వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యంగపరమైన విధులున్నాయి.. హజరునుండి మినహాయింపు ఇవ్వండి : సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి వ్యక్తిగత హజరు మినహాయింపుపై పిటీషన్‌పై వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదన విన్న నాంపల్లి కోర్టు తీర్పును నవంబర్ ఒకటికి వాయిదా వేసింది. అయితే పిటిషన్‌పై సీబీఐ అడ్వకేట్ వినిపించిన వాదనల్లో ఉపయోగించిన భాషపై జగన్ తరపున న్యాయవ్యాది అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజాలతో సంబంధం లేకుండా ఊహజనితమైన కారణాలను సీబీఐ కౌంటర్‌‌లో ప్రస్తావించిందని వాదించారు.

ఈ నేపథ్యంలోనే జగన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగత హజరు నుండి మినహయింపు నివ్వాలని కోర్టును కోరారు. కోర్టులో హజరుకాకపోవడం వల్ల విచారణలో జరిగే ఆలస్యంపై తెలపాలని అడిగారు. గత ఆరు సంవత్సరాల్లో ఎప్పుడు కూడ కేసును వాయిదా కాని, స్టే గాని అడగలేదని వివరించారు. రాజ్యంగబద్దమైన సీఎం పదవిలో ఉండడం వల్ల రాలేకపోతున్నానని తెలిపారు. ఈనేపథ్యంలోనే ప్రజలకు సంబంధించిన విసృత ప్రయోజనాలు ఉండడం వల్ల రాలేకపోతున్నట్టు చెప్పారు. గతంలో పాదయాత్ర సంధర్భంగా అడిగిన నేపథ్యంలోనే రాజకీయ అవసరాలకు మినహాయింపును ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు.

CM Jagan personal attendence at cbi court case postponed to November 1

మరోవైపు సాక్ష్యులను ప్రభావితం చేసినట్టు ఏనాడైన ఆరోపణలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అయితే కోర్టులో వాదనలు వినిపించిన సీబీఐ తరపు న్యాయవాది మాత్రం గతంలో కోర్టు అన్ని పరీశీలించిన తర్వాతే వ్యక్తిగత హజరుపై మినాహయింపుకు నిరాకరించిందని చెప్పారు. ఆయన హోదా మినహా కేసు పరిస్థితుల్లో ఎలాంటీ మార్పు లేదని వివరించారు. దీంతో ఆయన హజరుపై మినహాయింపును ఇవ్వకూడదని కోర్టును కోరారు.

English summary
arguments for exemption of personal attendance in front of the cbi court of AP CM Jagan Mohan Reddy have ended.The verdict postponed to November 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X