వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇచ్చిన మాటకు కట్టుబడి... ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త... 52వేల మందికి బెనిఫిట్...

|
Google Oneindia TeluguNews

ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 52వేల మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో చేర్చి.. సమగ్ర నివేదికను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు ఇక పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తొలి కేబినెట్ సమావేశంలోనే... ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై జగన్ సర్కార్ కేబినెట్ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అసెంబ్లీలో దానికి ఆమోద ముద్ర వేసింది.

Recommended Video

APSRTC Employees As Government Employees Says YS Jagan
ఇచ్చిన మాటకు కట్టుబడి...

ఇచ్చిన మాటకు కట్టుబడి...


వైసీపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చాక ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి బదలాయించి.. ఆర్టీసీ సంస్థను మాత్రం యదావిధిగా కొనసాగిస్తున్నారు. ఆర్టీసీలో కేంద్రానికి 33శాతం వాటా ఉండటంతో... సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యపడలేదు.

పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా...

పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా...


ఇకనుంచి ఆర్టీసీ ఉద్యోగులు ఇక పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతారు. ఆర్టీసీ సిబ్బంది వేతనాల కోసం ప్రభుత్వం దాదాపు రూ.3600 కోట్లు భరించనుంది. నిజానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో చేర్చడాన్ని చాలామంది తప్పు పట్టారని... అయినప్పటికీ జగన్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో మంత్రి పేర్ని నాని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును కూడా జగన్ ప్రభుత్వం 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే.

ఫించన్ పథకంపై సమీక్ష...

ఫించన్ పథకంపై సమీక్ష...

కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం (సీపీఎస్‌), కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ గురువారం(నవంబర్ 12) సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో కలిపి మొత్తం 1,98,221 మంది సీపీఎస్‌ పరిధిలో ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. వీరిలో 1,78,705 మంది ప్రభుత్వ ఉద్యోగులు,16,221 మంది యూనివర్సిటీలు,విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు,3295 మంది గ్రాంట్ ఇన్ ఎయిడ్ పరిధిలో ఉన్నట్లు చెప్పారు. ఏ పెన్షన్ విధానంలో వీరికి ఎంత ఖర్చవుతుందో సీఎంకు వివరించారు.

కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై...

కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై...

సమీక్షా సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ... కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసినా... వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ అమలుచేశామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు న్యాయపరమైన చిక్కులు ఉండటంతో... వారికి ఆర్థిక ప్రయోజనాు చేకూర్చేలా విధివిధానాలు రూపొందించాలని జగన్ అధికారులను ఆదేశించారు.

English summary
Andhr Pradesh CM YS Jagan on Thursday given orders to officials to list RTC employees as state government employees.So that The long cherished dream of AP State Road Transport Corporation (APSRTC) employees to be treated on a par with those in State government sector is set to become a reality
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X