వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీనీ మెప్పించేలా జగన్: రైతు భరోసాకు ప్రధాని పేరు: పధకంలోనూ మార్పులు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

CM Jagan Taken Key Decision On Rythu Bharosa Scheme || రైతు భరోసాకు ప్రధాని పేరు పెట్టనున్న జగన్ !

ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీని మెప్పించే నిర్ణయం తీసుకున్నారు. గతంలో చంద్రబాబు మాదిరి స్టిక్కర్ సీఎంగా అనిపించుకోవటానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. తన తండ్రి పేరుతో మొదలు పెట్టాలని ప్రారంభించిన రైతు భరోస పధకానికి ప్రధాని పేరును జత చేసారు. అదే సమయంలో పధకంలో పలు మార్పులు చేస్తూ ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభించటానికి ఏర్పాట్లు పూర్తి చేసారు.

 రైతు భరోసా: రూ. 5510 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కారు రైతు భరోసా: రూ. 5510 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కారు

ఇదే సమయంలో పధకం తొలుత నాలుగేళ్లు అమలు చేయాలని భావించినా..ఇప్పుడు అయిదేళ్లకు పెంచారు. అదే విధంగా రూ. 12,500 నుండి ఈ సాయం మొత్తాన్ని 13,500 కు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, గతంలో ప్రకటించిన విధంగా ఒకే విడతలో కాకుండా మూడు దఫాలుగా చెల్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రైతు సంఘాల వినతి మేరకే మూడు విడతలుగా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

రైతు భరోసాలో ప్రధాని పేరు సైతం..

రైతు భరోసాలో ప్రధాని పేరు సైతం..

ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల్లో భాగంగా ప్రతిష్ఠాత్మంగా భావించాలని నిర్ణయించిన రైతు భరోసా పధకానికి వైయస్సార్ పేరుతో పాటుగా ప్రధాని పేరును జోడించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సీఎం జగన ఈ పధకం కింద ప్రతీ ఏటా రైతులకు రూ. 12,500 చెల్లిస్తామని ప్రకటించారు. అయితే..అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రధాని కిసాన్ సమ్మాన్ పధకం పేరుతో ఏటా ఆరు వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటంతో..రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆరు వేలకు..తాము మరో రూ. 6,500 జత చేసి రూ.12,500 గా ఇవ్వాలని భావించింది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వనించారు. అయితే, ఆయన రెండు రాష్ట్రాల ఎన్నికల కారణంగా సమయం కుదరదని చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ నిధులు సైతం ఆ పధకంలో ఉండటంతో..రాష్ట్ర ప్రభుత్వ పధకంగా ఎలా అమలు చేస్తారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. దీంతో..కేంద్ర నిధులు కూడా ఉండటంతో వైయస్సార్ పేరుతో పాటుగా ప్రధాని పేరును జోడించి.. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పేరుతో ఈ పధకం అమలు చేయాలని నిర్ణయించారు. దీనిని నెల్లూరులో ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించనున్నారు.

మరో వెయ్యి అదనం..మూడు విడతలుగా చెల్లింపులు..

మరో వెయ్యి అదనం..మూడు విడతలుగా చెల్లింపులు..

నవ రత్నాల ప్రకటన సమయంలో ఈ పధకం కింద చెల్లించే మొత్తం ఒకే విడతలో ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, తాజాగా రైతు ప్రతినిధులతో సమావేశమైన సమయంలో వచ్చిన సూచనల మేరకు సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన రూ.12,500 సాయాన్ని రూ.13,500కు పెంచుతూ నిర్ణయించారు. నాలుగేళ్లుగా ప్రకటించిన ఈ పధకాన్ని అయిదేళ్ల పాటు కొనసాగించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో గతంలో ఒకే విడతలో చెల్లించాలని తీసుకున్న నిర్ణయంలోనూ మార్పులు చేసారు. ఈ పధకం కింద మేనెలలో రూ.7,500, ఖరీఫ్‌ పంట కోసే సమయంలో, రబీ అవసరాలకోసం రూ.4000, సంక్రాంతి పండుగ సమయంలో రూ.2వేలు.చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కన్నబాబు ప్రకటించారు. 40 లక్షల మందికి వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నామని..
నవంబర్ 15 వరకు రైతు భరోసా కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. 43 లక్షల మంది రైతు కుటుంబాలకు పీఎం కిసాన్ అందుతోందని వివరించారు. సుమారు 3 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా అందబోతోందని మంత్రి చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జడ్పీ ఛైర్మన్లతో పాటు ఆ పదవులు నిర్వర్తించిన మాజీలకు కూడా రైతు భరోసా అమలు చేస్తామన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు అనర్హులుగా తేల్చారు.

చంద్రబాబును దెబ్బ తీసేలా..రాజకీయంగా..

చంద్రబాబును దెబ్బ తీసేలా..రాజకీయంగా..

ముఖ్యమంత్రి జగన్ తన ప్రభుత్వం అమలు చేస్తున్న పధకంలో ప్రధాని పేరు చేర్చాలని నిర్ణయించటం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర నిధులతో అమలు చేస్తున్న పథకాలకు కూడా తన పేరు పెట్టుకున్న ఘనత చంద్రబాబుదని బీజేపీ నేతలు..స్టిక్కర్ సీఎంగా విమర్శించే వారు. అయితే, దానికి టీడీపీ నేతలు సైతం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో..కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే నాటి ప్రధానుల ఫొటోలను పెట్టారా అని ప్రశ్నించారు. అయితే, ఇప్పుడు జగన్ తన పధకంలో కేంద్ర నిధులు సైతం ఉండటంతో ప్రధాని పేరు పెట్టటం ద్వారా ప్రధాని మోదీని మెప్పించటంతో పాటుగా.. తన మీద విమర్శలకు అవకాశం లేకుండా చేయగలిగారు. ఇదే సమయంలో కేంద్ర పధకానికి ఒక రకంగా ప్రచారం కల్పించారు. ప్రధాని మోదీతో సమావేశమైన సమయంలోనే జగన్ ఇదే విషయాన్ని ప్రధానికి వివరించినట్లు సమాచారం. చంద్రబాబు కంటే తాను హుందాగా వ్యవహరిస్తాననే సంకేతాలు జగన్ ఇవ్వగలిగారు.

English summary
CM jagan taken key decision that add modi name for Rythu Bharosa scheme implementing by state govt along with his father name. In this scheme State govt using central funds to farmers. At the same time many changes announed in this scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X