రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా కొత్త స్ట్రెయిన్ పై సీఎం జగన్ సమీక్ష: యూకే, బ్రిటన్ ప్రయాణీకుల ట్రాకింగ్, టెస్టింగ్ పై దిశా నిర్దేశం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఇటీవల బ్రిటన్ ,యూకే ల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వందల సంఖ్యలో ప్రయాణికులు రావడంతో కరోనా కొత్త స్ట్రెయిన్ విషయంలో నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్తగా విస్తరిస్తున్న కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

Recommended Video

New Corona Strain : AP CM Jagan Review Meeting Over New Corona Strain
బ్రిటన్ నుండి 1200 మంది ప్రయాణికులు వచ్చినట్టు గుర్తించిన అధికారులు

బ్రిటన్ నుండి 1200 మంది ప్రయాణికులు వచ్చినట్టు గుర్తించిన అధికారులు

కరోనా కొత్త రకం వైరస్ పై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి యూకే నుంచి వచ్చిన వారికి కచ్చితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. వైద్య శాఖ అధికారులను అడిగి ప్రస్తుతం ఏపీలో యూకే నుంచి వచ్చిన వారికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వైద్య శాఖ అధికారులు ఇప్పటివరకు బ్రిటన్ నుండి 1200 మంది ప్రయాణికులు వచ్చినట్లుగా గుర్తించినట్లు తెలిపారు.

జిల్లాల వారీగా ట్రాకింగ్ , టెస్టింగ్ .. అందరినీ క్వారంటైన్ చేశామని అధికారుల వెల్లడి

జిల్లాల వారీగా ట్రాకింగ్ , టెస్టింగ్ .. అందరినీ క్వారంటైన్ చేశామని అధికారుల వెల్లడి

బ్రిటన్ నుండి వచ్చిన ప్రయాణికుల డేటాను ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు పంపించి, తక్షణం వారికి పరీక్షలు నిర్వహించవలసిందిగా ఆదేశించామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 21 వేల మంది బృందంతో బ్రిటన్ నుండి వచ్చిన ప్రయాణికుల ట్రాకింగ్ ప్రక్రియ కొనసాగుతోందని వైద్య శాఖ అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. యూకే నుండి రాజమండ్రి కి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, అయితే అది కరోనా కొత్తరకం వైరస్ నా కాదా అన్నది నిర్ధారణ కావలసి ఉందని వారు జగన్ దృష్టికి తీసుకు వెళ్లారు.

యూకే , బ్రిటన్ కరోనా కొత్త రకం స్ట్రెయిన్ ఆందోళనలో ఏపీ .. అప్రమత్తంగా ఉండాలన్న సీఎం

యూకే , బ్రిటన్ కరోనా కొత్త రకం స్ట్రెయిన్ ఆందోళనలో ఏపీ .. అప్రమత్తంగా ఉండాలన్న సీఎం

యూకే నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆర్ టి పి సి ఆర్ టెస్టులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. యూకే నుండి వచ్చిన మహిళతో రైల్లో రాజమండ్రి నుండి మచిలీపట్నం ప్రయాణించిన ప్రయాణికులకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని వారందరినీ క్వారంటైన్ చేశామని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. మొత్తానికి యూకే కరోనా వైరస్ ఇప్పుడు ఏపీలో ఆందోళనకు కారణంగా మారింది. ప్రస్తుతం ఏపీలో యూకే నుండి, బ్రిటన్ నుండి వచ్చిన వాళ్ళంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఎక్కడ వారు కరోనా కొత్త రకం వైరస్ తీసుకువచ్చి వ్యాప్తి చేస్తారో అని హడలెత్తిపోతున్నారు.సీఎం జగన్ అధికారులే కాదు,ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

English summary
AP CM Jagan ,conducted a review on the new type of corona virus strain, advised the authorities to conduct strict corona tests on those from the UK.Officials told CM Jagan the details of UK, Britain travellers and they are in tarcking and testing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X