అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ రియాక్షన్ : ఓర్వలేకనే టీడీపీ బూతులు - తట్టుకోలేక అభిమానులు ఆవేశంతో..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల పైన ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. జగనన్న తోడు పధకంలో భాగంగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. చెప్పిన మాట నిలబెట్టుకొనేందుకు ప్రతీ క్షణం ప్రయత్నిస్తున్నామని..ప్రజలు ప్రతీ ఎన్నికల్లోనూ అండగా నిలిచారని సీఎం చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎవరూ మాట్లాడని.. ఎప్పడూ వినలేని దారుణమైన బూతులు తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ బూతులు వినలేక.. అభిమానులు..ఆప్యాయత చూపించే వారి నుంచి వారు తట్టుకోలేక వారిలో రియాక్షన్ కనిపిస్తుంని చెప్పారు.

వైషమ్యాలు తీసుకొచ్చేందుకే ఈ ప్రయత్నాలు

వైషమ్యాలు తీసుకొచ్చేందుకే ఈ ప్రయత్నాలు

ప్రజల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసి అలజడికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మతాలు - కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారంటూ ధ్వజ మెత్తారు. పేద వాడికి మంచి జరగకూడదని..మంచి జరిగితే జగన్ కు పేరు వస్తుందనే కారణంగా రకరకాలుగా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కోర్టుల్లో వారే కేసులు వేస్తారు..పధకాలు అందకుండా వారే అడ్డుకుంటారని చెప్పుకొచ్చారు.

ఎప్పుడూ ఇటువంటి బూతులు వినలేదు

ఎప్పుడూ ఇటువంటి బూతులు వినలేదు


ఎన్ని అడ్డంకులు వచ్చినా...రెండున్నారేళ్ల కాలంలో ప్రజలు మెచ్చుకొనేలా..వారికి మేలు జరిగేలా పాలన సాగుతోందని జగన్ చెప్పారు. అసత్యాలు ప్రచారం చేయటం.. వారికి ఒక సెక్షన్ మీడియా మద్దతు ఇస్తోందని చెప్పుకొచ్చారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా..ఏ రోజు ఈ రకంగా వ్యవహరించలేదని..ఇటువంటి భాష ఉపయోగించలేదని చెప్పారు. కావాలని తిట్టించి..కావాలని వైషమ్యలు తీసుకురావాలనేది వారి లక్ష్యమని జగన్ వ్యాఖ్యానించారు. టీడీపీ రకరకాలుగా అడ్డంకులు తీసుకురావటానికి ప్రయత్నిస్తోందని సీఎం వివరించారు.

వివక్ష లేని పాలన అందిస్తున్నాం...

వివక్ష లేని పాలన అందిస్తున్నాం...

రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే
సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి.. కుల,మత, ప్రాంతం, పార్టీలతో నిమిత్తం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లార చూశానని సీఎం అన్నారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులకు జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి కలుగుతుందన్నారు.

ఇప్పటి వరకు 905 కోట్లు అందించాం..

ఇప్పటి వరకు 905 కోట్లు అందించాం..

ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10వేల వడ్డీలేని రుణం అందిస్తున్నామని సీఎం చెప్పారు. ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ.905 కోట్లు పంపిణీ చేశాం. ఇప్పటివరకు సకాలంలో చెల్లించిన 4.50 లక్షల మందికి రూ.16.36 కోట్ల వడ్డీ జమ చేస్తున్నామని వివరించారు. ఏడాదిలో రెండుసార్లు డిసెంబర్, జూన్లో జగనన్న తోడు కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. రుణాలు చెల్లించిన వారికి కొత్త లోన్లు ఇస్తామని. కొత్త రుణాలతో పాటు కట్టిన వడ్డీని వాపసు ఇస్తామంటూ సీఎం హామీ ఇచ్చారు.

English summary
CM Jagan Reacted on latest attacks on TDP offices and Pattabbi comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X