వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పేషీలో అధికారి డ్రైవర్ సహా ఐదుగురికి కరోనా: సచివాలయంలో 10కి చేరిన బాధితులు..

|
Google Oneindia TeluguNews

ఏపీ సచివాలయంలో కరోనా భయాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. తాజాగా మరో ఐదుగురికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇందులో ఏకంగా సీఎం జగన్ పేషీలో పనిచేస్తున్న ఓ అధికారి డ్రైవర్ కే కరోనా పాజిటివ్ గా తేలడంతో సీఎంవోలో భయాలు నెలకొన్నాయి.

Recommended Video

CM Jagan Peshi Officer's Driver Among Five Tested Covid-19 Positive

నాలుగు రోజుల క్రితం ఏపీ సచివాలయంలోనే వ్యవసాయశాఖలోని ముగ్గురు ఉద్యోగులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో మూడు, నాలుగు బ్లాక్ లను మూసేశారు. వీరికి చికిత్స అందిస్తున్న క్రమంలో వీరిలో ఒకరి రూమ్ మేట్ అయిన సాధారణ పరిపాలనశాఖ ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయింది. ఆ వెంటనే అసెంబ్లీ గేటు వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ కు కూడా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఈ ఐదుగురిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి పంపించారు.

cm jagans peshi officers driver among five latest tested covid 19 positive

ఆ తర్వాత సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వైరస్ లక్షణాలతో సంబంధం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో మరో ఐదుగురికి కరోనా నిర్ధారణ అయింది. ఇందులో సీఎం జగన్ పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్ కి కూడా కరోనా పాజిటివ్
గా తేలింది. దీంతో

ఇప్పటి వరకు మొత్తంగా ఏపీ సచివాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.తాజాగా పొరుగు సేవల ద్వారా కమాండ్ కంట్రోల్‌లో పనిచేసే ఒక ఉద్యోగికి, ప్రణాళిక విభాగం‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి, పరిశ్రమల శాఖలో పనిచేసే మరో ఉద్యోగికి,విద్యాశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు,సీఎంవో బ్లాక్‌ ఆర్‌టీజీఎ‌స్‌లో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్‌కు కూడా కరోనా నిర్ధారణ అయింది.

English summary
coronavirus fears looms in andhra pradesh cmo, after a driver of an official working in cm jagan's peshi tested covid 19 positive. he was one of the five patients tested positive today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X