వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై స్పందించిన సీఎం రమేష్.. ఏం చెప్పారంటే

|
Google Oneindia TeluguNews

గత ఎన్నికల్లో ఓటమితో ఇంకా కోలుకోలేక పోతున్న టిడిపిని ఏపీ లోని అధికార వైసిపి, బిజెపి మరింత ఇబ్బంది పెడుతున్నాయి. చాలా మంది టీడీపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారంటూ బిజెపి నేత సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు టిడిపి పైన నేతల విశ్వాసం పోయిందని బిజెపి నేతలతో చాలా మంది టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఒక రాజ్య సభ సభ్యుడు కూడా టచ్ లో ఉన్నారని సంచలనం సృష్టించారు. ఇక ఈ నేపధ్యంలో ఎన్నికల తర్వాత సైలెంట్ అయిన, టీడీపీతోనూ అంటీ ముట్టనట్టు ఉంటున్న రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్ పై అందరి దృష్టి పడింది. సీఎం రమేష్ బీజేపీలో చేరేందుకు చూస్తున్నరన్న వార్త ఇప్పుడు ఏపీలో జోరుగా ప్రచారం అవుతుంది.

పార్టీ మార్పు వార్తలపై స్పందించిన సీఎం రమేష్

పార్టీ మార్పు వార్తలపై స్పందించిన సీఎం రమేష్

ఏపీలో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీలో ఉన్న నేతలు చాలా మంది టీడీపీలో ఉంటే ఇబ్బందులు పడతామేమో అన్న ఆలోచనలో ఉన్నారు. ఇక ఇప్పటికే కేశినేని నానీ చేస్తున్న రగడతో టీడీపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు బయటకు వస్తుంటే ఇక తాజాగా సీఎం రమేష్ సైతం పార్టీ మారనున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్‌లో ఉన్నారన్న వార్తలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఇక టీడీపీలోని కీలక నేతలపై బీజేపీ సైతం దృష్టిసారించిందని..త్వరలోనే వారంతా కమలం తీర్థం పుచ్చుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ జాబితాలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంపై సీఎం రమేష్ స్పందించారు.

పార్టీ మారే అవసరం తనకు లేదని బీజేపీలో చేరనని చెప్పిన సీఎం రమేష్

పార్టీ మారే అవసరం తనకు లేదని బీజేపీలో చేరనని చెప్పిన సీఎం రమేష్

పార్టీ మార్పుపై ఎవరూ తమను సంప్రదించలేదని సీఎం రమేష్ స్పష్టంచేశారు. తాము కూడా ఎవర్నీ సంప్రదించలేదని సీఎం రమేష్ అన్నారు. పార్టీ మారే అవసరం టీడీపీలో ఎవరికీ లేదని ఆయన తేల్చిచెప్పారు. బీజేపీలో చేరే ఉద్దేశం తనకు లేదన్న సీఎం రమేష్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ కేవలం కల్పితాలని , అబద్దాలని కొట్టిపారేశారు. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు అని ఆయన అంటున్నారు. అంతే కాదు టీడీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌ని నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారాలను ఆయన ఖండించారు. ఇందులో వాస్తవం లేదని సీఎం రమేష్ తేల్చి చెప్పారు.

టీడీపీలో టెన్షన్ .. నేతల పై నిఘా పెట్టిన చంద్రబాబు

టీడీపీలో టెన్షన్ .. నేతల పై నిఘా పెట్టిన చంద్రబాబు

మొత్తానికి వైసీపీ , బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ నా .. లేకా నిజంగానే టీడీపీ శ్రేణులు పక్క చూపులు చూస్తున్నాయా అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం వుంది . మొత్తానికి ఇప్పుడు ముఖ్య నేతలు పార్టీ మారతారని జరుగుతున్న ప్రచారంతో టీడీపీలో టెన్షన్ మొదలైంది . ఎప్పుడు ఎవరు టీడీపీకి గుడ్ బై చెప్తారో అన్న ఆందోళన మొదలైంది. ఒక పక్క చంద్రబాబు కూడా సొంత పార్టీ నేతలపై నిఘా పెట్టారు.

English summary
CM Ramesh said that nobody had contacted me for the party change. We have not contacted anyone, "said CM Ramesh. There is no need for TDP to change the party, he said. CM Ramesh, who did not intend to join BJP, dismissed all the news coming in the media as fraudulent and false. Do not believe in the media campaign, he says
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X