• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ హిట్ లిస్టు లో మంత్రులు- సీనియర్లకూ నో గ్యారంటీ : నిఘా నివేదికలే కీలకం ..!!

By Lekhaka
|

ముఖ్యమంత్రి జగన్ మిషన్ -2024 లో భాగంగా తన డ్రీం టీంను సిద్దం చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. 2019 లో తన కేబినెట్ ఏర్పాటు సమయంలో ప్రస్తుత మంత్రుల్లో రెండున్నారేళ్ల కాలం తరువాత 90 శాతం వరకు మారుతారని నాడే స్పష్టం చేసారు. దీంతో..సీనియర్లుగా ఉన్నవారికి ఇబ్బంది లేదని..జూనియర్ల స్థానంలోనూ సీనియర్లతో భర్తీ చేస్తారనే ప్రచారం ఇన్ని రోజులు కొనసాగింది. కానీ, ముఖ్యమంత్రి జగన్ అడుగులు చూస్తుంటే మంత్రులుగా ఉన్న సీనియర్లు కొనసాగుతారా లేదా అనే సస్పెన్స్ మొదలైంది.

మొహమాటాలకు తావు లేకుండా...

మొహమాటాలకు తావు లేకుండా...

ఏ ఒక్కరికీ గ్యారంటీగా ఉంటారని చెప్పే పరిస్థితి కనిపించటం లేదనే చర్చ వైసీపీలో మొదలైంది. ఇక, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్ధి పార్టీలకు ఏ అంశంలోనూ ఛాన్స్ ఇవ్వకూడదనేది జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీకి బలమైన ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీని ఇప్పటికే దెబ్బ తీసామని.. వచ్చే ఎన్నికల్లోనూ ప్రతిపక్షానికే పరిమితం చేస్తే..ఇక, ఆ పార్టీ మనుగడ తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ ఉంటుందని వైసీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు.

 పార్టీ పదవులు-మంత్రులుగా బాధ్యతలు..

పార్టీ పదవులు-మంత్రులుగా బాధ్యతలు..

అందులో భాగంగా.. ఎన్నికలకు రెండున్నారేళ్ల సమయం ఉన్నా..చివరి వరకు నిరీక్షించకుండానే పార్టీ-ప్రభుత్వంలో మార్పుల దిశగా జగన్ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రి పదవులు దక్కని సీనియర్లలో కొందరిని సామాజిక- రాజకీయ అవసరాల ఆధారంగా అవకాశం కల్పించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే విధంగా మంత్రులు పదవులు ఇవ్వలేని వారిని... పదవుల్లో ఇప్పటి వరకు ఉంటూ కొనసాగించలేని వారికి పార్టీ పదవులు కట్టబెట్టే విధంగా కసరత్తు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 సీనియర్లైనా అదే ప్రామాణికంగా..

సీనియర్లైనా అదే ప్రామాణికంగా..


ఇక, ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో ఎవరు కంటిన్యూ అవుతారనేది పార్టీలో సీనియర్లు సైతం అంచనాకు రాలేకపోతున్నారు. అయితే, పార్టీ పరంగా కింది స్థాయిలో కేడర్ తో మమేకం అవుతూ..ఇటు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారెవరు... అదే సమయంలో కేడర్ ను పట్టించుకోకుండా మంత్రిగా దర్పం ప్రదర్శిస్తుందెవరు.. మంత్రులుగా ఆ శాఖల్లో సక్సెస్ రేటు ఎంత.. అప్పగించిన జిల్లాల్లో-సొంత జిల్లాల్లో వారి ప్రాబల్యం ఏ మేర ఉంది..వారి సామాజిక వర్గంలో ఏ మేర పట్టు కొనసాగిస్తున్నారనే అంశాలను ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రాతిపదికగా తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

పార్టీ-ప్రభుత్వ బాధ్యతలు..

పార్టీ-ప్రభుత్వ బాధ్యతలు..


ఇదే సమయంలో పార్టీ పట్ల వారి నిబద్దతను ప్రత్యేక అంశంగా గుర్తిస్తున్నారు. వీటి పైన నిఘా వర్గాలు..ఒక ప్రముఖ సర్వే సంస్థ ద్వారా సీఎం జగన్ సమాచారం తెప్పించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందులో పలువురి మంత్రుల పేర్లు ఉన్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, కె. నారాయ‌ణ‌స్వామి సహా... మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, తానేటి వనిత, గుమ్మనూరు జయరామ్, ముత్తంశెట్టి శ్రీనివాస రావు, శ్రీరంగనాధ రాజు, మేకపాటి గౌతమ్ రెడ్డి, శంకర నారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్లు ఉన్నట్లుగా సమాచారం.

 పక్కా లెక్కలతోనే నిర్ణయాలు..

పక్కా లెక్కలతోనే నిర్ణయాలు..


వీరికి పోటీగా పలువరి ఆశావాహుల పేర్లు సైతం ప్రచారంలో ఉన్నాయి. అయితే, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాతనే..ప్రాంతీయ-సామాజిక సమీకరణాల ఆధారంగా ముఖ్యమంత్రి జగన్ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ ఏడాది డిసెంబర్ లోగానే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. దీంతో..అసలు ప్రస్తుత మంత్రుల్లో ఎవరు ఉంటారు.. కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ ఆశావాహుల్లో మరింత ఉత్కంఠ పెంచుతోంది.

English summary
CM Jagan seek Intelligence and survey reports on some of the cabinet ministers. Jagan seem to be started exercise on cabinet reshuffeling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X