వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళిత యువకుడి శిరోముండనంపై సీఎం జగన్ సీరియస్, ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

|
Google Oneindia TeluguNews

దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో మంగళవారం జరిగిన ఘటన ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొన్ని వరప్రసాద్ అనే యువకుడిని అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పోలీసులు స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ భౌతిక దాడి చేయడంతోపాటు శిరోముండనం చేయడం కలకలం రేపింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపింది. దళిత సంఘాల ఆగమనంతో.. జగన్ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. శిరోముండనం ఘటనకు బాధ్యులను చర్యలు తీసుకున్నది.

దళిత యువకుడు వరప్రసాద్ దాడి ప్రకంపనలు రేపింది. వార్త దావానంలా వ్యాపించడంతో పార్టీలు, ప్రజాసంఘాలు స్పందించాయి. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వెంటనే స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మరోసారి ఇలాంటి ఘటన జరగనీయొద్దని డీజీపీకి తేల్చిచెప్పారు. సీఎం జగన్ ఆదేశాలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. బాధ్యులైన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

cm jagan serious on sithanagaram incident..

Recommended Video

Mahesh Babu Touches Hearts, Facilitates Heart Surgeries For 1,010 Kids || Oneindia Telugu

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వైసీపీ నేత ఇసుక అక్రమ రవాణాను దళిత యువకుడు వరప్రసాద్ అడ్డుకున్నారు. అయితే అతనిని పోలీసు స్టేషన్ తీసుకెళ్లి దాడి చేశారు. తర్వాత పోలీసు స్టేషన్‌లో శిరోముండనం చేశారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు మడుగులొత్తి ఈ విధంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి.

English summary
cm jagan serious on sithanagaram incident.some ruling party leaders in andhra pradesh attacked dalit youth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X