వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ‌డికెళ్లే పిల్ల‌ల‌కు మామ‌గా ఉంటా: చ‌దువుల విప్ల‌వాన్ని తీసుకొస్తా: బ‌డిబాట‌లో సీఎం జ‌గ‌న్‌..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో చ‌దువుల విప్ల‌వాన్ని తీసుకొస్తామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు. బ‌డివెళ్లే పిల్ల‌ల‌కు మామ‌గా అండ‌గా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌యివేటు విద్యా సంస్థ‌ల ఆధిప‌త్యాన్ని త‌గ్గించే చ‌ర్య‌లు ప్రారంభిస్తామ‌ని..రెండేళ్ల లోగా విద్యా వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. ప్ర‌తీ పాఠ‌శాల ఇంగ్లీషు మీడియం కావాల‌ని..అందులో తెలుగు త‌ప్ప‌ని సరిగా ఉండాల‌ని ఆదేశించారు.

రాజ‌న్న బ‌డిబాట ప్రారంభం..

రాజ‌న్న బ‌డిబాట ప్రారంభం..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రాజ‌న్న బ‌డిబాట కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. రాజ‌ధాని ప‌ర‌ధిలోని పెనుమాక‌లో వందేమాత రం హైసూల్క్‌లో ఒకేసారి 2వేలమంది విద్యార్థుల సామూహిక అక్షరాభాస్య కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు చిన్నారులను తన ఒడిలో కూర్చోపెట్టుకుని అక్షరాభ్యాసం చేయించి, అమ్మ ఒడిని చల్లగా దీవించారు. విద్యా సంవత్స రం క్యాలెండర్‌ను విడుదల చేశారు. గ‌త ప్ర‌భుత్వం పాఠ‌శాల విద్యా వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసి..ప్ర‌యివేటు సంస్థ‌ల‌కు ప్రాధాన్య‌త ఇచ్చింద‌న్నారు. ఉపాధ్యాయుల కొర‌త ఉన్నా ప‌ట్టంచుకోలేద‌న్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలోని అన్ని పాఠ‌శా ల‌ల ఫొటోల‌ను పంపాల‌ని కోరాన‌ని..రెండేళ్ల త‌రువాత అవే పాఠ‌శాల‌ల ముఖ‌చిత్రం చూడాల‌ని సూచించారు. ఏపీలో విద్యా వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఏపీలో 33 శాతం నిర‌క్ష్య‌రాస్య‌త‌..

త‌న పాద‌యాత్ర‌లో చ‌దువుల విప్ల‌వం తీసుకొస్తాన‌ని మాట ఇచ్చాన‌ని సీఎం గుర్తు చేసారు. రాష్ట్రంలో ప్ర‌తీ పాఠ‌శాల ఇప్పుడున్న పోటీకి అనుగుణంగా ఇంగ్లీషు మీడియంగా మారాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసారు. అదే స‌మ‌యంలో ప్ర‌తీ పాఠ శాల‌లోనూ తెలుగు త‌ప్ప‌నిస‌రి చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. నారాయ‌ణ‌..చైత‌న్య వంటి విద్యా సంస్థ‌లు వేల రూపాయాల ఫీజుల‌ను వసూలు చేస్తున్నార‌ని..వీటిని పూర్తిగా నియంత్రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దేశ వ్యాప్తంగా 26 శాతం నిర‌క్ష‌రాస్య‌త ఉంటే..ఏపీలో అది 33 శాతంగా ఉంద‌న్నారు. పాఠ‌శాల‌ల్లో మౌళిక వ‌స‌తుల క‌ల్పన‌..ఉపాధ్యాయుల భ‌ర్తీ ద్వారా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను పూర్తి స్థాయి విద్యాల‌యాలుగా మారుస్తామ‌ని ప్ర‌క‌టించారు.

పిల్ల‌ల‌కు మామ‌గా..అమ్మ ఒడి..

పిల్ల‌ల‌కు మామ‌గా..అమ్మ ఒడి..

రాష్ట్రంలో త‌ల్లి తండ్రులు త‌మ పిల్ల‌ల‌ను బ‌డికి పంపాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించారు. బ‌డికి వెళ్లే ప్ర‌తీ పిల్ల‌ల‌కు తాను మామాగా ఉంటాన‌న్నారు. తాను ఇప్ప‌టికే హామీ ఇచ్చిన విధంగా పిల్ల‌ను బ‌డికి పంపే త‌ల్లుల‌కు జ‌న‌వ‌రి 26న అమ్మ ఒడి ప‌ధ‌కం ద్వారా 15 వేల రూపాయాలు అందిస్తామ‌ని మ‌రో సారి స్ప‌ష్టం చేసారు. ప్ర‌తీ పిల్ల‌వాడు ఉన్న‌త చ‌దువులు చ‌దువుకోవాల‌నేదే త‌న ల‌క్ష్యం అన్నారు. జ‌న‌వ‌రి 26న పండుగా జ‌రుపుకుందామ‌ని పిలుపునిచ్చారు.

English summary
AP CM Jagan started Rajanna Badibata programme and announced Amma Vadi implement of January 26th. All schools in AP must become English medium schools with Telugu subject.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X