హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

3వ వన్డేకి అతిథిగా కెసిఆర్: విద్యాసాగర్‌కి సన్మానం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. నవంబర్ 9న హైదరాబాద్‌లోని ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మూడో వన్డే జరగనుంది. మూడో వన్డేకు గౌరవ అతిథిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు.

ఆయన మ్యాచును ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. కాగా, రెండో వన్డే అహ్మదాబాద్‌లో గురువారం(నవంబర్ 6) జరగనుంది. న్యూఢిల్లీలో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా సమష్టిగా రాణించి విజయం సాధించిన విషయం తెలిసిందే.

మహారాష్ట్ర గవర్నర్‌ను సన్మానించనున్న ప్రభుత్వం

CM KCR chief guest for 3rd ODI

హైదరాబాద్ : మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావును రాష్ట్ర ప్రభుత్వం సన్మానించనుంది. ఈ కార్యక్రమం నవంబర్ 9న సాయంత్రం జలవిహార్‌లో జరగనుంది. కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర 22వ గవర్న్‌ర్‌గా 2014, ఆగస్టున బాధత్యలు స్వీకరించిన విషయం తెలిసిందే. కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున విద్యాసాగర్‌రావు రెండు సార్లు గెలుపొందారు. విద్యాసాగర్‌రావు స్వస్థలం కరీంనగర్ జిల్లా నాగారం.

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నాగిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా నాగిరెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.

English summary
It is said that Telangana CM K Chandrasekhar Rao will attend as chief guest for 3rd ODI match between India Vs Srilanka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X