వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులకు మరో శుభవార్త చెప్పిన జగన్ సర్కార్ .. వైఎస్ఆర్ జలకళలోనూ స్వల్ప మార్పులు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పింది. ఒకపక్క వైఎస్సార్ జలకళ పథకం ద్వారా ఉచిత బోర్లు, మోటార్లు పెట్టటమే కాకుండా, ప్రస్తుతం సాగుచేస్తున్న ఖరీఫ్ పంటలకు సైతం ఉచిత పంటల భీమా పథకం అమలు చేస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు 101 కోట్ల రూపాయలను విడుదల చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జగన్ సర్కార్.

Recommended Video

Free Crop Insurance Scheme ఉచిత పంటల భీమా పథకం అమలుకు నిర్ణయం AP Govt,వైఎస్ఆర్ జలకళలో మార్పులు...!!

ఏపీలో ఆర్టీసీ స్థలాలపై సర్వే .. జగన్ సర్కార్ కీలక నిర్ణయం వెనుక మతలబు ఇదేనా ?ఏపీలో ఆర్టీసీ స్థలాలపై సర్వే .. జగన్ సర్కార్ కీలక నిర్ణయం వెనుక మతలబు ఇదేనా ?

 ఖరీఫ్ పంటలకు ఉచిత పంట భీమా అమలుకు నిర్ణయం

ఖరీఫ్ పంటలకు ఉచిత పంట భీమా అమలుకు నిర్ణయం

గత సంవత్సరం గుర్తించిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు కూడా పంట భీమాను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ ఈ దఫా వారికి కూడా పంట భీమా అమలు చేయనుంది.అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఏయే పంటల దిగుబడి ఉంది. అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి. వాతావరణ ఆధారిత బీమా అమలు చేయడానికి కావలసిన అన్ని వివరాలకు సంబంధించిన జాబితాను కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. భీమా క్లెయిమ్స్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించే దిశగా జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే ఆధ్వర్యంలో పని చేయనుంది.

 వైఎస్ఆర్ జలకళలోనూ స్వల్ప మార్పులు

వైఎస్ఆర్ జలకళలోనూ స్వల్ప మార్పులు

వాతావరణ ఆధారిత పంటల బీమా పథకానికి సంబంధించిన క్లెయిమ్స్ ను రెయిన్ స్టేషన్ లు ఇచ్చే సమాచారాన్ని బట్టి పరిష్కరించనున్నట్లుగా తెలుస్తుంది. ఇదే సమయంలో వైయస్సార్ జలకళ పథకంలో కూడా ఏపీ ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఈ పథకంలో భాగంగా ఉచిత బోర్లతో పాటు మోటార్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటితో పాటు ఉచితంగానే విద్యుత్ కనెక్షన్ కూడా అమర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో వ్యవసాయ సంస్కరణలకు శ్రీకారం

ఏపీలో వ్యవసాయ సంస్కరణలకు శ్రీకారం

బోర్ల లోతు, భూమి రకం, ఎంత మేర పంట సాగు అవుతుంది అన్న అంశాల ఆధారంగా పంపుసెట్లను, మోటార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పేర్కొంది .రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన చిన్న సన్నకారు రైతులు అందరికీ ఉచిత బోర్లు వేయడం ద్వారా భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైయస్సార్ జల కళ పథకాన్ని జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రంలో నీటి వసతి లేని భూమి ఉండకూడదని తీసుకున్న నిర్ణయం మేరకే ప్రారంభించారు. రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు .

English summary
The Andhra Pradesh government has given another good news to the farmers. Apart from laying free bores and motors through the YSR jalakala Scheme, the AP government has also issued key directives to implement a free crop insurance scheme for the kharif crops currently under cultivation. Jagan Sarkar has given the green signal by releasing Rs 101 crore for setting up AP General Insurance Corporation Limited.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X