వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జవాద్ తుఫానుపై జగన్ సమీక్ష-ఛాన్స్ తీసుకోవద్దని అధికారులకు సూచన- జిల్లాకు 10 కోట్లు

|
Google Oneindia TeluguNews

ఉత్తర కోస్తా జిల్లాలకు జవాద్‌ తుపాను ముప్పు నేపధ్యంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి పరిస్ధితిని అయినా ఎదుర్కొనేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదని, ఒక్క మరణం కూడా సంభవించొద్దని జగన్ ఆదేశించారు. ఆ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

తుపాను సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్‌ ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. సహాయ చర్యల్లో ఏ లోపం ఉండకూడదని, జిల్లాలకు వెళ్లిన ప్రత్యేక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ శిబిరాల్లో ఆహార నాణ్యత చాలా ముఖ్యమని, అలాగే మంచినీరు, టాయిలెట్లు.. ప్రతి ఒక్కటీ నీట్‌గా ఉండాలన్నారు. ఎక్కడా ఏ లోపం లేకుండా చూడాలని జగన్ సూచించారు.

cm jagan review cyclone jawad situation, alert officials in five districts including northern andhra

అన్ని జిల్లాలలో అవసరమైన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉండాలని, ఆ మేరకు మరోసారి అన్ని చోట్ల పరిస్థితులు సమీక్షించాలని సూచించారు. ఇంకా అదనపు బృందాలను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడెక్కడ ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఉంటాయని భావిస్తే, అక్కడి ప్రజలను ముందుగా గట్టిగా అప్రమత్తం చేయాలి. వారిని తరలించాలన్నారు.
చెరువులు, కాల్వలు, రిజర్వాయర్ల కట్టలు ఎలా ఉన్నాయన్నది చూడాలని కూడా కోరారు. ఎక్కడైనా వాటికి గండ్లు పడ్డాయని తెలిసినా లేదా బలహీనంగా ఉన్నాయని గుర్తించినా వెంటనే జల వనరుల శాఖ అధికారులతో మాట్లాడమని అధికారుల్ని ఆదేశించారు. వెంటనే అత్యవసర మరమ్మతులు చేపట్టమని సూచించారు.

ఇప్పటికిప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు తుపాన్‌ ముప్పు లేనప్పటికీ, అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండమన్నారు. ఉత్తరాంధ్రతో పాటు, ఉభయ గోదావరి జిల్లాలలో ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ వెల్లడించారు.

ఇప్పటికే 11 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 6 కోస్ట్‌గార్డ్‌ టీమ్‌లు, 10 మెరైన్‌ పోలీస్‌ బృందాలు, 5 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 18 ఫైర్‌ సర్వీస్‌ టీమ్‌లను ఉత్తరాంధ్ర జిల్లాలలో మొహరించామని ఆయన తెలిపారు. ఇంకా 115 జేసీబీలతో పాటు, మరో 115 టిప్పర్లు కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు. 232 నీళ్ల ట్యాంకర్లు, 295 డీజిల్‌ జనరేటర్లు, 46,322 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 1,018 మెట్రిక్‌ టన్నుల పప్పులు, 41,032 లీటర్ల వంటనూనె, 391 టన్నుల పంచదారను ఆయా జిల్లాలకు పంపించామని అన్నారు.

వీటితో పాటు వైద్య బృందాలు, అవసరమైన ఔషథాలను పంపించడంతో పాటు, లోతట్టు ప్రాంతాలకు చెందిన 54 వేల కుటుంబాలను సహాయ శిబిరాలకు తరలించే విధంగా తగిన ఏర్పాట్లు చేసినట్లు సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ వివరించారు.
కాగా, ఈనెల 5వ తేదీ మధ్యాహ్నం పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావం వల్ల రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

English summary
ap cm ys jagan on today review cyclone jawad situation with five district collectors from his camp office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X