ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె, ఐఎఎస్ అధికారిణి వివాహ రిసెప్షన్లో జగన్: సాయంత్రానికి ఒడిశాకు
శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒడిశా పర్యటన మొదలైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆయన సమావేశం కానున్నారు. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్ట్, కొఠియా గ్రామాల వివాదాలను పరిష్కరించుకోవడంలో భాగంగా వైఎస్ జగన్.. ఒడిశా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ సాయంత్రానికి ఆయన రాజధాని భువనేశ్వర్ చేరుకోనున్నారు. అనంతరం నవీన్ పట్నాయక్‌తో సమావేశమౌతారు. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ భువనేశ్వర్‌కు చేరుకున్నారు కూడా.
17న
ఏపీ
మంత్రివర్గం
కీలక
సమావేశం:
ఆ
మరుసటి
రోజే..!
ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు వైఎస్ జగన్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చేరుకున్నారు. ఒడిశా సరిహద్దుల్లో ఉంటుందీ టౌన్. పర్లాకిమిడికి ఆనుకుని ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాతపట్నం శాసన సభ్యురాలు రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరయ్యారు. రెడ్డి శాంతి కుమార్తె రెడ్డి వేదిత ఐఎఎస్ అధికారిణి. 2014 బ్యాచ్ అధికారిణి ఆమె. ఆ సంవత్సరం జరిగిన యూపీఎస్సీ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో 71వ ర్యాంక్‌ను సాధించారు.

ఆమె తండ్రి, రెడ్డి శాంతి భర్త కూడా సివిల్ సర్వీసెస్ అధికారే. రెడ్డి నాగభూషణ్ రావు కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. రుచిత్ను రెడ్డి వేదిత పెళ్లి చేసుకున్నారు. ఆ నూతన దంపతుల వివాహ రిసెప్షన్‌కు వైఎస్ జగన్ హాజరయ్యారు. శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. నూతన వధూవరులను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. అనంతరం ఒడిశాకు బయలుదేరి వెళ్లారు.

సాయంత్రం 5 గంటలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమౌతారు. ఆంధ్రా, ఒడిశాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న వివిధ అంశాలపై చర్చిస్తారు. ఏజెన్సీ ఏరియాల్లో రోడ్ల నిర్మాణం, సరిహద్దులు సహా అనేక విషయాలు వారిద్దరి మధ్య ప్రస్తావనకు వస్తాయని తెలుస్తోంది. వంశధార నదిపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలు చర్చకు రానున్నాయి. ఆయా అంశాలన్నింటినీ రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ఏ మాత్రం దెబ్బతినకుండా ఎలా పరిష్కరించుకోవాలనే విషయంపై చర్చిస్తారు.
