వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబును ఒంటరిని చేసే పనిలో సీఎం జగన్ .. స్థానిక ఎన్నికల్లో ఊహించని ఒత్తిడితో బాబు పరేషాన్

|
Google Oneindia TeluguNews

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకపక్క వలసలు , మరో పక్క దాడులు, బెదిరింపులు చంద్రబాబుకు ఊపిరి ఆడనివ్వటం లేదు . మొత్తం ఇప్పటికి 14 సంవత్సరాల పాటు ఉమ్మడి, విభాజిత ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి అయిన చంద్రబాబు జగన్ తొమ్మిది నెలల పాలనలోనే తల పట్టుకుంటున్నాడు . జాతీయ పార్టీగా సత్తా చాటాలనుకున్న టీడీపీని రాష్ట్రంలోనే లేకుండా చెయ్యాలని జగన్ వేస్తున్న ఎత్తుగడలకు చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు . దీంతో ఇప్పుడు రాజకీయంగా తీవ్ర నైరాశ్యానికి గురవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ పార్టీ .

సీఎం జగన్ చేతిలో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి

సీఎం జగన్ చేతిలో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు ,విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాడు. ఒక వెలుగు వెలిగాడు . ఇక రాజకీయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పెట్టుకుని, జాతీయ రాయకీయాల్లో చక్రం తిప్పాలని భావించి ఊహించని విధంగా ఏపీలో ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలో గత ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నారు. ప్రస్తుతం సీఎం జగన్ చేతిలో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. కక్కలేక, మింగలేక, ఏం చెయ్యాలో పాలుపోక తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

మమ్మల్ని చంపేస్తారా ? టీడీపీ నేతల మీద దాడిపై చంద్రబాబు సీరియస్మమ్మల్ని చంపేస్తారా ? టీడీపీ నేతల మీద దాడిపై చంద్రబాబు సీరియస్

తొమ్మిది నెలల జగన్ పాలనలోనే చంద్రబాబుకు చుక్కలు

తొమ్మిది నెలల జగన్ పాలనలోనే చంద్రబాబుకు చుక్కలు

చంద్రబాబుకు కేవలం తొమ్మిది నెలల జగన్ పాలనలోనే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు చంద్రబాబును ఇబ్బంది పెట్టే అనేక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంతో చంద్రబాబుకు ఊహించని దెబ్బ కొట్టారు. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అడ్రెస్ లేకుండా చెయ్యాలని కంకణం కట్టుకున్నారు. టీడీపీ చరిత్రలోనే తొలిసారిగా స్థానిక ఎన్నికల రూపంలో ఒక అగ్ని పరీక్షని చంద్రబాబు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది .

స్థానిక ఎన్నికల్లో ఒత్తిళ్ళు , బెదిరింపులు

స్థానిక ఎన్నికల్లో ఒత్తిళ్ళు , బెదిరింపులు

ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించిన బాబుకు రాష్ట్రంలో టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులు, సైలెంట్ గా చూస్తున్న పోలీసులు , పట్టించుకోని ఎన్నికల కమీషన్ తీరు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక అంతే కాదు టీడీపీలో నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు బలమైన నేతలపై అధికారపక్షం నుంచి కనీవినీ ఎరుగని రీతిలో ఒత్తిళ్లు, బెదిరింపులు చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నాయి.

 చంద్రబాబుకు షాక్ ఇస్తూ కీలక నేతల వలసలు

చంద్రబాబుకు షాక్ ఇస్తూ కీలక నేతల వలసలు

ఇక అన్నిటికంటే పార్టీలో కీలక నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పార్టీకి షాక్ ఇచ్చి వైసీపీ తీర్ధం పుచ్చుకోవటం కూడా చంద్రబాబుకు డైజెస్ట్ కావటం లేదు.
ఒకపక్క ఎన్నికలు, మరో పక్క దాడులు, ఇంకో పక్క వలసలు చంద్రబాబు పార్టీని బలహీనం చేస్తున్నాయి. ఉన్న నాయకులను సైతం భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి బలంగా ప్రచారం చేసే పరిస్థితులు కూడా కనపడటం లేదు.

టీడీపీ ఫెయిల్ అవ్వటానికి సామదాన బేధ దండోపాయాలు

టీడీపీ ఫెయిల్ అవ్వటానికి సామదాన బేధ దండోపాయాలు


చాలా మంది టీడీపీ నేతలు వైసీపీ నాయకుల బెదిరింపులతో ఎన్నికల్లో పోటీ చెయ్యటానికి భయపడ్డారు. మరి కొందరిపై దాడులు జరిగాయి. కొందరి నామినేషన్లను వైసీపీ నేతలు చించివేశారు . ఇలా ఎన్నికల్లో టీడీపీ ఫెయిల్ అవ్వటానికి అన్ని మార్గాలను ఉపయోగిస్తూ వైసీపీ చంద్రబాబును ఒంటరి చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో నామ రూపాలు లేకుండా దెబ్బ తీస్తే టీడీపీకి చెక్ పెట్టినట్టు అవుతుందని వైసీపీ భావిస్తుంది.

Recommended Video

AP Local Body Elections : జగన్ గురించి ఎల్లో మీడియా ఎప్పుడైనా రాసిందా ? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే
దెబ్బ మీద దెబ్బ కొడుతున్న తాజా సీఎం జగన్ .. సంకట స్థితిలో మాజీ సీఎం

దెబ్బ మీద దెబ్బ కొడుతున్న తాజా సీఎం జగన్ .. సంకట స్థితిలో మాజీ సీఎం

అందుకే జగన్ వ్యూహాత్మకంగా చంద్రబాబును దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. ప్రస్తుతం టీడీపీకి అధినేత మాజీ సీఎం చంద్రబాబు కు రాజకీయంగా గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వెళ్ళిపోతున్న పార్టీ ముఖ్య నేతలను ఆపాలా? దాడులతో భయపడుతున్న వారిని ఓదార్చాలా? ఎన్నికలలో ప్రజా మద్దతు కోసం పోరాడాలా ? ఏదీ అర్ధం కాని సంకట స్థితికి చంద్రబాబును నెట్టారు సీఎం జగన్ .

English summary
TDP chief chandrababu , who wants to prove the party's power in local bodies polls, is in tension now . ycp attacking the TDP leaders in the state, and the police, who are seen as silent, the election commission also keep quiet. In addition, the tDP, the constituency level from the village level to the strong leaders, faciing pressures and threats from the ruling party . party change on the other hand is hurting. Chandrababu is fighting the election alone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X