వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మండలిని కొనసాగించాలా..షరతులు వర్తిస్తాయి: రంగంలోకి మధ్యవర్తులు: అలాగైతే ఓకే..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో శాసనమండలి కొనసాగుతుందా..లేదా. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను మండలి ఛైర్మన్ తన విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపుతూ రూలింగ్ ఇచ్చారు. ఒక వైపు తప్పు అని చెబుతూనే...మరోవైపు సెలెక్ట్ కమటీకి పంపాలనే నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ ముఖ్యమంత్రి సీరియస్ అవుతున్నారు. నేరుగా శాసనసభా వేదికగా మండలిలో జరిగిన పరిణామాల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు మండలి అవసరమా అనే చర్చ తీసుకొచ్చారు. దీని పైన సోమవారం చర్చించి నిర్ణయం తీసుకుందామని ప్రతిపాదించారు. ఇదే సమయంలో సోమవారం ఉదయం కేబినెట్ కు నిర్ణయించారు. దీంతో..ఇప్పుడు మండలిని రద్దు చేయకుండా ఆపుకొనే ఉద్దేశంతో కొందరు మధ్యవర్తులు ముందుకు వచ్చారు. వైసీపీ నేతలతో మంతనాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, వైసీపీ ముఖ్య నేతలు మాత్రం మండలిలో జరిగిన పరిణామాలను తీవ్రంగా పరిగణించారు. మండలి రద్దు చేయకూడదంటే షరతులు తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. దీని పైన ఇప్పుడు చర్చ మొదలైంది.

కలిసొచ్చే ఎమ్మెల్సీలు వస్తే...

కలిసొచ్చే ఎమ్మెల్సీలు వస్తే...


శాసనమండలిలో 2021 వరకు అధికార వైసీపీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం కనిపించటం లేదు. అయితే, ఇక నుండి పదవీ విరమణ చేసే సభ్యుల స్థానంలో క్రమేణా వైసీపీ సభ్యులతో భర్తీ చేయనున్నారు. ఏడాది కాలం ఓపిక పడితే క్రమేణా పెద్దల సభలోనే పట్టు మనదే అనే భావన వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. దీని కోసం ఇప్పుడు జరిగిన పరిణామాలతో మండలి రద్దు చేయటం పైన వైసీపీ నేతల్లో భిన్నాభి ప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నేరుగా రద్దు చేయకుండా..ప్రత్యామ్నాయాలు పరిశీలించాలంటూ కొందరు మంత్రులు సీఎం వద్ద సైతం ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. అయితే సీఎం మాత్రం ప్రభుత్వం సదుద్దేశంతో తీసుకొచ్చే బిల్లులకు అడ్డు పడటమేంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో రద్దు కాకుండా ఉండాలంటే..ఎమ్మెల్సీలు తమతో కలిసి రావాల్సిన అవసరం ఉంటుందని కొందరు వైసీపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. వారు వైసీపీలో చేరకుండానే..విడిగా ఒక గ్రూపుగా మండలిలో సభ్యులుగా కొనసాగవచ్చని..ఈ క్రమంలో ఎందరు కలిసి వస్తారో చూసిన తరువాత తుది నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది.

రంగంలోకి మధ్య వర్తులు..

రంగంలోకి మధ్య వర్తులు..

మండలిలోనే ముగ్గురు సభ్యులు సభను రద్దు చేయకుండా..ఏం చేయాలనే అంశం పైన కొందరు మంత్రులతో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో టీడీపీ మెజార్టీ సభలో కొనసాగితే..తమ బిల్లులకు అన్నింటికీ కొర్రీలు వేస్తూనే ఉంటుందని..దీనికి తాము ఉపేక్షించే పరిస్థితలో లేమని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే కొందరు టీడీపీ ఎమ్మెల్సీలు వైసీపీతో టచ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. వైసీపీ నేతలు అంచనా వేస్తున్నట్లుగా టీడీపీ నుండి ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్నవారితో మిగిలిన వారు కలిసి..మండలిలో ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని..దీని ద్వారా ప్రభుత్వం పంపే బిల్లులకు మండలిలో అడ్డు లేకుండా...ఉంటే మండలి రద్దు ఆలోచన పైన పునరాలోచించమని తాము సీఎంకు చెప్పేందుకు అవకాశం ఉంటుందని ఆ మంత్రులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. ప్రభుత్వ పరంగానూ ప్రయత్నాలు మొదలయ్యాయి. అటు మండలి రద్దు ఖాయమనే ప్రచారాన్ని తీవ్రతరం చేస్తూనే..మరో వైపు తమ వద్దకు వచ్చిన మధ్యవర్తులతో తాము ఏం కోరుకుంటున్నదీ వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఛైర్మన్ ను తప్పించాలి...బిల్లులు వేగంగా తెప్పించాలి

ఛైర్మన్ ను తప్పించాలి...బిల్లులు వేగంగా తెప్పించాలి


ఇదే సమయంలో ప్రస్తుత ఛైర్మన్ షరీఫ్ ను ఇక ఆ హోదాలో మాత్రం కొనసాగకుండా చూడాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. తాము అనుకున్న సభలో మద్దతు కూడగట్టలేక పోతే మాత్రం రద్దు ఖాయమంటూ స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీలు తమతో కలిసి వస్తే..రద్దు ప్రతిపాదన పక్కన పెడతామనే సంకేతాలిస్తున్నారు. అందులో భాగంగా..ప్రస్తుత ఛైర్మన్ పైన అవిశ్వాసం పెట్టటం లేదా..ఆయన్ను రాజీనామా చేయమని కోరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో వైసీపీ ఎమ్మెల్సీని ఛైర్మన్ ను చేయాలనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. సోమవారం ఉదయం కేబినెట్ సమావేశం అయ్యే సమయానికి తాము అనుకున్న విధంగా పట్టు దొరికితే..నిర్ణయం మార్చుకోవటం లేదంటే..అదే కేబినెట్ సమావేశంలో మండలి రద్దు నిర్ణయం తీసుకోవాలనేది వైసీపీ వ్యూహం గా కనిపిస్తోంది. దీంతో..మండలి రద్దు పైన తుది నిర్ణయం ఎలా ఉంటుందనే ఉత్కంఠ సభ్యుల్లో కొనసాగుతోంది.

English summary
Suspense still continues on Council abolish.Some of the sitting members started discussions with Govt on this proposal. They propsing alternate ways to fulfill govt wish.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X