• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం జగన్ మరో రెండు కీలక నిర్ణయాలు - ఏపీ వ్యాప్తంగా ఆ కమిటీలు రద్దు - నకిలీలపై ఇంటెలిజెన్స్ నిఘా..

|

సైబ‌ర్ నేరగాళ్ల నుంచి మ‌హిళ‌ల‌ను కాపాడేందుకు, సైబ‌ర్ నేరాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఏపీ పోలీస్ శాఖ‌, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన 'ఈ -ర‌క్షాబంధ‌న్' కార్య‌క్ర‌మాన్ని రాఖీ పండుగ సందర్భంగా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సోమవారంనాడు మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంటల సీజన్ వేళ వ్యవసాయం, సాగునీటి రంగాలకు సంబంధించి, కరోనా నేపథ్యంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన ఆ రెండు నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి.

కరోనా షాకింగ్: దేశంలో రెండో దశ ఉత్పాతం - అంచనా వేయలేమన్న ఐసీఎంఆర్ - భిన్నంగా వైరస్ తీరు..

ఏపీ వ్యాప్తంగా నీటి కమిటీలు రద్దు..

ఏపీ వ్యాప్తంగా నీటి కమిటీలు రద్దు..

సీఎం జగన్ ఆదేశాల మేరకు.. రాష్ట్రంలో నీటి వినియోగదారుల సంఘాలు, ప్రాజెక్టు కమిటీలను రద్దు చేస్తూ ఏపీ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నీటి సంఘాలు, ప్రాజెక్టు కమిటీలపై అధ్యయనం చేసిన ‘కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ' ఈ మేరకు చేసిన సిఫార్సులను ప్రభుత్వం అమలులోపెట్టింది. తద్వారా రాష్ట్రంలోని 5766 నీటి వినియోగదారుల సంఘాలు, 49 ప్రాజెక్టు కమిటీలు, 244 నీటి పంపిణీ సంఘాలు రద్దయిపోయాయి.

కమిటీల స్థానంలో అధికారులు..

కమిటీల స్థానంలో అధికారులు..

రాష్ట్రంలోని 5766 నీటి వినియోగదారుల సంఘాలు, 49 ప్రాజెక్టు కమిటీలు, 244 నీటి పంపిణీ కమిటీలు సోమవారమే రద్దయిపోగా, వాటి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ అదే రోజు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీటి వినియోగదారుల సంఘాలకు జలవనరుల శాఖలోని స్థానికంగా ఉండే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరును, నీటి పంపిణీ సంఘాలకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ప్రాజెక్టు కమిటీలకు సూపరిండెంట్ ఇంజనీర్లను ప్రత్యేకాధికారిగా ప్రభుత్వం నియమించింది. ఇదిలా ఉంటే,

పండుగ పూట జగన్ సర్కారుకు శవయాత్ర - బీజేపీ వెన్నుపోటు, పవన్ నాయకత్వం - పద్మశ్రీ సంచలనం

డ్రంగ్‌ కంట్రోల్‌పై సీఎం సమీక్ష

డ్రంగ్‌ కంట్రోల్‌పై సీఎం సమీక్ష

కరోనా వేళ నకిలీ ఔషధాల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఆ రంగానికి సంబంధించి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం డ్రంగ్‌ కంట్రోల్‌పై సమీక్ష నిర్వహించిన ఆయన.. కొత్తగా విజిలెన్స్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. తద్వారా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాలను అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే ప్రక్రియ వేగవంతమవుతుందని సీఎం అన్నారు.

  Andhra Pradesh : Just Apply For E-pass And Travel To AP Without Clearance || Oneindia Telugu
  285 యూనిట్లు.. 34వేల దుకాణాలు..

  285 యూనిట్లు.. 34వేల దుకాణాలు..

  నకిలీ జౌషధాలను అరికట్టడంతోపాటు సక్రమంగా నడిచే వ్యవస్థలను ప్రోత్సహించాలని, విజయవాడలో ఉన్న ల్యాబ్‌తోపాటు కొత్తగా నిర్మాణంలో ఉన్న కర్నూలు, విశాఖపట్నం ల్యాబ్‌ల్లో సామర్ధ్యం పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో 285కిపైగా యూనిట్లు,34వేలకు పైగా జౌషధాలు అమ్మే దుకాణాలు ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డ్రగ్ కంట్రోల్ విభాగంలో ఏపీ మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండాలని, అందుకోసం థర్ట్‌ పార్టీ తనిఖీలు జరిగేలా చూడాలని, ఫిర్యాదులు ఎలా చేయాలో ప్రజలకు అవగాహన కల్పించాలని, వచ్చే ఫిర్యాదులన్నింటినీ డిజిటిల్‌ పద్ధతిలో నిక్షిప్తంచేసి, ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

  English summary
  andhra pradesh chief minister ys jagan took two key desicions on monday. water user associations and project committees across the state has Dissolved and Establishment of Vigilance-Intelligence Division in drug control administration
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X