వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ పవన్..సీఎం జగన్ ఎంపిక చేసింది వారినే : ఎటాకింగ్ బాధ్యత వారికే : వైసీపీ ధీమా ఇదే..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద అన్ని పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, జనసేన చేస్తున్న లాంగ్ మార్చ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి లోకేశ్ ఇసుక సమస్య పైన దీక్ష చేసినా..సీరియస్ గా తీసుకోని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు పవన్ విశాఖలో నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ పైన మాత్రం నిఘా పెట్టింది. అందునా ఇప్పుడు టీడీపీ ఈ మార్చ్ కు మద్దతివ్వటం ద్వారా వైసీపీ దీనికి తిప్పి కొట్టాలని నిర్ణయించింది. దీంతో..ఈ బాధ్యతలను ఏరి కోరి కొందరు నేతలకు పార్టీ అధినేత..ముఖ్యమంత్రి జగన్ అప్పగించారు.

ప్రధానంగా టీడీపీ ప్రభుత్వంలో ఇసుక మాఫియా పైన అప్పట్లో విమర్శలు చేసిన పవన్ ...ఇప్పుడు వారితో కలిసి పోరాటం చేయటం..అదే విధంగా టీడీపీ..పవన్ ఒక్కటేనంటూ వారు తమ ప్రచారానికి పదును పెట్టారు. ఇక, విశాఖలో పోటీ చేసి ఓడిన పవన్..అక్కడ ఉనికి కాపాడుకొనేందుకే ఇసుక సమస్య పైన పోరాటానికి విశాఖను వేదికగా ఎంచుకున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారంటూ.. ఆ రెండు పార్టీలను లక్ష్యంగా చేసుకొని మంత్రులు ఒకరి తరువాత మరొకరు విమర్శలు గుప్పిస్తున్నారు.

టార్గెట్ పవన్..ఆ నేతలకు బాధ్యతలు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని రాజకీయంగా నిలదీసే బాధ్యతలను వైసీపీ లో కొందరు నేతలకు అప్పగించారు. గతంలో ప్రజారాజ్యంలో పని చేసి..ఇప్పుడు వైసీపీలో కీలక స్థానాల్లో ఉన్న నేతలను అధికార పార్టీ రంగంలోకి దించింది. అందునా చిరంజీవితో సన్నిహితంగా ఉండే మంత్రి కన్నబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా అవంతి శ్రీనివాస్, సీ రామచంద్రయ్య, వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటుగా మంత్రి అనిల్ సైతం పవన్ లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. అసలు జగన్ ముందు నిలబడే ధైర్యం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

Cm jagan selected some leader to attack pawan politically from his party who worked in prajarajyam

విశాఖలో పవన్ కళ్యాణ్ గాజువాక నుండి ఎమ్మెల్యేగా.. ఎంపీగా జేడి లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓడారని..కేవలం అక్కడ రాజకీయంగా ఉనికి కోసమే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారని విమర్శిస్తున్నారు. టీడీపీ హాయంలో ఇసుక అక్రమాలు జరిగాయని విమర్శించిన పవన్ ఇప్పుడు వారితో కలిసి ఎలా పోరాటం చేస్తారని నిలదీస్తున్నారు. ఇక, గత ప్రభుత్వ హాయంలో భవన నిర్మాణ కార్మికలు నిధులను పక్క దోవ పట్టించారని..ఆ సమయంలో కార్మికులు ఆందోళన చేస్తుంటే పవన్ కు కనిపించలేదా అన్నది వైసీపీ నేతల ప్రశ్న. ఇలా..ఎంపిక చేసిన నేతల ద్వారా పవన్ ను వైసీపీ లక్ష్యంగా చేసుకుంటుంది.

టీడీపీలోనూ పవన్ మార్చ్ పైన చర్చ...
పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ నిర్వహించే మార్చ్ లో పాల్గొనేందుకు టీడీపీ నేతలు సిద్దం అవుతున్నా.. చివరి నిమిషంలో ఎంత మంది హాజరవుతారనేది సందేహంగానే ఉంది. అయితే, చంద్రబాబు మాత్రం పార్టీ నుండి ముగ్గురు మాజీ మంత్రులు పాల్గొంటారని ప్రకటించారు. గంటా, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు తో పాటుగా స్థానిక నేతలకు జనార్దన్ నుండి ఫోన్లు వెళ్తున్నాయి. పార్టీ అదినేత ఆదేశాల మేరకు మార్చ్ లో పాల్గొనాలని సూచనలు చేస్తున్నారు. అయితే, గతంలో పవన్ మీద విమర్శలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణ బాబు ఇప్పుడు అయిష్టంగానే తన నియోజక వర్గంలో ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది.

అయితే అయ్యన్న పాత్రుడు..అచ్చెన్నాయుడు హాజరు కానున్నట్లు సమాచారం. ఇక, గంటా వస్తారా లేదా అనేది చర్చకు కారణమైంది. టీడీపీతో పాటుగా జనసేన నేతలుసైతం గంటాను ఆహ్వానించారు. ఇక, మార్చ్ తరువాత తన ప్రసంగంలో పవన్ ప్రభుత్వం పైన ఎటువంటి ఆరోపణలు సంధిస్తారు.. ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే బీజేపీ మాత్రం తాము పవన్ తో కలిసి వేదిక పంచుకోబోమని స్పష్టం చేయటంతో..ఇప్పుడు జనసేనకు సైతం టీడీపీతో దోస్తీ తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

English summary
YCp Cheif given responsibilites of attacking politically on Pawan Kalyan to some leaders in party mainly to previously who work in Prajarajyam. some of the tdp leaders also still in dailama to attend pawan March
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X