వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ ను పిలిచి మరీ...ఇలా: కలవని అమిత్ షా: ఈ రోజు కలుస్తారంటూ..!

|
Google Oneindia TeluguNews

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ కోసం ముఖ్యమంత్రి జగన్ నిరీక్షిస్తున్నారు. అమిత్ షా అప్పాయింట్ మెంట్ ముఖ్యమంత్రి జగన్ కోరారు. దీంతో..21న ఢిల్లీలో అందబాటులో ఉండాలని..ఆ రోజన మాట్లాడుకుందాం అంటూ ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చారు. దీంతో..ఆయన సోమవారం మధ్నాహ్నం 12 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. తాను ఢిల్లీలోనే ఉన్నాననే సమాచారం షా కార్యాలయానికి సీఎంఓ అధికారులు పంపారు. సాయంత్రం 4 గంటలకు కలిసే అవకాశం ఉందని అక్కడి నుండి సమాచారం వచ్చింది. దీంతో..ముఖ్యమంత్రి తన నివాసం లోనే ఉండిపోయారు.

పార్టీ ఎంపీలతో పాటుగా.. కొందరు కేంద్ర అధికారులు సైతం వచ్చి జగన్ ను కలిసారు. అయితే, సాయంత్రానికి అమిత్ షా కార్యాలయం నుండి మంగళవారంకు అప్పాయింట్ మెంట్ వాయిదా పడిందంటూ సమాచారం వచ్చినట్లు తెలిసింది. దీంతో.. జగన్ మంగళవారం అమిత్ షా ను కలుస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 వైసీపీ నేతల్లో భిన్న వాదనలు..

వైసీపీ నేతల్లో భిన్న వాదనలు..

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వేచి చూసినప్పటికీ అమిత్‌ షా ను కలిసేందుకు పలు మార్లు ప్రయత్నించారు. కానీ, అప్పాయింటం మెంట్ మాత్రం లభించలేదు. అమిత్‌షా అప్పాయింట్‌మెంట్‌ మంగళవారానికి వాయిదా పడిందని ఏపీ భవన్‌ వర్గాలు తెలిపాయి. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో సీఎం భేటీ కానున్నారు.

కశ్మీర్‌ వివాదం... మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం... ఇలా పలు కారణాలను చూపిస్తూ జగన్‌కు అమిత్‌షా అప్పాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేదు. మహారాష్ట్ర, హరియాణాలో ప్రచారం ముగిసింది. సోమవారం ఆ రెండు చోట్ల పోలింగ్‌ జరగటం..ఎగ్టిగ్ పోల్స్..పోలింగ్ సరళి పైన చర్చల కారణంగా కలవటం కుదరలేదని చెబుతున్నారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం ఉద్దేశ పూర్వకంగానే జగన్ ను వెయిట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నేడు షాతో పాటుగా ఇతర మంత్రులతోనూ..

నేడు షాతో పాటుగా ఇతర మంత్రులతోనూ..

అయితే, ముందుగానే ఉన్న సమాచారంతోనే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రెండు రోజులుగా ఫిక్స్ చేసుకున్నారని ఎంపీలు చెబుతున్నారు. అమిత్ షా బిజీగా ఉన్న కారణంగానే సమయం కేటాయించలేదని చెబతున్నారు. మంగళవారం సీఎం జగన్ కేంద్ర హోం మంత్రితో పాటుగా ఇతర మంత్రులను కలుస్తారని వారు స్పష్టం చేసారు.

కేంద్ర న్యాయ శాఖ మంత్రి..ఆర్దిక మంత్రి.. జల వనరుల శాఖా మంత్రితో పాటుగా ఇంధన శాఖా మంత్రితోనూ జగన్ సమావేవమవుతారని సమాచారం. సాయంత్రం ఆయన ఢిల్లీ నుండి నేరుగా విశాఖ చేరుకుంటారు. అక్కడ పార్టీ ఎంపీ వివాహ రిసిప్షెన్ కు హాజరైన తరువాత అమరావతికి చేరుకుంటారు. న్యాయ శాఖ మంత్రితో సమావేశమైన సమయంలో హైకోర్టు తరలింపు వ్యవహారంతో పాటుగా హైకోర్టు బెంచ్ ల ఏర్పాటు పైన చర్చించనున్నారు.

జగన్ పర్యటనల పైన టీడీపీ ఆసక్తి..

జగన్ పర్యటనల పైన టీడీపీ ఆసక్తి..

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన వ్యక్తిగత టూర్ గా టీడీపీ ఆరోపిస్తోంది. అమిత్ షా ఉద్దేశ పూర్వకంగానే జగన్ క అప్పాయింట్ మెంట్ ఇవ్వటం లేదని..జగన్ తత్వం ఏంటో ఆయనకు తెలిసే ఇలా చేసారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ, వైసీపీ నేతలు దీనికి స్పందించటం లేదు. ఇక, అమిత్ షా తో భేటీ తరువాత ఏ విషయాలు చర్చించిందీ జగన్ వివరిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా, కేంద్రంతో విబేదించి పోలవరం..పీపీఏ అంశాల్లో జగన్ ఏకపక్షంగా వ్యవహరించిన తీరు పైన కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోందని..దీని కారణంగా గతంలో లభించిన విధంగా జగన్ కు ప్రాధాన్యత అక్కడ దక్కటం లేదనేది టీడీపీ నేతల వాదన. దీంతో..ఈ రోజు జగన్ ఢిల్లీలో షా తో బేటీ కీలకంగా మారుతోంది.

English summary
CM jagan still waiting for central Home Minister Amith Shah appointement. On monday Jagan reached Delhi waiting for call from Shah. Jagan decided to meet other central ministers also in this tour regarding pending assurances for AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X