వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైకోలాగా జగన్, బెంగ పెట్టుకున్నాడు: సిఎం రమేష్

|
Google Oneindia TeluguNews

CM Ramesh
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ.. భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతుండటం, రాష్ట్ర విభజన ఆలస్యమవుతండటంతో జగన్మోహన్ రెడ్డి బెంగ పెట్టుకున్నారని అన్నారు.

సమైక్యం కోసం కలిసి పనిచేయాలి: శైలజానాథ్

రాష్ట్ర సమైక్యం కోసం సీమాంధ్ర నేతలందరూ కలిసి పనిచేయాలని మంత్రి శైలజానాథ్ అన్నారు. శనివారం ఏపిఎన్జివోలు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. ఏపిఎన్జివోలు నిర్వహించే అన్ని కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని శైలజానాథ్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా ఏపిఎన్జివోల కార్యక్రమాలకు సహకరించాలని చెప్పారని తెలిపారు. సమైక్య ఉద్యమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళతామని ఆయన అన్నారు.

కాగా అఖిలపక్ష సమావేశంలో ఏపిఎన్జివోలు తమ కార్యాచరణను ప్రకటించారు. జనవరి 2న విశాఖ న్యాయవాదుల సమైక్య గర్జన పేరుతో సభను నిర్వహించి తమ కార్యాచరణను ప్రారంభిస్తామని ఏపి ఎన్జివోలు తెలిపారు. జనవరి 3న సీమాంధ్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు.

ఏపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ.. సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ రాష్ట్ర సమైక్యానికి కట్టుబడి ఉండాలని అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లును ఓడించాలని ఆయన అన్నారు. జనవరి 23లోగా సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ సమైక్యాంధ్రకు మద్దతుగా అఫిడవిట్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందించాలని కోరారు.

రాష్ట్ర విభజన రాజ్యాంగ బద్దంగానే జరుగుతోంది: పొన్నాల

రాష్ట్ర విభజన రాజ్యాంగ బద్దంగానే జరుగుతోందని రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. విభజన ప్రక్రియను ఆయన శనివారం మాట్లాడుతూ.. అడ్డుకుని చరిత్ర హీనులు కావొద్దని ఆయన హితవు పలికారు. రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి అభిప్రాయాలు మాత్రమే కోరారని, అసెంబ్లీలో ఓటింగ్ అవసరం లేదని ఆయన అన్నారు.

English summary

 Telugudesam Party Parliment Member CM Ramesh on Saturday fired at YSR Congress Party President YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X