• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం జగన్ స్పందించారు..ఇసుక తాత్కాలిక సమస్య: రీచ్‌లన్నీ వరదనీటిలో ఉన్నాయి: ఈ నెలాఖరుకు పరిష్కారం...!

|

ఏపీలో రాజకీయంగా ప్రకంపనలకు కారణమైన ఇసుక సమస్య పైన ముఖ్యమంత్రి అధికారికంగా స్పందించారు. ఇసుక కొరత కారణాలు..ప్రస్తుత పరిస్థితులు..ప్రభుత్వ ఆలోచనలను స్పష్టం చేసారు. ఇసుక అనేది తాత్కాలిక సమస్యగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 265కి పైగా రీచ్ లు ఉండగా..అందులో 61 మాత్రమే పని చేస్తున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. 90 రోజులుగా ఊహించని రీతిలో వరద ఉందని..దీని కారణంగానే ఇసుక తీయటం కష్టంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

అక్కడకు లారీలు..ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి ఉందని వివరించారు. ఈ నెలాఖరు నాటికి ఇసుక సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వడానికి వెంటనే ప్రత్యేక స్టాక్‌యార్డులు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

CM Jagan says sand problem is temporory and it may cleared by end of this month

నెలాఖరుకు సమస్య పరిష్కారం..

రాష్ట్రంలో ఇసుక వ్యవహారం రాజకీయంగా అధికార...విపక్షాల మధ్య రగడకు విమర్శలకు కారణమైంది. పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు సమస్య పరిష్కారం కోసం డెడ్ లైన్లు విధిస్తున్నాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయంలో రోడ్లు.. భవనాలశాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక సమస్య మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇసుక కొరతపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇసుక అన్నది తాత్కాలిక సమస్యగా సీఎం చెప్పుకొచ్చారు. 90 రోజులుగా ఊహించని రీతిలో వరద వస్తోందని వివరించారు.

రాష్ట్రంల265కిపైగా రీచ్‌ల్లో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మిగతా రీచ్‌లన్నీ వరదనీటిలో ఉన్నాయన్నారు. అక్కడ నుంచి ఇసుక తీయడం కష్టంగా ఉంది, లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. 90 రోజులుగా కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి చివరకు పెన్నా నదిలో కూడా వరద వస్తోందని ముఖ్యమంత్రి విశ్లేషించారు.

నిరంతర వరద కారణంగానే సమస్య..

నిరంతరం వరద వలనే ఇసుక సమస్య వస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. ఇదే సమయంలో ఇలా నీళ్లు రావడం రైతులకు, పంటలకు, భూగర్భజలాలకు మంచిదే అనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ప్రాక్లెయిన్‌లతో, భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేశారని..ఇప్పుడు మనం మాన్యువల్‌గా చేస్తున్నామన్నారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి వెళ్లిచూసినా.. గేట్లు ఎత్తే ఉన్నాయి, వరదనీరు ప్రవహిస్తూనే ఉందని సీఎం పేర్కొన్నారు. నవంబర్‌ నెలాఖరు నాటికి పూర్తిగా సమస్య తీరుతుందని భావిస్తున్నామన్నారు సీఎం.

గత ఐదేళ్లలో పేరుకు ఇసుక ఫ్రీ అని చెప్పారు, మాఫియా నడిపారని సీఎం విమర్శించారు. ఇప్పుడు తాము చాలా పారదర్శకంగా.. అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నామని సీఎం వివరించారు. ప్రజలకు, పేదలకు మేలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించామన్నారు. కిలోమీటర్‌కు రూ.4.90 లకు ఎవరైతే రవాణా చేస్తారో వారిని రమ్మన్నామని ముఖ్యమంత్రి గుర్తు చేసారు. వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వడానికి వెంటనే ప్రత్యేక స్టాక్‌యార్డులు కూడా ఇస్తామని సీఎం చెప్పుకొచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CM jagan given clarification in sand problem in state. CM says sand problem is temporory and it may cleared by end of this month. CM jagan says all reaches is in flood water. only 61 reaches working out of 265 raches.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more