వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వంపై కొన్ని మీడీయా సంస్థలు విషం చిమ్ముతున్నాయి : పేర్ని నాని

|
Google Oneindia TeluguNews

అత్యధిక మెజారీటీతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మంత్రి పేర్నీ నానీ అన్నారు. ఈ నేపథ్యంలనే ప్రజల విశ్వాసం నిలబెట్టుకునే విధంగా సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని అయన చెప్పారు. ఈనేపథ్యంలోనే తమ ప్రభుత్వంపై ఓ మీడీయా సంస్థ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తుందని ఆయన మండి పడ్డారు.

ఈ సంధర్భంగా ఆర్టీసీ బస్సుల కొనుగోలులో తప్పుడు వార్తలు ప్రచురించిందని ఆయన మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనపై విషం చిమ్మే ధోరణిలో వారు వ్వవహరిస్తుందని అన్నారు. దీంతోపాటు గ్రామ సచివాలయం పరీక్ష పేపర్‌ లీకైందని అసత్య ప్రచారం చేశారని.. అలాగే అధికారుల బదిలీలపై కూడా ఇష్టమొచ్చినట్టు వార్తలు రాశారని తెలిపారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

cm jaganmohanreddy trying to take public confidence on the government : Minister Perni Nani

ఇక జగన్ ప్రభుత్వం పారదర్శక పాలనను అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ సర్వీసు కమీషన్ ద్వార ఎంపికయ్యో ఉద్యోగాల్లో ఇంటర్యూలు లేకుండా చేసిన ఘనత సీఎం జగన్‌మోహన్ రెడ్డిదని అన్నారు. మరోవైపు కులం మతం లేకుండా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

మరోవైపు ప్రభుత్వం చేసిన ఆక్రమాలపై ఆయన మండిపడ్డారు. ఉద్యోగాల పేరుతో ఎన్నో అబద్దాలు అడిందని ఆరోపించారు. ఉద్యోగ నియామాకాలు చెపట్టకుండా అనేక ప్రలోభాలకు గురి చేసిందని చెప్పారు. ఈనేపథ్యంలోనే కనీసం ఆర్టీసీలో కారుణ్య నియామకాలు కూడ చేపట్టలేదని ఆయన విమర్శించారు. ఇక ప్రాజెక్టుల నిర్మాణాల్లో కూడ భారీ అక్రమాలకు పాల్పడిందని వివరించిన ఆయన రివర్స్ టెండరింగ్ ద్వార ప్రస్తుత ప్రభుత్వం 750 కోట్లు ఆదా చేసిందని చెప్పారు.

English summary
YCP government came to power with a full majority, and cm jaganmohan reddy trying to take public confidence on the governament Minister Perni Nani said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X