విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లక్ష కోట్ల బాక్సైట్ మైనింగ్ దోపిడీ కోసమే విశాఖ రాజధాని : దేవినేని ఉమా

|
Google Oneindia TeluguNews

టీడీపీ నేత దేవినేని ఉమా వైసీపీ సర్కార్ పై , విశాఖ రాజధానిగా చెయ్యటం వెనుక కుట్రలు ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ర్యాలీలో దేవినేని ఉమా, జెఎసి నాయకులు పాల్గొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కావాలని టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నరన్నారు. మండలిలో జరిగింది జీర్ణించుకోలేకే వైసీపీ సర్కార్ ఈ విధంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.

మండలి విజయం .. అది చంద్రబాబు అనుభవం .. అర్ధమైందా : నారా లోకేష్మండలి విజయం .. అది చంద్రబాబు అనుభవం .. అర్ధమైందా : నారా లోకేష్

విశాఖ జిల్లాలో లక్షల కోట్ల విలువ చేసే బాక్సైట్ గనులున్నాయన్న దేవినేని ఉమా

విశాఖ జిల్లాలో లక్షల కోట్ల విలువ చేసే బాక్సైట్ గనులున్నాయన్న దేవినేని ఉమా

విశాఖపట్నం నగరంలో మరియు చుట్టుపక్కల 52,000 ఎకరాల భూమి ఇప్పటికే చేతులు మారినట్లు టిడిపి నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. విశాఖ జిల్లాలో లక్షల కోట్ల విలువ చేసే బాక్సైట్ గనులు ఉన్నాయని , అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి కన్ను వాటి మీద పడిందని టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా వ్యాఖ్యానించారు .అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న దేవినేని ఉమా జగన్ సర్కార్ తీరును దుయ్యబట్టారు.

భూదందాల కోసమే విశాఖను రాజధానిగా చేస్తున్నారని ఆగ్రహం

భూదందాల కోసమే విశాఖను రాజధానిగా చేస్తున్నారని ఆగ్రహం

విజయవాడలోని సింగ్ నగర్ నుండి కండ్రిక వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఇప్పటికే ప్రభుత్వం వద్ద బాక్సైట్ కు సంబంధించి 32 వేల ఎకరాలు రికార్డ్స్ ఉన్నాయని , ఇప్పటికే 52వేల ఎకరాలు చేతులు మారాయని చెప్పారు. కేవలం భూదందాల కోసమే విశాఖను రాజధానిగా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మాజీ మంత్రులు నారాయణ, పుల్లా రావులపై తప్పుడు కేసులు నమోదు చేసినందుకు దేవినేని ఉమా జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని కోరిన ఉమా

హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని కోరిన ఉమా

రాజధాని భూముల విషయంలో ఎక్కడ ఏ అవకతవకలు జరిగినా హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని ఆయన పేర్కొన్నారు. అలా కాకుండా కక్ష పూరిత కేసులు పెట్టటం కరెక్ట్ కాదన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్లో నిజం లేదన్నారు . రాజధాని అమరావతిని తరలించటానికి ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పేరుతో జగన్ చేస్తున్న కుట్ర ఇది అని పేర్కొన్నారు దేవినేని ఉమా . మండలిలో నిర్ణయం తర్వాత వైసీపీ నేతలకు ఏం చెయ్యాలో తెలియక ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తామని దేవినేని ఉమా తెలిపారు.

English summary
The TDP leader and former minister Devineni Umamaheswara Rao accused Chief Minister YS Jagan Mohan Reddy of shifting capital from Amaravati to Visakhapatnam to loot Rs 1 lakh crore in bauxite mining. Devineni Uma and JAC leaders have participated in a rally in Vijayawada, demanding the State government to continue Amaravati as capital. Speaking to the media, the TDP leader alleged 52,000 acres of land changed hands recently in and around Visakhapatnam city. Devineni Uma came down heavily on Jagan government for filing false cases against former ministers Narayana and Pulla Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X