విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ అభివృద్ధికి సీఎం జగన్ కీలక నిర్ణయాలు .. శరవేగంగా పనులు

|
Google Oneindia TeluguNews

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చెయ్యాలని అధికారులను ఆదేశించిన జగన్ తాజాగా విశాఖ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో విశాఖకు మహర్దశ పట్టబోతోందని విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖలో గురు శిష్యుల మధ్య ఆసక్తికర పోరు: మంత్రి అవంతి వర్సెస్ మాజీ మంత్రి గంటావిశాఖలో గురు శిష్యుల మధ్య ఆసక్తికర పోరు: మంత్రి అవంతి వర్సెస్ మాజీ మంత్రి గంటా

లైట్ మెట్రో రైలు పనులను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్న ఏపీ సర్కార్

లైట్ మెట్రో రైలు పనులను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్న ఏపీ సర్కార్

విశాఖ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ అడుగులు వేస్తోంది. పరిపాలన రాజధానిని విశాఖకు తరలించాలని ప్లాన్ చేసిన సర్కార్ అందుకోసం శరవేగంగా పనులు చేయిస్తుంది. ఇక విశాఖలో వీలైనంత త్వరగా లైట్ మెట్రో రైలు పనులను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. విశాఖ కేంద్రంగా సెక్రటేరీయేట్ తరలింపు ప్రక్రియతో పాటే లైట్ మెట్రో రైలు పనుల ప్రక్రియ ప్రారంభించేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

మూడు ట్రామ్ కారిడార్ల ఏర్పాటు చేయాలన్న ఆలోచన

మూడు ట్రామ్ కారిడార్ల ఏర్పాటు చేయాలన్న ఆలోచన

దీంతో లైట్ మెట్రో రైలు పనుల ప్రక్రియకు సన్నాహాలు జరుగుతున్నాయి.రెండు దశల్లో లైట్ మెట్రో, మూడు ట్రామ్ కారిడార్ల ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అందుకు ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించింది. బీచ్ వెంబడి ట్రామ్ కారిడార్లు వచ్చేలా చూడాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో సీఎం సూచనల మేరకు బీచ్ వెంబడి ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు సిద్దమవుతున్నారు అధికారులు.

Recommended Video

GN Rao Press Meet Over AP 3 Capitals Issue || Committee Takes U Turn || Oneindia Telugu
 డీపీఆర్ రూపకల్పనతో పాటు టెండర్ల ఖరారుకు ప్లాన్

డీపీఆర్ రూపకల్పనతో పాటు టెండర్ల ఖరారుకు ప్లాన్

విశాఖలో మొత్తంగా 140 కిలో మీటర్ల మేర లైట్ మెట్రో, ట్రామ్ కారిడార్లు ఏర్పాటు చెయ్యాలని భావిస్తుంది సర్కార్ . ఇక డీపీఆర్ రూపకల్పనతో పాటు టెండర్ల ఖరారును ఏకకాలంలో చేపట్టేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎన్ఏడీ జంక్షన్-పెందుర్తి, అనకాపల్లి-స్టీల్ ప్లాంట్ వరకు రెండు ట్రామ్ కారిడార్లు, పాత పోస్టాఫీస్ నుంచి ఆర్కే బీచ్, రుషికొండ మీదుగా భీమిలీ వరకు బీచ్ వెంబడి మరొక ట్రామ్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక, స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక, తాటి చెట్లపాలెం, కొమ్మాది మీదుగా భోగాపురం ఎయిర్ పోర్టు వరకు లైట్ మెట్రో కారిడార్ లు రాబోతున్నాయి.

English summary
CM Jagan has decided to start the process of light metro train work with the evacuation of capital in Visakhapatnam. The YCP government, which is contemplating setting up of light metro and three tram corridors in two phases, has asked the authorities to prepare proposals. CM YS Jaganmohan Reddy has ordered the tram corridors along the beach, following the CM's instructions, officials are preparing to set up a tram corridor along the beach.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X