వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ ఏ సమస్య ఉన్నా.. ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటా: సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం వెల్లడించారు. విదేశాల్లో చదువుకొనే విద్యార్ధులకు సీఎంవోలోని ఒక అధికారి అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం వెల్లడించారు. విదేశాల్లో చదువుకునే మన పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సీఎంవో నుంచి ఒక టెలిఫోన్‌ నంబర్‌ ఇస్తామని... ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. సీఎంవోలోని ఒక అధికారి అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. తానే వాళ్లకు అండగా ఉన్నట్లేనని.. మీకు అక్కడ ఏ సమస్య ఉన్నా.. ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటానని సీఎం చెప్పారు. బెస్ట్‌ ఆఫ్‌ ది యూనివర్సిటీ కాలేజీలను గుర్తించామని చెప్పారు. వాటి జాబితాను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. బెస్ట్‌ యూనివర్సిటీ, కాలేజీల్లో మన పిల్లలకు సీటు వస్తే పారదర్శకంగా వారికి సపోర్ట్‌ చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ప్రభుత్వం అండగా నిలబడుతోంది

ప్రభుత్వం అండగా నిలబడుతోంది

ప్రతిభ ఉండి గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో సీట్లు సాధించి ఫీజులు కట్టలేక వెనకడుగు వేస్తున్న మన పిల్లలకు మనందరి ప్రభుత్వం అండగా నిలబడుతోంది. మన పిల్లలు బాగా చదువుకోవాలి.. ప్రపంచ వేదికపై మన ఆంధ్ర రాష్ట్ర జెండా ఎగురవేయాలని ముఖ్యమంత్రి సూచించారు.జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా గరిష్టంగా రూ.1.25 కోట్లను చెల్లిస్తున్నామని చెప్పారు. టాప్‌ 200 యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన 213 మంది మన పిల్లలకు తొలి విడతగా రూ.19.95 కోట్ల సాయాన్ని ముఖ్యమంత్రి విడుదల చేసారు.య చదువుకు పేదరికం అడ్డుకాకూడదని, పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువే అని బలంగా నమ్ముతున్నానన్నారు. ఎడ్యుకేషన్‌లో మనం పెట్టే ప్రతి రూపాయి హ్యుమన్‌ రిసోర్సెస్‌లో పెట్టడం వల్ల వారి కుటుంబాల తలరాతలు మారడమే కాకుండా.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలరాత మార్చే గొప్ప పరిస్థితి వస్తుందని చెప్పారు.
సీఎంఓ నెంబర్ కేటాయింపు

సీఎంఓ నెంబర్ కేటాయింపు


ప్రముఖుల పేర్లు ప్రస్తావించిన సీఎం జగన్ వారి స్పూర్తి తో ముందుకు అడుగేయండి.. ప్రభుత్వం మీకు మంచి వేదికను అందిస్తోంది. ఆ స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. గతంలో ఉన్న పథకాలన్నీ అధ్యయనం చేశాం.. అవి కేవలం పేరుకు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రస్తుత త్వం చిత్తశుద్ధితో పరిస్థితులన్నీ మార్చాలనే తపన, తాపత్రయం నుంచి ఈ ఆలోచన పుట్టుకొచ్చిందని వివరించారు. ఏ విధమైన కోటాలు లేకుండా అర్హులైన విద్యార్థులందరికీ సంతృప్త స్థాయిలో 'జగనన్న విదేశీ విద్యా దీవెన'.. ప్రతి ఏడాది 2 సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు.. సంబంధిత శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీల నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ ద్వారా పూర్తి పారదర్శకంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని వివరించారు.

అర్హులందరికీ లబ్ది జరుగుతుంది

అర్హులందరికీ లబ్ది జరుగుతుంది

నాణ్యమైన విద్యకు పట్టం కడుతూ వరల్డ్‌ యూనివర్సిటీ క్యూఎస్‌Sర్యాంకింగ్స్‌ ప్రకారం టాప్‌ 200 యూనివర్శిటీల ఎంపిక జరిగిందని వెల్లడించారు. విదేశీ విశ్వవిద్యాలయానికి వెళ్లే విద్యార్థులకు విమాన, వీసా ఛార్జీలు సైతం ప్రభుత్వం రీయంబర్స్ చేస్తోందన్నారు. విదేశాలకు వెళ్ళే విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకునేలా వారి చదువులు ఒక్కో మెట్టూ ఎక్కే కొద్ది 4 వాయిదాల్లో స్కాలర్షిప్స్‌ మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇమ్మిగ్రేషన్‌ కార్డు (ఐ-94) పొందిన విద్యార్థులకు మొదటి వాయిదా. మొదటి సెమిస్టర్‌ ఫలితాల అనంతరం రెండవ వాయిదా, 2వ సెమిస్టర్‌ ఫలితాలు విడుదలైన తర్వాత 3వ వాయిదా. విజయవంతంగా 4వ సెమిస్టర్‌ పూర్తి చేసి మార్క్‌ షీట్‌ సంబంధిత ఆన్లైన్‌ పోర్టల్‌ లో అప్లోడ్‌ చేసిన తర్వాత చివరి విడతగా నాలుగవ వాయిదా చెల్లింపు చేస్తున్నామని చెప్పారు. తద్వారా శాచురేషన్‌ విధానంలో పూర్తి పారదర్శకంగా నిజమైన అర్హులందరికీ లబ్ధి కలుగుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

English summary
CM Jagan Assured support for higher studies in abroad from AP, Realses Jaganana Videsi Viday Kanuka Funds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X