వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీకి మరో లేఖ రాసిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

ఏపీలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బోగ్గు గనులు కేటాయించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లేఖ మరోసారి కేంద్రానికి లేఖ రాశారు. ఏపీ భవిష్యత్ అవసరాల కోసం ఒడిశా రాష్ట్రం తాల్చేరులోని మందానికి బోగ్గు గనులను రాష్ట్రానికి కేటాయించాలని లేఖలో కోరారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడ బోగ్గు నిల్వలు లేకపోవడంతో పాటు భవిష్యత్‌లో మరో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి బోగ్గు నిల్వలు అవసరమవుతాయని లేఖలో వివరించారు.

ఒడిశాలోని బోగ్గుగనులను ఏపీకి కేటాయించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఝప్తి చేస్తూ..ప్రధాని మోడీకి లేఖ రాశారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేటాయించిన బోగ్గు నిల్వల్లో కనీస కేటాయింపులు కూడ లేవని లేఖలో తెలిపారు. ప్రస్తుతానికి ఏపీలో 5010లో మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కొనసాగుతున్నాయి. విభజన తర్వాత జరిగిన ఒప్పందాల్లో ఏపీకి సరైన బోగ్గు నిల్వలు లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు ఎదుర్కోంటున్నట్టు లేఖలో పేర్కోన్నారు. ముఖ్యంగా ఏపీ విద్యుత్ ఉత్పత్తి కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే బొగ్గుపై ఆధారపడాల్సి వస్తుందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి భరోసా లేకుండా పోయిందని పేర్కోన్నారు. కాగా ప్రస్తుతం ఏపీకి కేటాయించిన మధ్య ప్రదేశ్ ,చత్తీస్‌ఘడ్ గనుల్లో ఉత్పత్తికి అధిక ఖర్చు అవుతుందని తెలిపారు.

CM Jaganmohan Reddy wrote another letter to Prime Minister Modi for coal

ప్రస్తుతం ఎదుర్కోంటున్న బోగ్గు సమస్య తీర్చడంతో పాటు భవిష్యత్‌లో అనగా 2020 కల్లా ఏపీ జెన్‌కో తన థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వార మరో 1600 మెగావాట్ల అదనంగా ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రతి సంవత్సరం మరో 7.5 ఎంఎంటీఏల బోగ్గు నిల్వలు అవసరమవుతుందని తెలిపారు. కాగా ఇటివల బొగ్గు బొగ్గకొరతతో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలోనే బొగ్గు కేటాయింపులపై సీఎం కేంద్రానికి లేఖ రాశారు.

English summary
CM Jaganmohan Reddy has written a letter once again to the Center asking proper allocation of coal mines for the thermal power generation in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X