వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారులకు వార్నింగ్ ఇచ్చిన జగన్ ... ఆ విషయంలో చిన్న తప్పు కూడా జరగొద్దు

|
Google Oneindia TeluguNews

Recommended Video

YS Jagan Sensational Decision Stepping Towards Decentralisation In The State

ఏపీ సర్కార్ అధికారంలోకి రాగానే పాత ఇసుక పాలసీని రద్దు చేసి నూతన ఇసుకపాలసీని తెచ్చింది. ఇక ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇసుక విధానంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని ఇసుక పాలసీ అమలులో అలసత్వం వహిస్తే ఊరుకోమని హెచ్చరించారు సీఎం జగన్‌. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా సరే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనిజాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి .

రాజధానిపై మభ్యపెట్టను.. గ్రాఫిక్స్ చూపను .. ఏపీ రాజధానులపై జగన్ కీలక వ్యాఖ్యలురాజధానిపై మభ్యపెట్టను.. గ్రాఫిక్స్ చూపను .. ఏపీ రాజధానులపై జగన్ కీలక వ్యాఖ్యలు

 చిన్న పొరపాటు కూడా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచన

చిన్న పొరపాటు కూడా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచన

నూతన ఇసుక పాలసీ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. ఇసుక పాలసీ అమలుపై ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం. ఇసుక పాలసీపై సమీక్ష చేసిన సీఎం ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ ఒక్కరు తప్పు చేసినా అది మొత్తం వ్యవస్థకు చుట్టుకుంటుందని అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

అక్రమాలకు సంబంధించి ఒక్క కేసు నమోదైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న జగన్

అక్రమాలకు సంబంధించి ఒక్క కేసు నమోదైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న జగన్

పారదర్శకమైన ఇసుక విధానం అమలు చేస్తున్నామని, అవినీతికి తావు లేకుండా , అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టువేసే విధంగా ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు జగన్‌. ఇసుక అక్రమాలకు సంబంధించి ఒక్క కేసు నమోదైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన అధికారలుఅకు తెలిపారు . అలా జరగకుండా కలెక్టర్లు సీరియస్‌గా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్ . అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు సీఎం.

ఇసుక పాలసీని సమర్ధంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు

ఇసుక పాలసీని సమర్ధంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు

ఇక అధికారులు ఇసుక అమలు విధానంపై సమగ్ర సమాచారం తెప్పించుకొని, అక్రమాలకు తావులేకుండా చూడాలన్నారు. రానున్న స్పందన సమావేశం నాటికి దీనిపై పక్కా సమాచారంతో రెడీగా ఉండాలని ఆదేశించారు సీఎం జగన్ . ఎ డర్టీ ఫిష్‌ స్పాయిల్‌ ద హోల్‌ పాండ్‌ అన్నట్టు ఒక్క చిన్న పొరబాటు జరిగినా సహించను అని చెప్పారు. అధికారులు అలా జాగ్రత్తలు తీసుకుని ఇసుక పాలసీని సమర్ధంగా నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు.

English summary
When AP government came to power, ycp government abolished the old sand policy and brought a new sand policy. The new sand policy being implemented by the AP government should not be affected said CM Jagan. CM Jagan Mohan Reddy has instructed district collectors to beware that the government will have a bad reputation if anyone acts irresponsibly. Jagan warned to the officials Strict action should be taken to prevent any small mistakes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X