మితే పెనాల్టీయేకాదు.. సీజ్‌ చేయడమే కాదు.. 2 ఏళ్ల వరకూ జైలుశిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చేందుకు రేపు కేబినెట్‌ ఆమోదం కూడా తీసుకుంటామని సీఎం స్పష్టం చేసారు. జిల్లాల వారీగా రేటు కార్డులపై ప్రచారం చేయండని సీఎం సూచించారు.

cm jagan ordered officials to observe sand week from 14 to 21st to improve supply

అధికారుల సెలవుల రద్దు..
ఇసుక కొరత తీరేంతవరకూ ఎవ్వరూడా సెలవులు తీసుకోకూడదని సీఎం ఆదేశించారు. ఇసుక తవ్వకాల్లోకాని.. విక్రయాల్లోకాని సిబ్బంది సెలవులు తీసుకోకుండా పనిచేయాలని స్పష్టం చేసారు. సరిహద్దుల్లో ప్రతి చోటా చిన్నరూట్లు.. పెద్ద రూట్లలో చెక్‌పోస్టులు పెట్టాలిని..వీడియో కెమెరాలు పెట్టాలని సూచించారు. 10 రోజుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు.. సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తికావాలని సీఎం మార్గదర్శకం చేసారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్‌ అండ్‌ బి, ఏపీ ఎండీసీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అక్రమ రవాణా, ప్రకటించిన ధరలకు మించి ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం అదికారులకు స్పష్టం చేసారు.

English summary
cm jagan ordered officials to observe sand week from 14 to 21st of this month. suggested to concentrate on improve sand supply.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X