వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాలీవుడ్‌కు బిగ్ రిలీఫ్.. సినిమా షూటింగ్‌లపై సీఎం జగన్ కీలక నిర్ణయం..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా నిషేధించిన షూటింగులకు అనుమతినిచ్చింది. ఈ మేరకు మంగళవారం(మే 19) సాయంత్రం జీవో కూడా విడుదల చేసింది. లొకేషన్స్‌ని మూడు విభాగాలుగా విభజించి క్యాష్ డిపాజిట్లను నిర్ణయించింది.

సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక ఉద్యోగులతో మొదలు, 21 నుంచే ఆరంభంసీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక ఉద్యోగులతో మొదలు, 21 నుంచే ఆరంభం

దీని ప్రకారం.. విశాఖ,తిరుపతి,భీమునిపట్నం,టూరిజం,ఆర్&బీ డిపార్ట్‌మెంట్స్ పరిధిలోకి వచ్చే స్పాట్లను రూ.5వేల కేటగిరీలో ఉంచారు. దేవాదాయ శాఖ పరిధిలోని కట్టడాలు, హార్టీకల్చర్,అడవులు,పబ్లిక్ లైబ్రరీలను రూ.10వేల కేటగిరీలో ఉంచారు.అలాగే అర్బన్ డెవలప్‌మెంట్,మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మ్యూజియంలు,స్కూళ్లు,పబ్లిక్ పార్కులను రూ.15వేల విభాగంలో ఉంచారు.

cm ys jagan allows movie shootings in andhra pradesh

సినిమా షూటింగులకు అనుమతినవ్వడం ఇండస్ట్రీ వర్గాలకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. రెండు నెలలుగా వాయిదాపడ్డ సినిమాలు తిరిగి పట్టాలెక్కే అవకాశం ఉంది. దీంతో ఇక సినీ ప్రియులకు తమ అభిమాన తారల సినీ విశేషాలకు సంబంధించి కొత్త అప్‌డేట్స్ అందుతాయి. ఇదిలా ఉంటే, త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా షూటింగ్స్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవచ్చు.

English summary
Andhra Pradesh chief minister YS Jagan allowed movie shootings in the state,government released a GO regarding this on Tuesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X