వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంశీ ఇష్యూలో జగన్ పక్కా వ్యూహం: చంద్రబాబు చేతిలో కత్తి: వేటు వేయిస్తారా..వేచి చూస్తారా..!

|
Google Oneindia TeluguNews

వల్లభనేని వంశీ ఇప్పుడు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే. టీడీపీకి వాట్సాప్ లో రాజీనామా పంపారు. ఎమ్మెల్యే పదవికి అదే పని చేసారు. తాజాగా..తాను అధికార పార్టీతో కలిసి పని చేస్తానని చెప్పారు. సీఎం జగన్ తో కలిసి నడుస్తానని స్పష్టం చేసారు. అసవరమైతే..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. వైసీపీలోకి ఎవరు చేరాలనుకున్నా..ముందుగా పదవులకు రాజీనామా చేసి రావాలనేది సీఎం జగన్ సిద్దాంతం. కానీ, వంశీ విషయంలో మాత్రం అది దారి తప్పినట్లు కనిపిస్తోంది.

ఇందులో జగన్ వ్యూహం స్పష్టంగా ఉంది. అదే సమయంలో వంశీ విషయంలో నిర్ణయం ఇప్పుడు చంద్రబాబు కోర్టులోకి నెట్టేసారు. ఆయన వంశీ పైన పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా. వంశీ మీద అనర్హత వేటు వేయమని సిఫార్సు చేస్తారా. అలా చేసి..అనర్హత వేటు పడితే ఉప ఎన్నికకు చంద్రబాబు సిద్దంగా ఉన్నారా. దీంతో..అసలు చంద్రబాబు ఏం చేయబోతున్నారు...వంశీ విషయంలో సీఎం జగన్ వ్యూహం ఏంటనే చర్చ మొదలైంది.

నిన్న దేవినేని అవినాష్..రేపు వల్లభనేని వంశీ..నెక్స్ట్ కాట్రగడ్డ?: వేడెక్కిన బెజవాడనిన్న దేవినేని అవినాష్..రేపు వల్లభనేని వంశీ..నెక్స్ట్ కాట్రగడ్డ?: వేడెక్కిన బెజవాడ

జగన్ వ్యూహం ఇదేనా..

జగన్ వ్యూహం ఇదేనా..

ప్రభుత్వం ఏర్పాటయి అయిదు నెలలే అవుతుంది. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇప్పటికిప్పుడు చేర్చుకున్నా..వారి రాజీనామాలు తీసుకొని ఉప ఎన్నికలకు వెళ్లినా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో..టీడీపీలోనే కొనసాగిస్తూ వారి ద్వారా చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవటం..అసమ్మతి స్వరాలు ప్రతిపక్షంలోనే ఉండేలా వ్యవహరించటం ఇప్పుడు వైసీసీ వ్యూహం గా కనిపిస్తోంది.

దీంతో..వంశీని వైసీపీలో అధికారికంగా చేర్చుకోకుండా వేచి చూసే ధోరణి. పార్టీలో చేర్చుకోవాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసిన తరువాతనే.అందునా వంశీ విషయంలో ఇప్పడు చంద్రబాబు నిర్ణయాలనకు అనుగుణంగా తదుపరి వ్యూహం అమలు చేయాలని వైసీపీ భావిస్తోంది.

చంద్రబాబు వేటు వేస్తారా..

చంద్రబాబు వేటు వేస్తారా..

వంశీ తాను ఎమ్మెల్యేగ గెలిచిన పార్టీ పైన అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. చంద్రబాబు..లోకేశ్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి..ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారు. వంశీ మీద వేటు వేస్తారా. ఆయన వైసీపీలో చేరుతానని ఓపెన్ గా చెప్పిన తరువాత ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయమని ఫిర్యాదు చేస్తారా.

అలా చేస్తే..గన్నవరంలో ఉప ఎన్నికకు సిద్దంగా ఉన్నారా. వీటికి చంద్రబాబు సిద్దంగా లేరనే సమాచారం తోనే వంశీ బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. వైసీపీ వ్యూహం అయితే వంశీ కొంత కాలం అధికారికంగా తమ పార్టీలో చేర్చుకోకుండా..టీడీపీలోనే ఉంటూ ఆ పార్టీపైన అసమ్మతి స్వరం వినిపించేలా చేయటమే లక్ష్యంగా కనిపిస్తోంది.

ఉప ఎన్నికే రెండు పార్టీలకు సవాల్ గా...

ఉప ఎన్నికే రెండు పార్టీలకు సవాల్ గా...

ఇక రాజీనామా చేయించి వైసీపీలోకి తీసుకోవాలన్నా.. అదే సమయంలో వంశీ పైన టీడీపీ వేటు వేయాలన్నా రెండు పార్టీల్లోనూ ఉప ఎన్నికే సమస్యగా మారుతోంది. ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చిన తరువాత అయిదు నెలలకే ఉప ఎన్నికలకు వెళ్లటానికి వైసీపీ సుముఖంగా లేదు. అదే సమయంలో గన్నవరంలో వంశీ వెళ్లిపోవటంతో పార్టీ అక్కడ బలహీనంగా కనిపిస్తోంది.

దీంతో పాటుగా ప్రజల మూడ్ ఏంటనేది ఇప్పుడు రెండు పార్టీలు అంచనా వేయలేకపోతున్నాయి. దీంతో..అనర్హత వేటు దిశగా చంద్రబాబు ఫిర్యాదు చేస్తారా లేదా అనేది ఆసక్తి కరమే. ముఖ్యమంత్రి సైతం స్థానిక ఎన్నికల్లో ప్రజల మూడ్ తెలిసిన తరువాత పార్టీలో చేరికలు..ఉప ఎన్నికల మీద నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

English summary
Vallabhaneni Vamis issue creating curiosity in AP Politics. CM Jagan waiting for CBN action against Vamsi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X