వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వైసిపికి 35 సీట్లకు మించవు, ఇదీ జగన్‌కు ప్రశాంత్ కిషోర్ చెప్పింది'

ఎన్నికలు వస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30 - 35కు మించి సీట్లు రావని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రతిపక్ష నేత జగన్‌కు నివేదిక ఇచ్చారని టిడిపి ఎంపీ సిఎం రమేష్ సోమవారం అన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎన్నికలు వస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30 - 35కు మించి సీట్లు రావని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రతిపక్ష నేత జగన్‌కు నివేదిక ఇచ్చారని టిడిపి ఎంపీ సిఎం రమేష్ సోమవారం అన్నారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ పార్టీకి అంతకుమించి సీట్లు రావని సీఎం రమేష్ అన్నారు. స్వయంగా ప్రశాంత్ కిషోరే ఈ మేరకు రిపోర్ట్ ఇవ్వడం గమనార్హం అన్నారు.

వైసిపి ప్లీనరీలో జగన్ అన్నీ అవాస్తవాలే చెప్పారన్నారు. జగన్‌కు తన సామర్థ్యంపై నమ్మకం లేకనే కన్సల్టెంటుగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకున్నారని చెప్పారు.

ప్రశాంత్ కిషోర్ ఏం సలహాలిస్తున్నారో తెలియదు కానీ: జగన్‌పై జేసీప్రశాంత్ కిషోర్ ఏం సలహాలిస్తున్నారో తెలియదు కానీ: జగన్‌పై జేసీ

CM Ramesh says Prashant Kishor gave survey report to YS Jagan

ఈడీ కొత్తగా ఏ ఆస్తులు అటాచ్ చేస్తుందోనని జగన్ టెన్షన్‌తో ఉన్నారని చెప్పారు. అందుకే జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఏపీ కోసం కఠోర శ్రమ పడుతున్న చంద్రబాబుపై బురద చల్లాలనుకుంటే జగన్ ఉన్న ఉనికిని కూడా కోల్పోతారన్నారు.

ప్రశాంత్ కిషోరే తనను గెలిపిస్తాడని జగన్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అంటే జగన్ స్థాయి ఏమిటో తెలుసుకోవాలని ప్రజలకు చెప్పారు. మీ పార్టీకి దమ్ము లేనప్పుడు ప్రశాంత్ కిషోర్ మాయలు మంత్రాలు చేసి గెలిపిస్తాడా అన్నారు.

English summary
TDP MP CM Ramesh on Monday said that Prashant Kishore gave survey report to YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X