వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద‌కు జ‌గ‌న్: అదే రోజున కీల‌క నిర్ణ‌యం : గోదావ‌రి జిలాల వినియోగంపై సూచ‌న‌లు..

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పోల‌వ‌రం ప్రాజెక్టును నేరుగా సంద‌ర్శించాల‌ని నిర్ణ‌యించారు. త్వ‌ర‌లోనే ఆయ‌న ప్రాజెక్టు వ‌ద్ద‌కు వెళ్ల‌నున్నారు. ఇరిగేష‌న్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన జ‌గ‌న్ ప్రాజెక్టు పురోగ‌తి..ఆర్దిక ప‌రిస్థితి..భ‌విష్య‌త్ ప‌నుల గురించి ఆరా తీసారు. ఇదే స‌మ‌యంలో పోల‌వ‌రం ప్రాజెక్టు యుద్ద ప్రాతిప‌దిక‌న పూర్తి కావాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసారు. గోదావ‌రి జిల‌ల స‌ద్వినియోగం పైనా ప‌లు కీల‌క సూచ‌న‌లు చేసారు.

పోల‌వ‌రంకు ప్రాధాన్య‌త‌..
రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు.. పనుల పురోగతితోపాటు కీలక ప్రాజెక్టుల వద్ద జరుగుతున్న పనుల తీరును సీఎం జగన్‌సమీక్షించారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది.. రాష్ట్రం లోని తాగునీటి, సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేసి.. వీలైనంతగా తొందరగా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన స‌మీక్షించారు. ఇదే స‌మ‌యంలో పోల‌వ‌రం వాస్త‌వ ప‌రిస్థితుల పైన ఆయ‌న అడిగిన స‌మాచారం పూర్తి స్థాయిలో ఈనెల 6వ తేదీకి సిద్దం చేయాల‌ని సూచించారు. త్వ‌ర‌లోనే పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం సందర్శిస్తాన‌ని..ఆ స‌మ‌యంలో పోల‌వ‌రం అధారిటీ అధికారుల‌ను రావాల్సిందిగా సూచించాల‌ని ఆదేశించారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధుల కొర‌త లేద‌ని సీఎం స్ప‌ష్టం చేసారు.

CM Jagan review on Polavaram project and decided to visit project site shortly

గోదావ‌రి నీరు స‌ద్వినియోగం చేసుకోవాలి..
రాష్ట్రంలో భ‌విష్య‌త్‌లో ఎప్పుడూ క‌రువు అనేది లేకుండా ప‌క్కా ప్ర‌ణాళికా బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. గోదావ‌రి జ‌లాలు నిరుప‌యోగంగా మారుతున్నాయ‌ని.. అనేక టీఎంసీల నీరు స‌ముద్రంలోకి పోతున్న విష‌యాన్ని గుర్తించాల‌ని సూచించారు. ఆ నీటిని ఏపీలో స‌ద్వినియోగం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అదే విధంగా ప్రాజ‌క్టుల వారీగా జ‌రుగుతున్న ప‌నులు..నిధుల కేటాయింపు..పెండింగ్ బిల్లులు వంటి వాటి గురించి పూర్తి స్థాయిలో నివేదిక‌తో ఈ నెల 6వ తేదీకి సిద్దం కావాల‌ని ఆదేశించారు. ఏపీలో ప్రాజెక్టుల గురించి పూర్తి స్థాయిలో నివేదిక‌ల‌తో రావాల‌ని..ఆ స‌మీక్ష‌లో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ సిద్దం చేద్దామ‌ని జ‌గ‌న్ నిర్ధేశించారు.

English summary
CM Jagan review on Polavaram project and decided to visit project site shortly. CM directed officials to utilise the Godavari water which going to ocean.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X