వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఇద్దరు మంత్రులపై వేటు త‌ప్ప‌దా!! సీఎం జ‌గ‌న్ ఎందుకంత‌ సీరియ‌స్ : ఎవ‌రా మంత్రులు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఇద్దరు మంత్రుల మీద వేటు వేసే దిశగా అడుగులు || Jagan Serious On Two Ministers

ఏపీ ప్ర‌భుత్వంలో ఇద్దరు మంత్రుల మీద వేటు త‌ప్పేలా లేదు. ఆ ఇద్ద‌రి మీద ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఉ న్నారు. ఇప్ప‌టికే వార్నింగ్‌లు ఇచ్చారు. డెడ్ లైన్ విధించారు. ముందు నుండి చెబుతున్నా ప‌ట్టించుకోకుండా వ్య‌వ హ‌రిస్తున్న మంత్ర‌ల‌కు సీఎంఓ నుండి ఒక్క‌క్క‌రుగా పిలుపు వ‌స్తోంది. ఇప్ప‌టికే ఆ ర‌కంగా పిలుపు అందుకొని ముఖ్య మంత్రికి కొంద‌రు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. ఇదే కోవ‌లో ఇద్ద‌రు మంత్రుల శైలి పైన మాత్రం సీఎం జ‌గ‌న్ బాగా సీరియ‌స్ అయిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో...ఏ స‌మ‌యంలో అయినా వారిద్ద‌ర‌రి పైనా వేటు వేసే అవ కాశం ఉందంటూ స‌చివాల‌యంలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆ మంత్రికి సీఎం డెడ్‌లైన్‌...

ఆ మంత్రికి సీఎం డెడ్‌లైన్‌...

కోస్తా ప్రాంతంలో కీల‌క‌మైన ఆ జిల్లా నుండి ఇద్ద‌రు మంత్రులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆ జిల్లా మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. యువ‌కులైన ఇద్ద‌రికి ముఖ్య‌మంత్రి సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న బెట్టి మ‌రీ మంత్రులుగా అవ‌కాశం ఇచ్చారు. పార్టీ ప‌ట్ల వారి నిబ‌ద్ద‌త‌ను గుర్తించి కీల‌క పోర్టుఫోలియోలు కేటాయించారు. మంత్రులు ఎలా ఉండాలో తొలి రోజు నుం డి ముఖ్య‌మంత్రి చెబుతూనే ఉన్నారు. అయితే, ఆ జిల్లాకు చెందిన ఒక మంత్రి కొద్ది రోజులుగా అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శి స్తున్నారు. జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. అంతే..ముఖ్య‌మంత్రి ఆ మంత్రిని త‌న పేషీకి పిలిపించా రు. ఆ మంత్రి చేసిన నిర్వాకం గురించి..ఆయ‌న వ్య‌వ‌హార శైలి గురించి నిల‌దీసారు. చిన్న వ‌య‌సులో అవ‌కాశం వ‌స్తే స‌ద్వినియోగం చేసుకోవాలి..స‌భ‌లో మీ ప్ర‌వ‌ర్త‌న హుందాగా ఉండ‌టం లేదు. అదే స‌మ‌యంలో అధికారుల‌తో సమన్వ యం లోపిస్తోంది. కీల‌క అంశాల విష‌యంలో వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ఠ‌కు పోతున్నారు. ఏవైతే వ‌ద్ద‌ని చెప్పానో ఆ ఆరోప‌ణ‌ల‌కు అవ‌కాశం ఇస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు. దీనికి ఆ మంత్రి సంజాయిషీ ఇచ్చుకొనే ప్ర‌య‌త్నం చేసారు. సీఎం మాత్రం ఆయ‌న‌కు ఆ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ప‌ద్ద‌తి మార్చుకోకుంటే నేనే నిర్ణ‌యం తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారని స‌మాచారం. ఇప్పుడు ఇది ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం అవుతోంది.

మ‌రో మంత్రి దాదాపు ఊస్టింగ్‌..కానీ, ఆ కార‌ణంతో..

మ‌రో మంత్రి దాదాపు ఊస్టింగ్‌..కానీ, ఆ కార‌ణంతో..

ఇక‌..మ‌రో మంత్రి తొలి సారి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. అందునా కీల‌క శాఖ నిర్వ‌హిస్తున్నారు. ఈ రెండు నెల‌ల కాలం లో ముఖ్య‌మంత్రి నుండి ప‌రోక్షంగా ఒక సారి హెచ్చ‌రిక‌లు అందాయి. అయినా..తీరు మార‌లేదు. దీంతో..ముఖ్య‌మంత్రి నుండి తాజాగా సీరియ‌స్ వార్నింగ్ వ‌చ్చింది. కీల‌క శాఖ కావ‌టంతో పాటుగా..సమీక‌ర‌ణాల్లో భాగంగా ఆ పోర్టుఫోల‌యోను అప్ప‌గిస్తే..ఏం జ‌రుగుతోందంటూ నిల‌దీసారు. ఇప్ప‌టికే ఆ మంత్రి వ‌ద్ద మాజీ అధికారిని స‌మ‌న్వ‌యం కోసం నియ మించాల‌ని నిర్ణ‌యించారు. ఆ మంత్రి కుటుంబ స‌భ్యుల జోక్యం ఏ మాత్రం ఉపేక్షించ‌లేని స్థాయికి చేరిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. అయితే, ప్ర‌భుత్వ ఇమేజ్.. స‌మీక‌ర‌ణాల కార‌ణంగా వెంట‌నే చర్య‌లు తీసుకోవటానికి సీ ఎం ఆలోచ‌న చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇదే ర‌కంగా కొన‌సాగితే మంత్రి ప‌ద‌విలో ఉండ‌రూ అంటూ వ‌చ్చిన హెచ్చ‌రిక‌ల‌తో నాలుగు రోజులుగా ఆ మంత్రి జిల్లాలోనూ యాక్టివ్ అయ్యారు. త‌న సంబంధీకుల‌ను పేషీకి దూరంగా ఉంచుతున్నారు. అయితే, ప‌రోక్షంగా వారి పెత్త‌నం సాగుతుంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో..జ‌గ‌న్ కేబినెట్‌లో ఎవ‌రినైనా తొలిగించాల్సి వ‌స్తే తొలుత ఈ మంత్రి మీద‌నే వేటు ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

కేసీఆర్ త‌ర‌హా నిర్ణ‌యం త‌ప్ప‌దా...

కేసీఆర్ త‌ర‌హా నిర్ణ‌యం త‌ప్ప‌దా...

2014 ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ త‌న కేబినెట్‌లో వ‌రంగ‌ల్ జిల్లా నుండి రాజ‌య్య‌కు మంత్రి గా అవ‌కాశం ఇచ్చారు. త‌న ప్ర‌భుత్వంలో అవినీతిని స‌హించ‌న‌ని.. ఏ మంత్రి అయినా అవినీతికి పాల్ప‌డితే వేటు వేస్తా న‌ని స్ప‌ష్టం చేసారు. అయితే, రాజ‌య్య పేషీలో జ‌రుగుతున్న అవినీతి పైన పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ..ఆయ‌న ముంద‌స్తుగా హెచ్చ‌రిక‌లు చేసినా ప‌ట్టించుకోలేద‌నే కార‌ణంతో ఎటువంటి హ‌డావుడి లేకుండా ఆయ‌న‌ను త‌న కేబినెట్ నుండి కేసీఆర్ భ‌ర్త‌ర‌ఫ్ చేసారు. అదే జిల్లా నుండి మ‌రో నేత‌కు మంత్రికి అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, ఏపీ సీఎం జ‌గ‌న్ సైతం అవినీతి మీద క‌ఠినంగా ఉన్న స‌మ‌యంలో గీత దాటుతున్న మంత్రుల విష‌యంలో ఉదాసీనంగా ఉండాల్సిన అవ‌స‌రం లేద‌నే అభిప్రాయంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆరోప‌ణ‌ల‌ను నిర్ధారించుక‌ని ఒక‌రిద్ద‌రి మీద చ‌ర్య‌లు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ నిర్ణ‌యం ప్ర‌భావం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీంతో..జ‌గ‌న్ ఎప్పుడు ఏం నిర్ణ‌యం తీసుకుంటారో అనే ఉత్కంఠ నెల‌కొని ఉంది.

English summary
AP CM Jagan Serious on Two ministers Attitude in Administration. Cm Directly warned that both of ministers and control them selves. If not Cm ready to expel them. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న కేబినెట్‌లోని ఇద్ద‌రు మంత్రుల తీరు పైన సీరి య‌స్‌గా ఉన్న‌ట్లు స‌మాచారం. వారిద్ద‌రూ వైఖ‌రి మార్చుకోవాల‌ని..పేషీల్లో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌దిద్దుకోవా ల‌ని హెచ్చ‌రించిన‌ట్లు తెలుస్తోంది. లేకుంటే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీఎం స్ప‌ష్టం చేసిన‌ట్లు ప్రచారం.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X