అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మ‌హిళ‌కే హోం..సీనియ‌ర్ల‌కు ప్రాధాన్య‌త‌: సాయిరెడ్డి నుండి ఆహ్వానాలు: ఎవ‌రికి ఏం ద‌క్కేను..!

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న కేబినెట్ కూర్పు పైన స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. త‌న కేబినెట్ ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో ఉండ‌నుందీ వివ‌రించారు. త‌న కేబినెట్‌లో స‌గం వ‌ర‌కు ఎస్సీ-ఎస్టీ-బీసీల‌కే అవ‌కాశం ఇస్తాన‌ని స్ప‌ష్టం చేసారు. ఇక‌, త‌న తండ్రి త‌ర‌హాలోనే కీల‌క‌మైన హోం శాఖ‌ను ఎస్సీ మ‌హిళ‌కు డిప్యూటీ సీఎం హోదాలో ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అదే విధంగా పార్టీ సీనియ‌ర్ల‌కు కీల‌క శాఖ‌లు అప్ప‌గించ‌నున్నారు. రెండు కీల‌క శాఖ‌ల‌ను మాత్రం ప్రాధాన్య‌త దృష్ట్యా త‌న వ‌ద్దే ఉంచుకోవాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయ్యారు. ఇక‌, డిప్యూటీ సీఎంలుగా ఎవ‌రి వైపు చూస్తున్నారంటే..

ఎస్సీ మ‌హిళ‌కే హోం శాఖ‌...

ఎస్సీ మ‌హిళ‌కే హోం శాఖ‌...

త‌న తండ్రి వైయ‌స్సార్ త‌ర‌హాలోనే జ‌గ‌న్ సైతం మ‌హిళ‌కే కీల‌క‌మైన హోం శాఖ ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. పార్టీ ఎమ్మెల్యేల‌తో స‌మావేశ‌మైన ఈ మేర‌కు స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. అందులో భాగంగా అయిదుగురికి డిప్యూటీ ముఖ్య‌మంత్రులుగా అవ‌కాశం ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. అందులో భాగంగా..ఎస్సీ వ‌ర్గానికి డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో..ప్ర‌ముఖంగా గుంటూరు జిల్లా ఎమ్మెల్యే ఎస్సీ కేట‌గిరీ లో డిప్యూటీ సీఎం హోదాలో హోం శాఖ ద‌క్కించుకొనే ఛాన్స్ క‌నిపిస్తోంది. ఇక‌, ముందు నుండి అంచ‌నా వేస్తున్న‌ట్లు గానే బుగ్గ‌న రాజేంద్రనాద్‌కు ఆర్దిక శాఖ కేటాయించ‌నున్నారు. ఇక‌, పార్టీ సీనియ‌ర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రెవిన్యూ శాఖ అప్ప‌గిస్తార‌ని స‌మాచారం. నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి గౌతం రెడ్డికి ఐటీ శాఖ ఇవ్వ‌నున్నారు. సీనియ‌ర్ నేత బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌కు మున్సిప‌ల్ శాఖ ఇస్తున్న‌ట్లు సమాచారం.

 అయిదుగురు డిప్యూటీలు వీరేనా..

అయిదుగురు డిప్యూటీలు వీరేనా..

జ‌గ‌న్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం మేర‌కు అయిదుగురు డిప్యూటీ సీఎంలుగా ఉండ‌నున్నారు. ఎస్సీ కేట‌గిరీ నుండి మ‌హిళా ఎమ్మెల్యే కు హోం శాఖ కేటాయించి డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది . ఇక‌, ఎస్టీ కేట‌గిరీలో రాజ‌న్న దొర లేదా పుష్ఫ‌శ్రీ వాణీకి అవ‌కాశం ద‌క్కే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మైనార్టీ కోటాలో ఉప ముఖ్య‌మంత్రిగా రాయ‌ల‌సీమ ప్రాంతానికి ద‌క్క‌నుంది. అందులో క‌డ‌ప ఎమ్మెల్యే అంజ‌ద్ బాషా పేరు వినిపిస్తున్నా.. ముఖ్య‌మంత్రి అదే జిల్లా కావ‌టంతో అనంత‌పురం జిల్లా హిందూపూర్ నుండి పోటీ చేసి ఓడిన ఇక్బాల్‌కు ఇస్తార‌ని చెబుతున్నారు. బీసీ కోటాలో తూర్పు గోదావ‌రి జిల్లాకు చెంది..తొలి నుండి జ‌గ‌న్ విధేయుడిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌కు ద‌క్క‌నుంది. కాపు కోటాలో జ‌గ‌న్ పార్టీ ఏర్పాటు నుండి వెన్నంటి ఉన్న ఆళ్ల నాని పేరు వినిపిస్తోంది. ఈ సాయంత్రానికి డిప్యూటీలు అయ్యే అయిదుగురు ఎవ‌ర‌నేది తేల‌నుంది.

సాయిరెడ్డి ఫోన్లు..ఆహ్వానాలు..

సాయిరెడ్డి ఫోన్లు..ఆహ్వానాలు..

డిప్యూటీ ముఖ్య‌మంత్రులుగా ఎవ‌రుంటారు..మంత్రులుగా ఎవ‌రికి అవ‌కాశం అనేది సాయంత్రానికి స్పష్ట‌త రానుంది.
మంత్రులుగా ఎంపిక చేసిన వారికి సాయంత్రం విజ‌య సాయిరెడ్డి ఫోన్లు చేసి చెబుతారని ..ఆయ‌నే ఆహ్వానాలు పంపు తార‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు. రేపు ఉద‌యం 8.39 గంట‌ల‌కు జ‌గ‌న్ సచివాల‌యంలోకి అధికారికంగా ప్ర‌వేశించ‌నున్నా రు. ఆ త‌రువాత స‌చివాల‌య స‌మీపంలోనే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ఏర్పాట్లు చేసారు. కేబినెట్ ప్ర‌మాణ స్వీకారం త‌రువాత స‌చివాల‌యంలో కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

English summary
AP Cm jagan taken sensational decision to give Homo for SC women in Deputy Chief Minister Quota. By to day evening new Ministers will be finalised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X