• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విగ్రహాల ధ్వంసంపై ఇక కఠిన చర్యలే- ఎవరినీ లెక్క చేయొద్దని కలెకర్లు, ఎస్పీలకు జగన్‌ ఆదేశాలు

|

ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న ఆలయ ఘటనలపై సీఎం జగన్ ఇవాళ మరోసారి సీరియస్‌ అయ్యారు. ఇలాంటి ఘటనలకు కారకులను వెతికి పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని, విపక్షాలతో పాటు మీడియాకూ అవకాశం ఇవ్వొద్దని కలెకర్లు, ఎస్పీలకు జగన్‌ సూచించారు. ఆలయాల్లో విగ్రహాల విధ్వంసం జరుగుతున్న సమయం, ఇతర పరిస్ధితులను బట్టి చూస్తుంటే గెరిల్లా తరహా యుద్దం జరుగుతున్నట్లుందని జగన్ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి కారకులను శిక్షించే విషయంలో ఎవరినీ లెక్క చేయొద్దని జగన్ ఆదేశాలు జారీ చేశారు.

ఏబీని వెంటాడుతున్న జగన్ సర్కార్‌-ముందస్తు బెయిల్‌ ప్రయత్నాలు-ఐపీఎస్‌లకు లేఖఏబీని వెంటాడుతున్న జగన్ సర్కార్‌-ముందస్తు బెయిల్‌ ప్రయత్నాలు-ఐపీఎస్‌లకు లేఖ

 రాష్ట్రంలో గెరిల్లా వార్‌ఫేర్

రాష్ట్రంలో గెరిల్లా వార్‌ఫేర్

రాష్ట్రంలో ప్రస్తుతం గెరిల్లా తరహా యుద్ధ తంత్రం అమలు జరుగుతోందని, ఇది చాలా కొత్త అంశమని సీఎం జగన్‌ ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన స్పందన కార్యక్రమంలో తెలిపారు. ఎక్కడైనా దొంగతనాలు జరిగితే పోలీసులు పట్టుకునే పరిస్థితులు పోయి కొత్త ఘటనలు చోటు చేసుకుంటున్నాయని జగన్‌ అన్నారు. రాజకీయ దురుద్దేశాలతో గుళ్లలో విధ్వంసాలు జరుగుతున్నాయని, ఎవరూ లేని ప్రదేశాల్లో.. అర్థరాత్రి పూట.. అందరూ పడుకున్నాక.. తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో గుళ్లపై దాడులు చేసి, వాటిలోని విగ్రహాలను పగలగొడుతున్నారని జగన్ తెలిపారు.

గుళ్ల ఘటనలపై ప్రచారం తర్వాత ప్రసారం...

గుళ్ల ఘటనలపై ప్రచారం తర్వాత ప్రసారం...

రాష్ట్రంలో గుళ్లలో జరుగుతున్న విధ్వంస ఘటనలను ఆ తర్వాత రోజు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఆ వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 లాంటి మీడియా సంస్థలు వాటిని అదే పనిగా ప్రసారం చేస్తున్నాయని జగన్ కలెక్టర్లు, ఎస్పీలకు తెలిపారు. దాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్ష పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నట్లు వారికి గుర్తుచేశారు. ఇంటింటికీ అనేక సంక్షేమ ఫలాలు అందిస్తుంటే.. జీర్ణించుకోలేక, తట్టుకోలేక దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని జగన్‌ పేర్కొన్నారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎన్నో సేవలందుతున్నాయని, దీంతో ఏం చేయాలో తోచక, అలాంటి పనులకు ఒడిగడుతున్నారన్నారు. దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనుకుంటున్నారనిజగన్ పేర్కొన్నారు. ఇలాంటి నేరాలను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకోవాల్సిన అన్యాయమైన పరిస్థితుల్లో మనం ఉన్నామన్నారు.

కఠినంగా ఉండండి, ఎవరినీ లెక్క చేయొద్దు..

కఠినంగా ఉండండి, ఎవరినీ లెక్క చేయొద్దు..

రాష్ట్రంలో తాజా ఘటనలను చాలా జాగ్రత్తగా నిఘా పెట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఇప్పటికే 36 వేల సీసీ కెమెరాలు గుళ్లలో ఉన్నాయని, అయినా ఘటనలు జరుగుతూనే ఉన్నాయని జగన్‌ తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్ధితులు రాలేదని, కాీ ప్రస్తుతం పరిస్ధితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఈ రాజకీయ గెరిల్లా వార్‌ఫేర్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో మత సామరస్యం గురించి ప్రజల్లో ప్రచారం చేయాలని జగన్‌ సూచించారు. మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు పెంచే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించరారు. ఈ క్రమంలో ఎవ్వరినీ లెక్క చేయవద్దన్నారు. ఘటనలు ఏమైనా జరిగితే వాటిని ఖండించాలి. సామరస్యం పెంచాలి.
అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తే వారికి గుణపాఠం చెప్పాలి.
విగ్రహాలను ధ్వంసం చేస్తే మాత్రం కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఘటనను లోతుగా పరిశీలన చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
ఎవరు చేస్తున్నారన్నది కూడా బహిర్గతం చేయాలన్నారు.

English summary
in wake of latest incidents in andhra pradesh temples, cm jagan orders collectors and sps to take stringent action against culprits with immediate effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X