వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ స్మార్ట్ ఐడియా: స్కూల్ కి ఒక స్మార్ట్ టీవీ

|
Google Oneindia TeluguNews

ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ కు మహర్దశ పట్టబోతుంది. డిజిటల్ విధానంలో విద్యార్థులకు విద్యా బోధన చెయ్యనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన చెయ్యాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులే కాదు వారికి విజ్ఞానం అందించే పలు అంశాలను సైతం తెలిసేలా చెయ్యాలని స్మార్ట్ ఆలోచన చేశారు.

స్కూల్ కి ఒక స్మార్ట్ టీవీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం

స్కూల్ కి ఒక స్మార్ట్ టీవీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం

స్కూల్ కి ఒక స్మార్ట్ టీవీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ విద్యా విధానాన్ని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు తో పాటు , ఇంగ్లీష్ ఎడ్యుకేషనల్ సినిమాలు చూపించి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం పెంపొందించాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో తాజాగా ఆయన మరో స్మార్ట్ ఆలోచన చెయ్యటం పట్ల విద్యార్ధి లోకం హర్షం వ్యక్తం చేస్తుంది.వైఎస్ జగన్ వరసగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలన విషయంలో దూసుకుపోతున్నారు .

జగనన్న విద్యా దీవెన పథకం సమీక్షలో సీఎం జగన్

జగనన్న విద్యా దీవెన పథకం సమీక్షలో సీఎం జగన్

ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో ఆయన చాలా ప్రాధాన్యతను ఇస్తున్నారు . ఈరోజు జగనన్న దీవెన పధకం విషయంలో సమీక్ష నిర్వహించిన జగన్ అధికారులతో అనేక విషయాల గురించి చర్చించారు. జగనన్న దీవెన పధకంలో భాగంగా స్కూల్ విద్యార్థులకు అందించే కిట్ విషయంలో అయన అధికారులతో చర్చించారు. బ్యాగ్ లో మూడు జతల యూనిఫామ్, షూస్, సాక్స్, బెల్ట్ తో పాటుగా పుస్తకాలు అందివ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక విద్యార్థులకు ఇచ్చేవన్నీ కూడా నాణ్యమైనవి అందించాలని చెప్పారు.

డిజిటల్ విద్యా విధానాన్ని ప్రోత్సహించే ఆలోచన

డిజిటల్ విద్యా విధానాన్ని ప్రోత్సహించే ఆలోచన

ఇక ఇంగ్లీష్ మీడియం విషయంలో కూడా అధికారులతో చర్చించారు. స్కూల్స్ ను డిజిటలైజ్ చేసే విషయంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. విద్యార్థులకు డిజిటల్ విధానంలో బోధనలు చేసేందుకు ప్రతి స్కూల్ కు కూడా ఒక స్మార్ట్ టీవీ ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి అన్ని స్కూల్స్ కు స్మార్ట్ టీవీ లను అందజేయాలని ఆదేశించారు జగన్. డిజిటల్ విద్యా విధానం , అన్ని స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం అంతే కాక స్కూల్స్ లో ఎడ్యుకేషనల్ ఇంగ్లీష్ సినిమాలు చూపించాలని భావిస్తున్న సర్కార్ అంతా కార్పోరేట్ విద్యావిధానం సర్కారీ స్కూల్స్ లో తీసుకురావటానికి ప్రయత్నం చేస్తుంది.

English summary
CM J agan was discussed Several issues with officials who conducted a review of the Jagananna vidya deevena scheme today. Also discussed with the authorities in respect of English Medium. The government has taken another step towards digitizing schools. Jagan government has decided to give every school a smart TV to teach students in digital way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X