వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ .. నూతన ఇసుక విధానంపై .. ప్రకటించిన సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నూతన ఇసుక విధానంపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో ఏపీలో మరోన్మారు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లాలని ఆయన మంత్రులకు సూచించారు. అయితే ఈ సారి ముందుగా ముసాయిదా విధానాన్ని తయారు చేసి అప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యాలని , ఆ తర్వాతే ఇసుక విధానాన్ని ప్రజాభిప్రాయం మేరకు ఖరారు చెయ్యాలని ఆయన స్పష్టం చేశారు .

హైదరాబాద్ కు వానగండం .. కష్టంగా మారిన సహాయక చర్యలు ..కట్టలు తెంచుకుంటున్న ప్రజాగ్రహంహైదరాబాద్ కు వానగండం .. కష్టంగా మారిన సహాయక చర్యలు ..కట్టలు తెంచుకుంటున్న ప్రజాగ్రహం

అవినీతికి తావు లేకుండా నూతన ఇసుక విధానం

అవినీతికి తావు లేకుండా నూతన ఇసుక విధానం

నూతన ఇసుక విధానంపై సమీక్ష జరిపిన సీఎం జగన్ రాష్ట్ర మంత్రులు పేర్ని నానీ , కొడాలి నానీ , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో , పంచాయితీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో కీలక సూచనలు చేశారు . ఇసుక తవ్వకాల్లోనూ , రవాణాలోనూ అవినీతికి తావు లేకుండా చూడాలని చెప్పారు . ఇసుక ధరలు కూడా రీజనబుల్ గా ఉండాలని సీఎం సూచించారు . నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు .

 పారదర్శకంగా ఇసుక రవాణా చెయ్యాలి

పారదర్శకంగా ఇసుక రవాణా చెయ్యాలి

పారదర్శకంగా ఇసుక రవాణా ఉండాలని చెప్పారు . ఇసుక సరఫరాలో కూడా ఎఫిషియెన్సీ ఉండాలని చెప్పారు .
చలానా కట్టి ఎవరైనా వచ్చి తీసుకు తీసుకుపోయే విధంగా కొత్త విధానం ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఇసుక రీచ్ ల సామర్థ్యం పెంచితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు . కొత్త ఇసుక విధానం ఏ విధంగా ఉండాలి ? ఏ రేటుకి అమ్మాలి అన్నది ప్రాంతాలవారీగా నిర్ణయించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

 ఇసుకపై సమీక్షలో పలు సూచనలు చేసిన సీఎం జగన్

ఇసుకపై సమీక్షలో పలు సూచనలు చేసిన సీఎం జగన్

నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరలకు అమ్మితే ఎస్ఈ బీ రంగప్రవేశం చేస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఇసుక సులభంగా దొరికే విధానాన్ని రూపొందించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్మాణాలకు బలహీనవర్గాల , ఇళ్లకు సబ్సిడీపై ఇసుక సరఫరా చేయాలని, అందుకోసం టోకెన్ విధానాన్ని తీసుకు రావాలని చెప్పారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల వరకు సబ్సిడీపై ఇసుక సరఫరా చేయవచ్చన్న అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం జగన్ ఆదేశించారు .

Recommended Video

PIL in SC Against AP CM Jagan For Removal Of His Post వ్యక్తిగత ప్రయోజనం పొందేందుకు జగన్‌ ఫిర్యాదు
 నూతన ఇసుక విధానం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ .. తర్వాతే విధానం ఖరారు

నూతన ఇసుక విధానం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ .. తర్వాతే విధానం ఖరారు

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ఇసుక విధానం ముసాయిదాను రూపొందించాలని, ఆ రూపొందించిన ముసాయిదా పై ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, ప్రజల అభిప్రాయం మేరకు కొత్త ఇసుక విధానం ఖరారు చేయాలని మంత్రుల బృందానికి సూచించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న ఇసుక విధానం పై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో పారదర్శకంగా ఇసుకను ప్రజలకు అందించడం కోసం కొత్త అంశాలతో ముసాయిదా రూపొందించాలని సీఎం జగన్ సూచించడం గమనార్హం

English summary
CM Jaganmohan Reddy directed the group of ministers to formulate a new sand policy ,hold a referendum on the draft and finalize the new sand policy as per the public opinion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X