వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ చలించిపోయారు: ఆ చిన్నారులను చూడగానే ఇలా : 15 లక్షల మంజూరు..!

|
Google Oneindia TeluguNews

తిరుపతిలో ఆ చిన్నారులను చూడగానే ముఖ్యమంత్రి జగన్ చలించిపోయారు. ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన కోసం రేణిగుంట ఏయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆయనకు ఇద్దరు బాలికలు మా అన్నకు ప్రాణబిక్ష పెట్టండి అంటూ బోర్డులు పట్టుకొని కనిపించారు. వారిని చూడగానే జగన్ వారి వద్దకు వెళ్లారు. వారి వివరాలు ఆరా తీసారు. ఆ ఇద్దరి అమ్మాయిల కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకున్నారు. వారి సోదరుడికి ఏం జరిగిందో..అసలు సమస్య ఏంటని విచారించారు. వారు చెప్పిన సమాచారంతో సీఎం జగన్ చలించారు. వెంటనే వారికి సాయంగా పది లక్షలతో పాటుగా వారి భవిష్యత్ చదువుల కోసం మరో అయిదు లక్షలు అక్కడికక్కడే మంజూరు చేసారు.

రేణిగుంట ఏయిర్ పోర్టులో ఆ చిన్నారులు..
సీఎం జగన్‌ తిరుపతి వస్తున్నారని తెలిసి.. తమ బాధ చెప్పుకుందామని.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన చాందినీ, రజనీ అనే ఇద్దరు అమ్మాయిలు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. అక్కడ ముఖ్యమంత్రిని కలిసేందుకు తమ బాధ చెప్పుకోవటానికి చేతిలో బోర్డులో పట్టుకొని..వాటి మీద మా అన్నకు ప్రాణ బిక్ష పెట్టండి అని రాసి ఉంది. అది చూడగానే జగన్ వారిని వాకబు చేసారు.

విమానాశ్రయం వెలుపల ఏర్పాటుచేసిన గ్యాలరీలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి.. తమ అన్నకు ప్రాణభిక్ష పెట్టండి అని వేడుకున్నారు. వారి సోదరుడు హరికృష్ణ తిరుపతి రవీంద్రభారతి స్కూల్‌లో 10వ తరగతి చవివేవాడు. 2015 నవంబర్‌ 21న స్కూల్‌ సిబ్బంది భవనం పైనుంచి కిందకు తోసేశారు. మూడేళ్లపాటు కోమాలో ఉన్నాడు.. చెన్నై ఆస్పత్రిలో తొమ్మిది ఆపరేషన్లు చేశారు. చికిత్స కోసం రూ.10 లక్షలు ఆర్థిక సాయం కావాలి..అంటూ అని చాందిని, రంజని సీఎంను అభ్యర్థించారు.

CM Jagan sanctioned 15 lakhs for two girls from chittor who asked the help

చలించిన సీఎం వెంటనే మంజూరు..
వారి ఆవేదన విని సీఎం జగన్ చలించిపోయారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను ఓదార్చి.. వారి సోదరుడు హరికృష్ణ వైద్య ఖర్చుల కోసం 10 లక్షలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఆ పిల్లల చదువులకు మరో 5 లక్షల రూపాయలు కేటాయించాలని ఆదేశించారు. పుట్టెడు కష్టంతో వచ్చిన ఆ ఇద్దరు అక్కాచెలెళ్లను ఆదుకోవటంతో వారిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు.

వారిద్దరే కాదు.. విమానాశ్రయం ముఖ్యమంత్రి.. గ్యాలరీలో ఉన్న అందరి వద్దకు వెళ్లి ఒక్కొక్కరి అర్జీని స్వీకరించి వారి సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. అర్జీలను జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తాకు అందించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గతంలో ఇదే విధంగా విశాఖ విమానాశ్రయం వద్ద స్థానిక ఐటీ యువత తమ సహచర ఉద్యోగి బ్లక్ కేన్సర్ తో బాధ పడుతున్న విషయాన్ని సీఎంకు వివరించి ఆర్దికంగా సాయం చేయాలని కోరగా..జగన్ అక్కడికక్కడే పది లక్షలు మంజూరు చేసారు.

English summary
Two girls from chittor asked CM jagan to save her brother who suffering with health problem. CM immeadiately responded and sanction ten lak rupees for her brother treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X