వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీదే మొదటి స్థానం .. మారిటైమ్‌ ఇండియా సదస్సులో సీఎం జగన్‌

|
Google Oneindia TeluguNews

మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021 లో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు ప్రారంభించిన ఈ సదస్సులో వర్చువల్ విధానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. నేటి నుండి నాలుగో తేదీ వరకు మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021 సదస్సు కొనసాగనుంది.

మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021 సదస్సులో పాల్గొన్న సీఎం జగన్

మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021 సదస్సులో పాల్గొన్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021 సదస్సులో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, దేశంలోని ఎగుమతుల్లో నాలుగు శాతం ఏపీ వాటా అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ సదస్సులో స్పష్టం చేశారు.

2030 సంవత్సరం నాటికి దేశ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా పది శాతానికి పెంచాలని లక్ష్యం

030 సంవత్సరం నాటికి దేశ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా పది శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేయడానికి కావలసిన అన్ని వనరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారికి ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి జరిగితే 2023 నాటికి వాణిజ్య కార్యకలాపాలు

గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి జరిగితే 2023 నాటికి వాణిజ్య కార్యకలాపాలు

ఇక రామాయపట్నం , మచిలీపట్నం, భావనపాడులలో గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి జరుగుతుందని 2023 నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వీటి ద్వారా అదనంగా వంద మిలియన్ టన్నుల కార్గో రవాణాకు అవకాశం ఏర్పడుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు.


ఏపీలో జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పారిశ్రామికాభివృద్ధికి తీసుకోవలసిన అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు .

English summary
Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy in the Maritime India Summit 2021 said that Andhra Pradesh was ranked number one in the country in Ease of Doing Business 2020. Andhra Pradesh is the second largest coastal state in the country and AP accounts for four per cent of the country's exports, CM Jagan Mohan Reddy said at the conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X