వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలు నేర చరితులే - సుప్రీం ఆదేశంతో జగన్, సాయిరెడ్డికి వణుకు: కళా వెంకట్రావు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో క్రిమినల్స్ కు, నేరగాళ్లకు అధికార వైసీపీ కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి, ఎనిమిదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజా ప్రతినిధులపై వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల వివరాలు అందజేయాలని రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నేతలపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు.

చైనాతో టెన్షన్:మోదీ సర్కార్ అనూహ్యం - సరిహద్దుపై పార్లమెంట్‌లో చర్చకు నో - అఖిలపక్ష భేటీ కూడా లేదుచైనాతో టెన్షన్:మోదీ సర్కార్ అనూహ్యం - సరిహద్దుపై పార్లమెంట్‌లో చర్చకు నో - అఖిలపక్ష భేటీ కూడా లేదు

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం పదవుల్లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 4,442మందిపై తీవ్రనేరారోపణలు ఉండటాన్ని సుప్రీంకోర్టు గర్హించింది. క్రిమినల్‌ కేసులతో పాటు మనీ లాండరింగ్‌, అవినీతి నిరోధక చట్టం తదితర ప్రత్యేక చట్టాల కింద ప్రజాప్రతినిధులపై ఉన్న అన్ని పెండింగ్‌ కేసుల వివరాలు తమకు అందజేయాల్సిందిగా అన్ని రాష్ట్రాల హైకోర్టులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు గత బుధవారం ఇచ్చిన ఆదేశాలు.. రాజకీయాల్లో నేర చరితుల ప్రక్షాళనలో కొత్త అధ్యాయం లాంటిదని నిపుణులు అభివర్ణించారు. ఈ ఆదేశాలపై ఏపీ ప్రతిపక్ష పార్టీ తనదైన శైలిలో స్పందించింది.

జగన్, సాయిరెడ్డికి వణుకు..

జగన్, సాయిరెడ్డికి వణుకు..

నేర చరితులైన ప్రజాప్రతినిధుల వివరాలను వెంటనే అందించాలంటూ హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశిండంతో ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి సహా వైసీపీ నేతల వెన్నులో వణుకు, భయం మొదలైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. వైసీపీ నేరగాళ్లకు అడ్డాగా మారిందన్న ఆయన.. ప్రస్తుతం వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న 50 మందికి నేర చరిత ఉందని, వాటిలో తొమ్మిది సీరియస్ క్రిమినల్ కేసులు, మంత్రులపై క్రిమినల్ కేసులు, ఏడుగురు ఎంపీలపై మహిళల్ని అత్యాచారం చేసిన కేసులు కూడా ఉన్నాయని టీడీపీ నేత వివరించారు.

కంగనా రనౌత్‌కు గవర్నర్ టైమ్ - నేడు రాజ్‌భవన్‌లో భేటీ - మహారాష్ట్ర సర్కారుపై కోశ్యారీ అసహనంకంగనా రనౌత్‌కు గవర్నర్ టైమ్ - నేడు రాజ్‌భవన్‌లో భేటీ - మహారాష్ట్ర సర్కారుపై కోశ్యారీ అసహనం

 ‘నేను నా అక్రమ సంపాదన' పుస్తకం..

‘నేను నా అక్రమ సంపాదన' పుస్తకం..

‘‘జగన్ పై అక్రమాస్తులు, ఆర్థిక నేరాలపై ఉన్న కేసులు ఎనిమిదేళ్లుగా పెండింగ్ లో ఉంది. సీఎం అయిన తర్వాత కుంటి సాకులు చెబుతూ ఆయన కోర్టు విచారణకు హాజరుకావడంలేదు. నిజంగా నేరం చేయకుంటే, తమపై ఉన్న కేసుల్ని త్వరగా విచారించాలని జగన్, విజయసాయిరెడ్డిలు సుప్రీంకోర్టుకు లేఖ రాగలరా? తమ సచ్చీలత నిరూపించుకోవాల్సిన అవసరం వారికి లేదా? ‘నేను నా అక్రమ సంపాదన' పేరుతో పుస్తకం వేసి ప్రజలకు అన్నీ చెప్పొచ్చుకదా? అని కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు.

English summary
amid supreme court asked all high courts to furnish specific data on corruption cases against mps and mlas, ap tdp chief Kala Venkatrao made sensational remarks on ruling ysrcp govt, speaking to media on sunday, Venkatrao was criticized that 50 mlas of ysrcp involved in serious criminal cases, amid supreme court orders, cm jagan and mp vijayasai reddy are fearing of their future, he added
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X