వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ నిర్ణయం ..ఆ కులాల వారికి కుల ధృవీకరణ పత్రం లేకున్నా వైఎస్సార్ చేయూత పథకం వర్తింపు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ముందుకు వెళుతున్నారు . అన్ని కులాల, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పిన జగన్ వైయస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనారిటీ మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ,తద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వెయ్యాలని పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే . ఈ పథకం ద్వారా లబ్దిదారులకు మొత్తం 75 వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది . అయితే ఈ పథకం పొందలేకపోతున్న కులాల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు .

నాలుగు కులాల వారికి కుల ధ్రువీకరణ పత్రం అవసరం లేకుండానే వైయస్సార్ చేయూత పథకం వర్తింపు

నాలుగు కులాల వారికి కుల ధ్రువీకరణ పత్రం అవసరం లేకుండానే వైయస్సార్ చేయూత పథకం వర్తింపు


వైఎస్సార్ చేయూత పథకంలో నాలుగు కులాల వారికి సంబంధించి ఎదురవుతున్నఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుడిగె జంగాలు, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతో ఒరియా కులాల వారికి కుల ధ్రువీకరణ పత్రం అవసరం లేకుండానే వైయస్సార్ చేయూత పథకం వర్తింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నాలుగు కులాల వారికి కుల ధ్రువీకరణ పత్రం పొందడం లో ఇబ్బందులు ఎదురవు తున్న నేపథ్యంలోనే జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

కులధృవీకరణ పత్రం ఇవ్వటంలో ఇబ్బందులు .. జగన్ దృష్టికి తీసుకెళ్ళిన మంత్రులు

కులధృవీకరణ పత్రం ఇవ్వటంలో ఇబ్బందులు .. జగన్ దృష్టికి తీసుకెళ్ళిన మంత్రులు

ఈ నాలుగు కులాల వారికి కుల దృవీకరణ పత్రాన్ని ఇవ్వడంలో ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు మంత్రులు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. బుడిగె జంగాలు, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతో ఒరియా కులాలలో పథకాన్ని పొందడానికి అర్హులు ఉన్నప్పటికీ కుల దృవీకరణ పత్రం కారణంగా లబ్ధి పొందలేకపోతున్నారని సీఎం దృష్టికి తీసుకుపోగా ఆయన వెంటనే నిర్ణయం తీసుకున్నారు.

స్వయం కుల ధ్రువీకరణ పత్రంతోనే అర్హులకు వైయస్సార్ చేయూత పథకం

స్వయం కుల ధ్రువీకరణ పత్రంతోనే అర్హులకు వైయస్సార్ చేయూత పథకం

స్వయం కుల ధ్రువీకరణ పత్రంతోనే అర్హులకు వైయస్సార్ చేయూత పథకం అందించాలని సీఎం ఆదేశించారు. త్వరితగతిన ఈ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. దీంతో అధికారులు లబ్ధిదారుల జాబితా తయారు చేసే పనిలో పడ్డారు. వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా 25లక్షల మంది మహిళల కోసం ఈ సంవత్సరం 4,700 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు గల బీసీ ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం 18,750 రూపాయల చొప్పున నాలుగేళ్లపాటు ఆర్థిక సహాయం అందించనున్నారు.

బుడిగె జంగాలు, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతో ఒరియా కులాల వారికీ లబ్ది

బుడిగె జంగాలు, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతో ఒరియా కులాల వారికీ లబ్ది


మొత్తం వారికి 75 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 12, 2020 నుండి వైయస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సర్కార్ ఇప్పటికే లబ్దిదారుల ఖాతాలలో నగదు జమ చేసింది . ఇక వీరితో పాటు బుడిగె జంగాలు, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతో ఒరియా కులాల వారికీ ఈ పథకం వర్తించనుంది .లబ్దిదారుల జాబితా తయారు చేస్తున్నట్టు వారికి కూడా పథకాన్ని అందించనున్నట్టు సెర్ప్ సిఈఓ రాజాబాబు తెలిపారు .

English summary
The government has taken a key decision in the wake of the difficulties faced by those belonging to the four castes in the YSR Cheyutha scheme. The government has decided to apply the YSR Cheyutha scheme to the Budige jangaalu, the Valmiki, the Eneti Kond and the Bento Oriya castes without the need for a caste certificate. It seems that the Jagan government has taken this decision in the light of the difficulties faced by these four castes in obtaining caste certification.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X