వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంత తోపైనా చెప్పింది చేయాల్సిందే! సీఎం జగన్ కి ఎదురు చెప్పారో! శంకరగిరి మాన్యాలే!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సరిగ్గా సాధారణ ఎన్నికలకు ముందు ఛీఫ్ సెక్రెటరీగా బాద్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రమణ్యం, ఆ తర్వాత వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా మారారు. ఐతే ఊహించని పరిణామాల నేపథ్యంలో ఏపి సీఎం జగన్ సీఎస్ కు ఉద్వాసన పలికి రాజకీయ వర్గాల్లో సంచలనానికి తెరతీసారు. ముఖ్యమంత్రి , సీఎస్ మంచి వేవ్ లెంత్ తో దూసుకెళ్తున్నారనే తరుణంలో ఆయన మీద వేటే వేసారు జగన్ మోహన్ రెడ్డి. అసలు ఎల్వీ సుబ్రమణ్యం మీద అంత తొందరగా వేటు వేయడానికి అంతర్గత కారణం ఏంటి..?

నేను సీఎం ను నా మాటే కాదంటావా.. సీఎస్ పై బదిలీ వేటేసిని సీఎం జగన్..

నేను సీఎం ను నా మాటే కాదంటావా.. సీఎస్ పై బదిలీ వేటేసిని సీఎం జగన్..

ఆంద్రప్రదేశ్ లో ఛీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆకస్మికంగా బదిలీ చేయడం రాజకీయాంగా ఇప్పుడు సంచలనంగా మారింది. గత సీఎం చంద్రబాబుతో ఎన్నికల వేళ ఢీ అంటే ఢీ అని, తానే సీఎంలా వ్యవహరించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రస్తుత సీఎం జగన్ చేతిలో అవమానకర రీతిలో ఉద్వాసనకు గురయ్యారు. ఎన్నికల కమిషన్ నియమించడంతో ఏపీకి సీఎస్ అయిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎలక్షన్ రిజల్ట్ తరువాత జగన్ సీఎం కావడంతో ఆయనకు దగ్గరయ్యారు. కానీ, అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. సీఎంకి దగ్గరైనట్లుగా ఎల్వీ భావించినా జగన్ మాత్రం సీఎస్ ను ఆది నుంచి అనుమానిస్తునే అపోహ అమరావతి పొలిటికల్ సర్కిల్ లో ఉంది.

ఏపి సిఎం సంచలన నిర్ణయం.. బదిలీ వేటేకు గురైన సుబ్రమణ్యం..

ఏపి సిఎం సంచలన నిర్ణయం.. బదిలీ వేటేకు గురైన సుబ్రమణ్యం..

ఎన్నికల సమయంలో చంద్రబాబును ఓవర్ టేక్ చేసి సీఎస్ హోదాలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వాన్ని నడిపించడం అప్పట్లో జగన్‌కు నచ్చిందేమో కానీ ఇప్పుడు తాను సీఎంగా ఉండగా సీఎస్ తన మాట వినకపోవడం మాత్రం నచ్చలేదని తన సన్నిహితుల దగ్గర సీఎం వాపోతున్నట్టు తెలుస్తోంది. చిన్నచితకా ఘటనలు ఇలాంటివి ఒకట్రెండు జరిగినా జగన్ ఏమాత్రం బయటపడకపోవడంతో ఎల్వీ సుబ్రహ్మణ్యం, తాను సీఎస్ హోదాలో జగన్‌కు సలహా ఇస్తున్నాననే అనుకున్నారు కానీ ఈ పద్ధతి జగన్‌కు నచ్చడం లేదని ఏ కోశాన అనుకోలేదట. ఈ వ్యవహారమే ఇద్దరి మద్య విభేదాలు ముదరడానికి కారణమైనట్టు తెలుస్తోంది.

కొంప ముంచిని సలహాలు.. అసహనానికి గురైన సీఎం..

కొంప ముంచిని సలహాలు.. అసహనానికి గురైన సీఎం..

గత వారంలో జరిగిన స్పందన కార్యక్రమంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ అసలు విషయం బయట పెట్టారని తెలుస్తోంది. ఆ వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా కలెక్టర్లు, కార్యదర్శులతో మాట్లాడిన ఎల్వీ చెత్త డంపింగ్ యార్డుల కోసం భూములను ఎంపిక చేయడమే మొదటి ప్రాధాన్యతగా చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ళ స్థలాలు కేటాయించిన తర్వాత చెత్త డంపింగ్ యార్డులకు స్థలం దొరకదన్నది ఎల్వీ సుబ్రమణ్యం అభిప్రాయం. ఇదే అంశాన్ని ఎల్వీ బహాటంగా చెప్పేసారు. సీఎం సమక్షంలో జరిగిన సమావేశం కాబట్లి జగన్ ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. వెంటనే 'ఇళ్ళ స్థలాలను గుర్తించడమే మొదటి ప్రాధాన్యత ' అని చెప్పి ఎల్వీకి షాకిచ్చారట జగన్.

సీఎం ఆదేశాలను పట్టించుకోకుండా ఉచిత సలహాలిస్తున్న ఎల్వీ.. బదిలీ చేసిన సీఎం..!!

సీఎం ఆదేశాలను పట్టించుకోకుండా ఉచిత సలహాలిస్తున్న ఎల్వీ.. బదిలీ చేసిన సీఎం..!!

దాని తర్వాత సహాయ కార్యదర్శి స్థాయి అధికారి ఒకరిని సచివాలయంలోనే ఓ విభాగం నుంచి మరో విభాగానికి మార్చాలని సీఎం జగన్ ఆదేశిస్తే ఎల్వీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదట. అంతే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ఇంటర్నల్ సమాచారం ఓ మీడియా సంస్థకు సీఎస్ చెబుతున్నారని ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సీఎంకు నివేదిక అందిందిందన్న ప్రచారమూ జరుగుతోంది. వీటన్నిటి నేపథ్యంలోనే ఆయన్ను తప్పించాలని జగన్ సమయం కోసం వేచిచ చూస్తున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయి అధికారి ప్రవీణ్ ప్రకాశ్‌ ఓ జివోను జారీ చేయడం ఎల్వీకి ఇబ్బంది కలిగించింది. దానిపై వెంటనే ప్రవీణ్ ప్రకాశ్‌కు ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్ నోటీస్ జారీ చేశారు . ఈ చర్య ముఖ్యమంత్రిలో మరింత అసహనం పెంచేసినట్లు సమాచారం. దీంతో మరో 6 నెలల్లో రిటైర్ కావాల్సిన ఎల్వీని సీఎస్‌గా తప్పించాలని సీఎం నిర్ణయించారని, సో ఎంత తోపైని సీఎంకు ఎదురు చెప్తే అంతే అనే చర్చ జరుగుతోంది.

English summary
There are interesting developments in AP politics. LV Subramanyam, who was a Chief secretary for the right to the general election, became the key to the next Jagan Mohan Reddy's government. But in the aftermath of unexpected developments, AP CM Jagan transfered the CS, which is become hot topic in the political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X