వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేలకు జగన్ సీరియస్ వార్నింగ్ .. అలా చేస్తే సహించేది లేదు

|
Google Oneindia TeluguNews

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారం చేపట్టిన నాటి నుండి ఒక స్పష్టమైన విజన్ తో ముందుకు పోతున్నారు. పారదర్శకమైన, అవినీతి రహిత పాలన తమ ధ్యేయమని తొలినాటి నుండీ చెప్తున్న జగన్ వైసీపీపై ఎంతో నమ్మకంతో అధికారంలోకి తీసుకుని వచ్చిన ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని నిర్ణయించారు. ఇక అందులో భాగంగానే సొంత పార్టీలోని మంత్రులైన, ఎమ్మెల్యే అయినా సరే ఆకాంక్షల మేరకు పని చేయకుంటే ఉపేక్షించేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఏపీ సీఎం జగన్ కు సవాల్ .. బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో వైఎస్సార్ తరహా నిర్ణయం తీసుకుంటారా?ఏపీ సీఎం జగన్ కు సవాల్ .. బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో వైఎస్సార్ తరహా నిర్ణయం తీసుకుంటారా?

Recommended Video

ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం
మంత్రులకు లేఖ రాసి తనతో చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవద్దన్న జగన్

మంత్రులకు లేఖ రాసి తనతో చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవద్దన్న జగన్

మొన్నటికి మొన్న మంత్రులు అందరూ ఏకతాటి మీద పనిచేయాలని, నవరత్నాల అమలే ధ్యేయంగా పని చేయాలని, విధానపరమైన నిర్ణయాలు ఎవరికి వారు తీసుకుంటే ఇబ్బందులు పడతారని జగన్ మంత్రులకు లేఖ రాశారు. తనకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని సీరియస్ గానే మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. అందరూ సమిష్టిగా పనిచేస్తేనే అనుకున్న లస్జ్యాలను చేరుకోగలమని ఆయన మంత్రులకు సూచించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలని, తనతో చర్చించాకే ఏ నిర్ణయం అయినా ప్రకటించాలని ఆయన గట్టిగా చెప్పారు.

ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్ .. అవినీతికి పాల్పడితే అంతే సంగతి

ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్ .. అవినీతికి పాల్పడితే అంతే సంగతి

ఇక తాజాగా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు జగన్. అవినీతికి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. దోపిడీకి తెగబడితే నష్టం జరిగేది మీకే అంటూ హెచ్చరించారు.
ఇక అలా చేసిన ఎవరికైనా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవని స్పష్టం చేశారు .తప్పు చేసిన వారు ఎంత పెద్ద వారైనా, ఏ స్థాయిలో ఉన్నవారినైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రతినిధులు పనిచేయాలని అలా కాకుండా స్వప్రయోజనాల కోసం చూసుకుంటే దెబ్బతింటారని పేర్కొన్నారు. ఎంతో విశ్వాసంతో ప్రజలు ఎన్నుకున్నందుకు వారి సమస్యల పరిష్కారం కోసం, వైసిపి మేనిఫెస్టో అమలు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఇక వైసిపి మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించాలని ఆయన అన్నారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ జగన్ ఎమ్మెల్యేలకు సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ దెబ్బ తిన్న కారణం అదే.. అందుకే ముందు జాగ్రత్త పడుతున్న ఏపీ సీఎం జగన్

టీడీపీ దెబ్బ తిన్న కారణం అదే.. అందుకే ముందు జాగ్రత్త పడుతున్న ఏపీ సీఎం జగన్

గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అటు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇక అధికారులు సైతం అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. అక్రమాలకు తెర తీశారు. దీంతో అటు పాలకుల, అధికారుల దోపిడీని భరించలేక ప్రజలు గత ఎన్నికల్లో టిడిపిని చావుదెబ్బ కొట్టి వైసీపీకి అఖండ విజయాన్ని అందించారు. గత పాలకులు చేసిన తప్పు లకే ప్రజలు ఈ విధమైన తీర్పు ఇచ్చారని భావించిన జగన్ ఇక తమ పాలనలో అలాంటి తప్పులు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మొదటి నుండి పార్టీలోని మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించమని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు.

English summary
AP Chief Minister YS Jagan Mohan Reddy has made the interesting comments during the ongoing Collectors conference at Praja Vedika on Monday Speaking on the occasion, CM YS Jagan has warned that his government will not support or standby the MLA's who are involved in the irregularities under any circumstances. CM YS Jagan has clarified that in this issue the government will not tolerate anyone, no matter how big or whatever the position he might be in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X