• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం జగన్ ను పిలిచి అవమానించారా..! ప్రధాని..షా కలవకపోవటం వెనుక: హస్తినలో ఏం జరిగింది..!

|

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లారు...తిరిగి వచ్చారు. ప్రధాని మోదీ..అమిత్ షా ను కలవటానికి ఢిల్లీ వెళ్లిన సీఎం ఎందుకు వారిని కలవలేకపోయారు. ముందుగా అప్పాయింట్ మెంట్ లేకుడానే సీఎం ఢిల్లీ వెళ్లారా. లేక..ఇచ్చిన అప్పాయింట్ మెంట్లు రద్దు చేసుకున్నారా. ఇలా..ప్రతీసారి జగన్ ఢిల్లీ వెళ్లిన సమయంలో ఏం జరుగుతోంది. ఇది కేంద్రం పెద్దలు ఇలా ఉద్దేశ పూర్వకంగానే చేస్తున్నారా. లేక..సీఎం.. ప్రధాని మధ్య లో సీఎంఓ..పార్టీ ప్రముఖుల వైఫల్యమా. ఇంతకీ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ ఎంత సడన్ గా ఢిల్లీ వెళ్లారో..అంతే సడన్ గా తిరిగి వచ్చేసారు.

అయితే, తన వ్యక్తిగత సహాయకుడి మరణం కారణంగా సీఎం తిరిగి వచ్చేసారని చెబుతున్నారు. అయితే, ఢిల్లీకి రమ్మని తనకు కలిసే అవకాశం ఇవ్వకపోవటం వలనే సీఎం సడన్ గా ఏపీకి తిరుగు పయణమయ్యారని మరో వాదన. ఇంతకీ ఢిల్లీలో అసలేం జరిగింది. ప్రధాని మోదీ..అమిత్ షా ఎందుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు...ఇది సమన్వయ లోపమా..అవమానమా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది.

అప్పాయింట్ మెంట్ తీసుకొనే ఢిల్లీకీ..

అప్పాయింట్ మెంట్ తీసుకొనే ఢిల్లీకీ..

ముఖ్యమంత్రి జగన్ ఈ నెల5 వ తేదీన అనంతపురం లో కియో ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆ వెంటనే ఉండవల్లి వచ్చారు. అప్పుడే సడన్ గా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు సీఎంఓ నుండి సమాచారం బయటకు వచ్చింది. అయితే, ముఖ్యమంత్రి ఢిల్లీలో తొలుత అదే రోజు రాత్రి 10.30 గంటలకు అమిత్ షా తో..తరువాతి శుక్రవారం మధ్నాహ్నం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధానిని కలిసి రాష్ట్ర సమస్యలను వివరించటంతో పాటుగా.. ఈ నెల 23న కడప జిల్లాలో జరిగే స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు..అదే విధంగా జనవరి 9న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పధకం ప్రారంభానికి ఆహ్వానించాలని..ప్రధాని షెడ్యూల్ కు అనుగుణంగా ఒక కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేసారు. అయితే, దీని కోసం మందుగానే అప్పాయింట్ మెంట్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో పాటు పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీ అప్పాయింట్ మెంట్ తీసుకున్నారు.

వారిచ్చిన సమయానికి అందుబాటులో...

వారిచ్చిన సమయానికి అందుబాటులో...

ఢిల్లీలో 5వ తేదీ రాత్రి అమత్ షా అప్పాయింట్ మెంట్ ఉందని..పార్టీ ముఖ్య నేత ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చారు. దీంతో..ఆ సాయంత్రానికి సీఎం ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి 10.30 గంటలకు అమిత్ షా తో భేటీ అని టైం ఫిక్స్ చేసారు. అయితే, ప్రధాని...అమిత్ షా భద్రతాపరమైన అంశాల పైన ముఖ్యులతో కాన్ఫిరెన్స్ కారణంగా ఆ సమయానికి కలవటానికి వీలు కాదని ఆలస్యంగా హోం మంత్రి కార్యాలయం నుండి సీఎంఓ కు సమాచారం వచ్చింది . దీంతో..మరుసటి రోజు ప్రధానితో పాటుగా అమిత్ షాను పార్లమెంట్ లో కలవాలని భావించారు. అయితే, ఉదయం వరకూ ఇంకా కలిసే సమయం పైన క్లారిటీ రాలేదు. సరిగ్గా ఇదే సమయంలో..సీఎం జగన్ తన తాత రాజారెడ్డి నుండి తన వరకు తమ కుటుంబానికి సేవలు అందిస్తున్న వ్యక్తిగత సహాయకుడు నారాయణ మరణంతో ..అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని అనంతపురం చేరుకున్నారు. నారాయణ భౌతిక ఖాయాన్ని సందర్శించటంతో పాటుగా కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సమన్వయం లోపమా..అవమానమా..!

సమన్వయం లోపమా..అవమానమా..!

మఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్లే సమయంలో ఖచ్చితంగా అప్పాయింట్ మెంట్ ఖరారు చేసుకున్న తరువాతనే బయల్దేరుతారు. అయితే, వారు చెప్పిన సమయంలో మార్పులు ఉంటే ముందుగానే తాము అప్పాయింట్ మెంట్ ఇచ్చిన నేతలను సమాచారం ఇస్తారు. అయితే, వరుసగా రెండో సారి ఢిల్లీలో ఈ రకంగా జరగటంతో ఇది ఉద్దేశపూర్వకంగా..లేక యాధ్రుచ్చికమా అనే చర్చ మొదలైంది. అయితే, పూర్తి స్థాయిలో ప్రధాని..అమిత్ షా ల షెడ్యూల్ తెలుసుకోకుండా..ముఖ్యమంత్రిని ఢిల్లీకి రప్పించటంలో అధికారుకంటే పార్టీకి చెందిన ఒక కీలక నేత ప్రదర్శించిన అత్యుత్సహామే కారణమనే ప్రచారం సాగుతోంది.

అయితే, ముందుగా అప్పాయింట్ మెంట్ ఇచ్చి...వెయిట్ చేయిచటం పైనా రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఇది..ముఖ్యమంత్రి జగన ను అవమానించటమే అంటూ వాదన వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు విషయంలోనూ ఇదే విధంగా అప్పాయింట్ మెంట్ అడిగితే ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన విషయాన్ని సైతం విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అయితే, ఏపీ అధికారులు మాత్రం ఈ వారంలోనే మరోసారి సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తారని చెబుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CM Jagan did not got appointement with PM modi and Amith shah in his delhi tour now became hot topic in AP Politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more