వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎస్ ఎంపికపై సీఎం కసరత్తు - చంద్రబాబు మాజీ అధికారి ఎంట్రీ..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనా పరంగానూ కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపిక పైన సీఎం కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. దీంతో, తరువాత సీనియర్లుగా ఉన్న వారిలో ఇప్పటి వరకు జవహర్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. కానీ, అనూహ్యంగా ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ అధికారి గిరిధర్ సీఎంతో సమావేశమయ్యారు. ఆయన గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పని చేసారు.

 కొత్త సీఎస్ ఎంపికలో సీఎం జగన్

కొత్త సీఎస్ ఎంపికలో సీఎం జగన్

ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపికపైన సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా ఉన్న గిరిధర్ సీఎంతో సమావేశమయ్యారు. ఏపీ కేడర్ కు చెందిన గిరిధర్ 1988 బ్యాచ్ అధికారి. ప్రస్తుత సీఎస్ శమీర్ శర్మ తరువాత సీనియర్లలో నీరభ్ కుమార్ ప్రసాద్ తరువాతి స్థానంలో గిరిధర్ సీనియర్ గా ఉన్నారు. అయితే, గిరిధర్ ప్రస్తుతం కీలకమైన రక్షణ శాఖ కార్యదర్శిగా కేంద్రం లో కీలక స్థానంలో కొనసాగుతున్నారు. ఈ మధ్య కాలంలోనే ఆ పోస్టులో నియమితులయ్యారు.

సీఎంతో ఐఏఎస్ గిరిధర్ సమావేశం

సీఎంతో ఐఏఎస్ గిరిధర్ సమావేశం


రక్షణ శాఖ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగినపూడి బీచ్ వద్ద నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గిరిధర్ తాడేపల్లిలో సీఎంతో సమావేశమయ్యారు. సీఎస్ గా నియామకం పైన సీఎం - గిరిధర్ మధ్య చర్చ జరిగిందని చెబుతున్నారు. అదే సమయంలో కేంద్రంలో కీలక పదవిలో ఉన్న గిరిధర్ ఏపీకి వచ్చే అవకాశం లేదనే చర్చ అధికార వర్గాల్లో వినిపిస్తోంది. గిరిధర్ 2014లో ఏపీ సీఎంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సమయంలో కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి వచ్చారు. చంద్రబాబు కార్యాలయంలో కీలక అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. అమరావతి బాధ్యతలను పర్యవేక్షించారు. కానీ, అమరావతి విషయంలో నాటి ప్రభుత్వంలోని ముఖ్యుల తీరుతో విభేదించి.. నాడు సీఎంఓ నుంచి తప్పుకున్నారు.

 సీఎస్ గా అవకాశం దక్కేదెవరికి

సీఎస్ గా అవకాశం దక్కేదెవరికి


ఆ తరువాత ఏపీపీఎస్సీలో పని చేసారు. కొద్ది కాలానికే తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ప్రస్తుతం సీఎస్ ఎంపిక వ్యవహారం .. అమరావతి పైన వివాదం కొనసాగుతున్న సమయంలో సీనియర్ అధికారి గిరిధర్ సీఎంతో సమావేశం కావటంలో అధికార వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. అయితే, ఏపీలో రక్షణ శాఖ ప్రాజెక్టుల వ్యవహారం పైనే సీఎం - గిరిధ్ మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం సీఎస్ గా జవహర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా.. సామాజిక సమీకరణాలను ప్రతిపక్షాలు నియామకాల్లోనూ తెర మీదకు తెస్తున్న సమయంలో..సీఎస్ ఎంపిక విషయంలో సీఎం జగన్ చివరకు ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Central Deffence secretary Giridhar met CM Jagan amid new CS selection process it became discussion in officials circle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X