వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కష్ట కాలంలోనూ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్ .. అదేంటంటే

|
Google Oneindia TeluguNews

ఒక పక్క కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ , ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం తనదైన పంధాలో ముందుకు సాగుతున్నారు . ఒక పక్క కరోనాతో ఖజానా ఖాళీ అయినా సరే కరోనా కష్ట కాలంలో కూడా విద్యార్థులకు ఆర్ధిక భరోసా ఇస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ఈ మేరకు ఓ శుభవార్తను చెప్పారు. నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ ఈ శుభవార్తను వెల్లడించారు. ఈ సమావేశంలో విద్యారంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం జగన్ ప్రస్తావించారు .

కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ .. రానున్నది కష్ట కాలం అంటున్న జయప్రకాశ్ నారాయణకరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ .. రానున్నది కష్ట కాలం అంటున్న జయప్రకాశ్ నారాయణ

 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించామని చెప్పిన సీఎం జగన్

కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించామని చెప్పిన సీఎం జగన్

విద్యార్థులకు వారి చదువుల నిమిత్తం చెల్లించాల్సిన 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.1800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించామని పేర్కొన్నారు . అంతేకాకుండా 2019-20 సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అంతేకాదు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల తల్లి ఖాతాలోకే ఫీజు రియింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని చెల్లిస్తామని కీలక విషయాలను వెల్లడించారు . ఇక నుండి ప్రభుత్వం పూర్తి స్థాయి ఫీజులు రీయింబర్స్మెంట్ చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు .

ప్రభుత్వం పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు ఇస్తోందని ప్రకటన

ప్రభుత్వం పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు ఇస్తోందని ప్రకటన

ఇప్పటి వరకు ఇంజనీరింగ్‌ విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద ప్రభుత్వం రూ.35వేలు మాత్రమే ఇచ్చేదని, మిగతా డబ్బును కాలేజీలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నాయని అధికారులు సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే సీఎం జగన్ ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు ఇస్తోందని వివరించారు. ఇక అంతేకాదు తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని చాలా ప్రైవేట్ కళాశాలలకు ఆదేశాలు జారీ చేశామని ప్రకటించారు .

 191 కాలేజీలకు తల్లిదండ్రులు చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చెయ్యాలని ఆదేశం

191 కాలేజీలకు తల్లిదండ్రులు చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చెయ్యాలని ఆదేశం

ఇప్పటి వరకు 191 కాలేజీలకు ఆదేశాలు ఇచ్చామని, కచ్చితంగా తల్లిదండ్రులు చెల్లించిన మొత్తం తిరిగి వారికి ఇచ్చేలా చూస్తామని, వాటిని సక్రమంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్లకు సీఎం జగన్ సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని కాలేజీలపై చర్యలు తీసుకుని, బ్లాక్‌ లిస్టులో పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కళాశాలల యాజమాన్యాలకు స్పష్టం చేశారు.

Recommended Video

Lockdown : Railways Extends Suspension Of Passenger Services Till May 3

English summary
The students have been paid Rs 1800 crore fee reimbursement dues for the 2018-19 academic year. CM Jagan Mohan Reddy said the fee reimbursement has been paid for three quarters of the year 2019-20. The key points are that the fee reimbursement will be paid to the student's mother account from next academic year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X