హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల రగడ : వివాదంపై జగన్ రియాక్షన్.. వారికి అభినందన..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌ఘడ్ తక్కువ ధరకు కిట్లను కొనుగోలు చేస్తే.. ఏపీ ప్రభుత్వం మాత్రం భారీ ధరకు కొనుగోలు చేసిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు,కమిషన్ల కక్కుర్తి అంటూ తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. దీనికి వైసీపీ కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది.నిన్నటిదాకా టెస్టులు చేయడం లేదని విమర్శలు చేసి.. ఇప్పుడు కిట్లు తీసుకొస్తే... వాటిపై కూడా రాద్దాంతం చేస్తున్నారని మండిపడుతోంది. ఇలా ఈ వివాదం ముదురుతున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై స్పందించారు.

 ముస్లిం మత పెద్దలకు ఏపీ సీఎం దిశానిర్ధేశం..! రంజాన్ పర్వదినం గురించి కీలక సూచనలు చేసిన జగన్..!! ముస్లిం మత పెద్దలకు ఏపీ సీఎం దిశానిర్ధేశం..! రంజాన్ పర్వదినం గురించి కీలక సూచనలు చేసిన జగన్..!!

జగన్ రియాక్షన్..

జగన్ రియాక్షన్..


ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వ సొమ్మును ఆదా చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైద్యారోగ్య శాఖను అభినందించారు. టెస్టింగ్ కిట్లను కేంద్రాన్ని అడిగినా ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే కొనుక్కోవాలని కేంద్రమే చెప్పిందన్నారు. ఇలాంటి తరుణంలో వేగంగా,ఎక్కడా రాజీపడకుండా కిట్లను రాష్ట్రానికి దిగుమతి చేసినందుకు వైద్యారోగ్య శాఖ అధికారులను ప్రశంసించారు. ఐసీఎంఆర్ అనుమతిచ్చిన కంపెనీ వద్దే కిట్లు కొనుగోలు చేశామన్నారు. అయితే ఆ కంపెనీ మన దేశంలో ఐసీఎంఆర్ అనుమతి పొందడానికి ముందే తాము ఆర్డర్ ఇచ్చామని.. అప్పుడవి బయటి దేశంలో తయారయ్యేవని చెప్పారు. షరతుల కారణంగా ఇప్పుడు రేట్లు కూడా తగ్గబోతున్నాయన్నారు. తాము ఆర్డర్ ఇచ్చినప్పుడే.. దేశంలో ఏ రాష్ట్రానికైనా తక్కువ ధరకు కిట్లు ఇస్తే.. తాము కూడా అదే ధర చెల్లిస్తామని షరతు పెట్టినట్టు స్పష్టం చేశారు.

విమర్శలకు తెరదించేలా..

విమర్శలకు తెరదించేలా..

జగన్ రియాక్షన్‌ టెస్టింగ్ కిట్ల కొనుగోలుపై వినిపిస్తున్న విమర్శలకు చెక్ పెట్టేటట్టు కనిపిస్తోంది. ఛత్తీస్‌ఘడ్ రూ.337కి కొనుగోలు చేసిన కిట్‌ను ఏపీ ప్రభుత్వం రూ.1200కి కొనుగోలు చేసిందని వినిపిస్తున్న విమర్శలకు తెరదించేలా ఉంది. ఏ రాష్ట్రానికి తక్కువ ధరకు కిట్లను విక్రయించినా.. తమకూ అదే ధరకు కిట్లను ఇవ్వాలని షరతు పెట్టినట్టుగా జగన్ చెప్పడాన్ని బట్టి.. ఏపీకి కూడా అదే ధర వర్తించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే జగన్ స్పష్టతనిచ్చినప్పటికీ ప్రతిపక్షాలు ఈ అంశాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేలా కనిపించడం లేదు.

లక్ష కిట్ల కొనుగోలు..

లక్ష కిట్ల కొనుగోలు..


ఇటీవల ఏపీ ప్రభుత్వం కరోనా వైద్య పరీక్షల కోసం సౌత్ కొరియా రాజధాని సియోల్ నుంచి లక్ష టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకుంది. మూడు రోజుల క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ వీటిని ప్రారంభించారు. అదే సమయంలో పొరుగునే ఉన్న ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం కూడా కిట్లను కొనుగోలు చేసింది. తమ ప్రభుత్వం 75వేల కరోనా ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను కొనుగోలు చేసిందని.. ఒక్కో కిట్‌ ధర కేవలం రూ.337 మాత్రమేనని, దీనికి జీఎస్టీ అదనమని అక్కడి మంత్రి టీఎస్ సింగ్ దేవ్ ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. దేవ్ చేసిన ఈ ట్వీట్ ఏపీలో చిచ్చు పెట్టింది. అదే దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం రూ.1200 కొనుగోలు చేసిందనే విమర్శలు వెల్లువెత్తాయి.అయితే ప్రభుత్వం మాత్రం తాము అంత ధరకు కొనుగోలు చేయలేదని... రూ.700కి కొనుగోలు చేశామని స్పష్టం చేసింది.

ప్రతిపక్షాల విమర్శలు.. ప్రభుత్వ సమాధానం..

ప్రతిపక్షాల విమర్శలు.. ప్రభుత్వ సమాధానం..


ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం కంటే ఏపీ ప్రభుత్వం రెట్టింపు ధరకు కిట్లను కొనుగోలు చేయడంపై బీజేపీ ఏపీ చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణ నేరుగా ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. కమీషన్లు తీసుకున్నారా అంటూ ట్వీట్‌ చేసి వివాదానికి తెరలేపారు. అయితే ప్రభుత్వం మాత్రం ఐసీఎంఆర్ నిర్దేశించిన ధరలకే కొనుగోలు చేశామని చెబుతోంది. తాము ఆర్డర్‌లు ఇచ్చేనాటికి సౌత్ కొరియాకు చెందిన కంపెనీకి ఇండియాలో యూనిట్ లేదని, అందుకే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని వివరణ ఇచ్చింది. ఏ రాష్ట్రానికైనా తక్కువ ధరకు ఇస్తే అదే ధర తాము చెల్లిస్తామని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నామని తెలిపింది. భవిష్యత్‌లో ఈ కిట్ ధర రూ.50కి పడిపోయే అవకాశం కూడా ఉందని తెలిపింది. కాబట్టి అనవసర దుష్ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Recommended Video

Leader's Wishing Chandra Babu On His 70th Birthday | ఎవరెవరు విష్ చేశారంటే..!!

English summary
AP CM YS Jagan appreciated state health department for importing rapid testing kits quickly from South Korea. He said that state government made a deal before giving orders to that company. According to that if any state buys those kits for low rate,same will be applicable to Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X