వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ తిరుమల పర్యటన .. నేడే శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ.. బీజేపీ, టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

నేడు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు జరగనున్న గరుడ సేవను పురస్కరించుకొని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆయన వెళుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం వైయస్ జగన్ రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తిరుమల వెళ్లనున్నారు.

ఖబడ్దార్ కొడాలి నానీ: రాబోయే రోజుల్లో జరిగేదదే.. ఎంపీ రఘురామ వార్నింగ్ఖబడ్దార్ కొడాలి నానీ: రాబోయే రోజుల్లో జరిగేదదే.. ఎంపీ రఘురామ వార్నింగ్

 ఈ నేపధ్యంలో తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఈ నేపధ్యంలో తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈ ఏడాది స్వామి వారికి సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆనవాయితీ ప్రకారం బేడి ఆంజనేయస్వామి ఆలయం నుండి మేళ తాళాలతో బయలుదేరి తిరుమల స్వామి వారి ఆలయానికి చేరుకుని పట్టు వస్త్రాలు సమర్పించి గరుడవాహన సేవలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారు.

 రేపు కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి సత్రాలకు శంకుస్థాపన

రేపు కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి సత్రాలకు శంకుస్థాపన

రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు కూడా స్వామివారి దర్శనం చేసుకోనున్నారు సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. అంతేకాకుండా నాదనీరాజనం వేదికపై సుందరకాండ పారాయణం కార్యక్రమంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి కర్ణాటక రాష్ట్ర చారిటీ సత్రాలకు శంకుస్థాపన చేస్తారు. తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరి అక్కడ నుండి అమరావతికి వెళతారు. కరోనా నిబంధనల దృష్ట్యా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

 జగన్ పర్యటనకు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు

జగన్ పర్యటనకు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు

సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రోడ్డు మార్గంలో శానిటేషన్ పనులు, ఎయిర్ పోర్టులో సీఎం జగన్ కు స్వాగతం పలకడం కోసం వచ్చే ప్రతినిధుల కోసం ప్రత్యేక బారికేడ్ల నిర్మాణం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పెంచారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న రోడ్డు మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ తిరుమల పర్యటనకు ఆటంకం కలగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.

Recommended Video

Telangana లో Women Commission ఏర్పాటు కోసం రోడ్డెక్కిన TTDP మహిళలు..
బీజేపీ , టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ .. టీడీపీ ఆందోళనకు పిలుపు

బీజేపీ , టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ .. టీడీపీ ఆందోళనకు పిలుపు

బీజేపీ, టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. తాజాగా తిరుమలలో డిక్లరేషన్ విషయం పై వివాదం చెలరేగడంతో టిడిపి ,బిజెపి నేతలు అన్య మతస్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వవలసిందే అని తేల్చిచెప్పడంతో ఈరోజు తిరుమలకు వెళ్తున్న వైయస్ జగన్ ను అడ్డుకునే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యగా ఆందోళనకారులను అరెస్టు చేస్తున్నారు .టిటిడి పరిపాలనా భవనం ముందు ఈరోజు టిడిపి ఆందోళనకు పిలుపునిచ్చింది. టీడీపీ ముఖ్య నాయకులు ఈరోజు తిరుపతికి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలను భగ్నం చేస్తూ, టిడిపి నిరసనను నిర్వీర్యం చేయడానికి ముందస్తుగా హౌస్ అరెస్టు చేస్తున్నారు పోలీసులు.

English summary
Today, AP CM YS Jagan Mohan Reddy will go to Thirumala. He is going to present silk garments on behalf of the government to Swami in honor of the Garuda service to be held today as part of the Srivari Brahmotsavalu. In the wake of this, house arrests of BJP and TDP leaders were made in advance and strict security arrangements were made in Thirumala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X