అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కంచుకోటపై చంద్రబాబు గురి

|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల హోరాహోరీగా తలపడుతున్నాయి. ఏ పార్టీ బలం ఎక్కడుంది? బలహీనత ఎక్కడుంది? ప్రత్యర్థి పార్టీని దెబ్బతీయాలంటే అనుసరించాల్సిన ప్రణాళికపై రెండు పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. రెండుపార్టీలకు ఒకటే ఆప్షన్ ఉంది. అది గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. అలాకాని పక్షంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ భవిష్యత్తులో నిలబడుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఒకరి బలంపై మరొకరు!

ఒకరి బలంపై మరొకరు!


తెలుగుదేశం బలంపై ముఖ్యమంత్రి జగన్ గురిపెడితే వైసీపీ బలంపై చంద్రబాబు గురిపెట్టారు. ఏయే జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి బలముందో ఆయా చోట్ల వైసీపీ విజయం సాధించేలా జగన్ వ్యూహరచన చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు కూడా వైఎస్ జగన్ బాటలోనే పయనిస్తున్నారు. వైసీపీకి రాయలసీమ కంచుకోటగా నిలబడింది. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు ఆ పార్టీకి పెట్టనికోటగా నిలిచాయి. ఇప్పుడు ఈ కోటను బద్ధలు కొట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. మెజారిటీ సీట్లు వైసీపీ ఇక్కడినుంచే సాధిస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 52 నియోజకవర్గాలకు 49 స్థానాలను వైసీపీ కైవసం చేసుకోగా, తెలుగుదేశం పార్టీ కుప్పం, హిందూపురం, ఉరవకొండలోనే గెలవగలిగింది.

 వైసీపీని నిరోధించాలని..

వైసీపీని నిరోధించాలని..


వైసీపీకి బలంగా ఉన్న రాయలసీమలో సాధ్యమైనంత త్వరగా ఆ పార్టీని నిరోధించాలని, టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. మొదటి నుంచి ఆయన సీమకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు తగ్గట్లుగా అక్కడి ప్రజల స్పందన కూడా పార్టీ నాయకులకు ఆనందాన్నిస్తోంది. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలకు రాయలసీమ నుంచి చంద్రబాబు కూడా ఊహించనటువంటి స్పందన రావడంతో ఆ పార్టీలో అమాంతం ఆత్మవిశ్వాసం ప్రోదిచేసుకుంది. ఎన్నికలయ్యేంతవరకు ఇదే ఒరవడిని కొనసాగించాలని భావిస్తోంది.

కుప్పంలో చంద్రబాబును ఓడించాలని..

కుప్పంలో చంద్రబాబును ఓడించాలని..


చంద్రబాబును ఈసారి కుప్పంలోనే ఓడించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. అందుకు బదులుగా మొత్తం రాయలసీమలో వైసీపీ బలాన్ని తగ్గించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యటనలు పెట్టుకుంటూ పార్టీ శ్రేణులతోపాటు ప్రజల్లో కూడా జోష్ నింపాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కుప్పంలో కాదని పులివెందులలో కూడా జగన్ ను ఓడిస్తామని ప్రకటించారు. సీమ కోసం రెండు పార్టీల పోరులో చివరకు ఎవరు విజయం సాధిస్తారో చూడాలి మరి.

English summary
If Chief Minister Jagan aimed at the strength of Telugu Desam, Chandrababu aimed at the strength of YCP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X