• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'పీపుల్స్ డాక్టర్' ప్రాణాలు నిలబెట్టేందుకు-సీఎం జగన్ ఔదార్యం-రూ.1 కోటి ఆర్థిక సాయం

|

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడుకి చెందిన ప్రభుత్వ వైద్యుడు భాస్కర రావు 'ఊపిరితిత్తుల మార్పిడి' శస్త్ర చికిత్స కోసం ప్రభుత్వం తరుపున రూ.1కోటి విడుదల చేశారు. అవసరమైతే మరో రూ.50 లక్షలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒక వైద్యుడి ప్రాణం నిలపడం కోసం ఖర్చుకు వెనుకాడకుండా సీఎం జగన్ స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

కారంచేడు పీహెచ్‌సీలో విధులు...

కారంచేడు పీహెచ్‌సీలో విధులు...


ప్రకాశం జిల్లా కారంచేడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డా.భాస్కర రావు వైద్య సేవలందిస్తున్నారు. దాదాపు 6 వేల మందికి ఆయన కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఎంతోమంది పేషెంట్లు ఆయన అందించిన వైద్యంతో కోలుకున్నారు. కోవిడ్ వైద్య సేవలు అందిస్తున్న క్రమంలోనే ఏప్రిల్ 24న ఆయన వైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో చేరారు.

విజయవాడ నుంచి హైదరాబాద్ తరలింపు...

విజయవాడ నుంచి హైదరాబాద్ తరలింపు...


ఆయుష్ ఆస్పత్రిలో 10 రోజుల చికిత్స తర్వాత హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి ఆయన్ను షిఫ్ట్ చేశారు. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. భాస్కరరావుకు ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సిందేనని... ఇందుకోసం రూ.1.50 కోట్లు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. భాస్కరరావు కుటుంబ సభ్యులకు అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ఆశ్రయించి సాయం కోరారు.

  Corona Vaccine విధానంలో కేంద్రం వివక్ష, సగానికి పైగా డోసులు వారికే || Oneindia Telugu
  తక్షణమే స్పందించిన సీఎం జగన్...

  తక్షణమే స్పందించిన సీఎం జగన్...

  మంత్రి బాలినేని... భాస్కరరావు పరిస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తక్షణమే స్పందించిన సీఎం జగన్ చికిత్స కోసం రూ.1కోటి విడుదల చేశారు. అవసరమైతే మరో రూ.50లక్షలు కూడా ప్రభుత్వం తరుపున అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డాక్టర్‌ బాస్కర్‌రావు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని... ఆ మేరకు వారికి భరోసా ఇచ్చామని మంత్రి బాలినేని తెలిపారు. భాస్కరరావు కుటుంబసభ్యులు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. డా.భాస్కర రావు భార్య భాగ్యలక్ష్మి కూడా వైద్యురాలే. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. కారంచేడు,చీరాల,పర్చూరు పరిసర ప్రాంతాల్లో ఈ డాక్టర్ దంపతులకు మంచి పేరు ఉంది. భాస్కరరావు ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసి అక్కడి ప్రజలు విరాళాల రూపంలో రూ.20లక్షలు వరకు సాయం చేసినట్లు తెలుస్తోంది.

  English summary
  Andhra Pradesh CM YS Jagan released Rs.1 cr fund for doctor Bhaskar Rao lungs transplantation.Government is ready to give more Rs.50 lakh for treatment,said Minister Balineni Srinivas.N. Bhaskara Rao, a doctor and Medical Officer of the Primary Health Centre (PHC) at the remote Karamchedu village in Prakasam district, had helped hundreds of people infected by COVID-19 stage a smart recovery, instilling in them the much-needed courage to combat the viral disease.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X